06.06.2020 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు దామూ అన్నా - నానాసాహెబ్ రాస్నే గురించి మరికొంత
సమాచారమ్ తెలుసుకుందాము. ఈ సమాచార సేకరణ shirdisaisevatrust.org చెన్నై వారినుండి గ్రహింపబడింది.
సాయిలీల - మరాఠీ రచయిత్రి - శ్రీమతి ముగ్ధ దివాద్కర్
ఆంగ్లానువాదమ్ - శ్రీ సుధీర్
తెలుగు అనువాదమ్ - ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఆంగ్లానువాదమ్ - శ్రీ సుధీర్
తెలుగు అనువాదమ్ - ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
దామూ అన్నా – నానాసాహెబ్ రాస్నే - 5 వ.భాగమ్
దత్తాత్రేయ దామోదర్ అనబడే నానాసాహెబ్ రాస్నే
దామూ అన్నా మరణించిన తరువాత నానాసాహెబ్
షిరిడీ వెళ్లాడు. తండ్రి
మరణం అతనిని బాగా కలిచివేసింది. బాబా సమాధిముందు రోదించడం మొదలుపెట్టాడు. ఓదార్చడానికి కూడా వీలులేనంతగా దుఃఖిస్తున్నాడు.
ఆసమయంలో సమాధినుండి బాబా మాటలు వినిపించాయి “అరే, నానా,
కర్మలు అన్ని పూర్తయి పదునాలుగ రోజు కర్మ కూడా పూర్తయింది. దుఃఖించవలసిన కాలమంతా గడిచిపోయింది. అవునా కాదా? నువ్వు ఇపుడు
మధురపదార్ధాలను కూడా భుజించావు. ఇక నువ్వు కన్నీరు కార్చరాదు”.