Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, February 3, 2014

పుణ్యనదీ జలములు

0 comments Posted by tyagaraju on 12:11 AM
                              
                    
03.02.104 సోమవారం (హైదరాబాదునుండి)
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

పుణ్యనదీ జలములు 

నిన్న ఉదయం దుబాయి నుండి భారతదేశానికి రావడం జరిగింది.  వీలువెంబడి సాయి లీలలను ప్రచురిస్తూ ఉంటాను. ఈ రోజు మన సాయి బంధువులకు ఒక ముఖ్య విషయం తెలియచేస్తున్నాను.  


సాయి బంధువులకు ఒక విన్నపం

ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని చినమామిడిపల్లిలో 2014వ.సంవత్సరం మార్చ్ నెల 19వ.తారీకున బాబావారి విగ్రహ ప్రతిష్ట జరుపబడుచున్నది. ఈ సందర్భంగా బాబావారి అభిషేకానికై భారత దేశములోని అన్ని పుణ్యనదులలోని జలములను సేకరింపబడుచున్నవి.   సద్గురు బాబా వారి అనుగ్రహంతో చాలా మట్టుకు పుణ్యనదుల జలమును సేకరింపగలిగాము.  ఇంకను కొన్ని ప్రాంతములనుండి జలమును సేకరంపవలసి ఉంది.  కనుక సాయిభక్తులు ఎవరైనా సరే వారి వారి ప్రాంతములలోనున్న పుణ్యనదులలోని జలమును ఒక లీటరు సీసాలొ సేకరించి పంపవలసినదిగా కోరబడుచున్నారు. సాయి అనుగ్రహానికి పాత్రులు కండి ఆయన దీవెనలను అందుకొనండి. ఈ కార్యక్రమమంతా కూడా ఫిబ్రవరి 15 లోపున జరిగినచో కార్యక్రమము విజయవంతంగా జరుగును.  ముఖ్య గమనిక:  కుళాయిలోని నీటిని మాత్రం సేకరించవద్దని మనవి. మీరు పంపించే సీసాల మీద మీరు సేకరించి పంపుతున్న జలము ఏపుణ్య నదికి సంభంధించినదో ఒక కాగితం మీద వ్రాసి సీసాకు అంటించి పంపండి. మీరు సేకరించిన జలమును హైదరాబాదులోని శ్రీనగేష్ గారికి అందించవలసినదిగా కోరుచున్నాము.  సంప్రదించవలసిన నంబరు: 9849200775 ఈమైల్.ఐ.డీ. sreesree@outlook.com     

ఇంకనూ ఈ క్రింద వివరింపబడిన పుణ్యనదులు, సముద్రములలోని జలములను ఇంకనూ సేకరింపవలసి ఉంది.

  నది పేరు                            రాష్ట్రము/పట్టణము

  చంబల్                              మధ్యప్రదేశ్

  సన్                                   అమర్కాంటక్, మధ్యప్రదేశ్

  బెట్వా                                మధ్యప్రదేష్, ఉత్తర ప్రదేశ్

  కోసి                                   కోసీ, బీహార్

  ఇండస్                              జమ్మూ & కాష్మీర్

  చంద్రభాగ నది(పండరీపూర్ 
  నందు ప్రవహించే నది)        పండర్పూర్

  ఇంద్రాయణి నది (షిరిడీనుండి        అలంది (షిరిడీకి దగ్గరలో)
  80 కి.మీ.దూరంలో ప్రవహిస్తున్న నది)     

  గోదావరి (నాసిక్)                 నాసిక్

  లుని                                  ఆజ్మీర్ (జైపూర్)

  బ్రహ్మ కుండ్ పుష్క             ఆజ్మీర్ (జైపూర్)

  సబర్మతి                            అహమ్మదాబాద్

  కావేరి                                కర్నాటక

  సరస్వతీ                            గుజరాత్

  పెన్నా నది                         నెల్లూరు (ఆంధ్రప్రదేశ్)

  నాగావళి                            శ్రీకాకుళం (ఆంధ్రప్రదేశ్)

  సువర్ణముఖి                      శ్రీకాళహస్తి (ఆంధ్రప్రదేశ్)

  భీమ                                 అమరాజ

  పసిఫిక్ మహా సముద్రం      కాలిఫోర్నియా 

సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)  

  
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List