12.07.2018 గురువారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయిబాబా నేటికీ సజీవంగానే ఉండి సహాయం చేస్తున్నారా?
3 వ.భాగమ్
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
అట్లాంటా (అమెరికా) ఫోన్. నంబర్ : 1 571 594 7354
బాబా
ముందు నైవేద్యానికి ఉంచబడిన పండ్ల మీద కూడా అక్షరాలు కనిపించాయి. ఎస్.ఎన్. చౌదరిగారికి శ్రీ బి.వి.ఎన్. స్వామిగారికి
ఇంకా అక్కడ ఉన్న భక్తులందరికీ బాబా తమయందు ఎంతో గొప్ప అనుగ్రహాన్ని చూపారన్నదానికి
ప్రత్యక్ష నిదర్శనం కనిపించింది. బాబా నేటికీ
సజీవంగానే ఉండి సహాయం చేస్తున్నారా అన్న ప్రశ్నకు సమాధానం శ్రీ ఎస్.ఎన్. చౌదరిగారికి
లభించింది. ఇపుడు ప్రత్యక్షంగా ఆయనకు అనుభవపూర్వకంగా
తెలిసింది. బాబా ఇప్పటికీ సజీవంగానే ఉన్నారనీ,
భక్తులు తీసుకువచ్చిన నైవేద్యాలను స్వీకరించారని తన భక్తులకు నిగూఢంగా సహాయపడుతూ ఉంటారనీ
ప్రగాఢమయిన విశ్వాసం అందరిలోను కలిగింది. ఈ
సంఘటన ఆయనలో గొప్ప మార్పుని తీసుకొనివచ్చింది.