04.04.2023 మంగళవారమ్
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఓమ్ శ్రీ గణేశాయనమః
శ్రీ మాత్రేనమః
ఓమ్ శ్రీ సాయినాధాయనమః
శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః
శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే
శ్రీ సాయి సత్ చరిత్ర –18 వ.భాగమ్
ప్రేరణ ; గీతాచార్యుడు శ్రీ కృష్ణపరమాత్మ, మరియు సాయినాధులవారు
ప్రేరణా స్థలమ్ … శ్రీ వేణుగోపాలస్వామి
ఆలయమ్
సమన్వయ కర్త ; ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట్, హైదరాబాద్
ఫోన్. 9440375411
& 8143626744వ.
శ్రీమద్భగవద్గీత – అధ్యాయమ్ – 7 – జ్ణాన
– విజ్ణానయోగము
శ్లోకమ్ 22
స తయా శ్రధ్ధయా యుక్తః తస్యారాధనమీహతే
లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హి తాన్
అట్టి సకామ భక్తుడు తగిన భక్తిశ్రధ్ధలతో
ఆ దేవతనే ఆరాధించును. తత్పలితముగా నా అనుగ్రహము
వలననే ఆ దేవతద్వారా ఆ భోగములను అతడు తప్పక పొందగలడు.
శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్ – 28
మేఘశ్యాముడు హరివినాయక సాఠేగారి వంటబ్రాహ్మణుడు. అతడు అమాయకుడయిన శివభక్తుడు. ఎల్లప్పుడు శివపంచాక్షరి జపిస్తూ ఉండేవాడు. అతనికి సంధ్యావందనము గాని, గాయత్రి మంత్రము గాని తెలియదు. సాఠేగారు అతనికి గాయత్రి మంత్రముతో సంధ్యావందనము నేర్పించారు.