Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, June 30, 2012

సాయి.బా.ని.స. అనుభవాలు - 23

0 comments Posted by tyagaraju on 9:46 PM
       

        
                                           
01.07.2012  ఆదివారము


ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు



సాయి.బా.ని.. అనుభవాలు -  23


మన సాయి బంధువులందరూ ఇంతకు ముందు బాబాతో సాయి.బా.ని.. అనుభవాలు చదివారు రోజున మరికొన్ని అనుభవాలను మీముందు ఉంచుతున్నాను.  16.06.2012 తేదీన నేను సాయి..బా.ని.. యింటికి వెళ్ళి ఆయనను  కలిసే భాగ్యం కలిగింది.  ఆరోజున ఆయన స్వయంగా క్రింది అనుభవాలను చెప్పారువాటిని యధాతధంగా మీముందు ఉంచుతున్నాను.

                             ***
అనుభవం  -  23 ( కలల ద్వారా పొందిన అనుభవాలు)

సాయియే మారుతి

సాయిబానిస అనేక సార్లు సత్ చరిత్ర చదివినపుడెల్ల మహల్సాపతి ఖండోబా మందిరం వద్ద "ఆవో సాయి" అని నామకరణం చేసిన సంఘటన గుర్తుకు వచ్చి, బాబాకు అంతకు ముందు, మహల్సాపతి పిలవకముందు పేరు లేదా అనే బాధతో రాత్రి కలలో ప్రార్ధించి, బాబా నీకు అంతకు ముదు నామమే లేదా? అన్నపుడు నాపేరు లక్షల సంవత్సరాల క్రితం కూడా సాయియేకావాలంటే నీదగ్గరున్నటువంటి ఆంగ్లేయ డిక్షనరీ లో ఉన్న సాయి అన్న పదానికి అర్ధము చూసుకో అనిసాయి ఒక అజ్ఞాత వ్యక్తి రూపంలో చెప్పారునేను మరుసటి దినము డిక్షనరీ చూడగా సాయి అన్న పదానికి అర్ధముదక్షిణమెరికాలోని బ్రెజిల్ దేశములోని అడవులలోని కోతులను  (*) సాయి అందురు.  



ఒకానొకపుడు దక్షిణ అమెరికా, ఆఫ్రికా, భారతఖండములన్నియు భూమధ్యరేఖ పై కలిసి ఉండేవిబాబా కూడా ధులియా కోర్టులో తనవయస్సు లక్షల సంవత్సరాలని తనని సాయి అని పిలుస్తారని తన తండ్రి పేరు కూడా సాయి అని తెలియచేశారుదీనిని బట్టి మనము సాయి వానరులలో అగ్రగణ్యుడయిన మారుతిగా సాయి మారుతి అని పూజిస్తున్నాము


(సాయి పాఠకులకు 20 చాంబర్స్ డిక్షనరీ లోని సాయి అన్నపదానికి అర్ధము ఉన్న పేజీ  833 లింక్ ఇక్కడ ఇస్తున్నానుచూడండి.  

లాపిడేషన్:

సాయి.బా.ని.. సాయి తత్వం మీద అనేక విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాసతో హైదరాబాదులో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు కలిగి శ్రీషిరిడీ సాయిపై అనేక పుస్తకాలు రచించిన ఒక భక్తురాలి వద్దకు వెళ్ళి  విషయాలు తెసులుకోవాలనే తపనతో ఉండగా, బాబా గారి అనుమతిని కోరినపుడు, బాబా కలలో సాయి.బా.ని.. కు దర్శనమిచ్చి, నీవు ఆవిడ దగ్గరకు నా గురించి తెలుసుకోవడానికి వెళ్ళినా ఆమె నీపై లాపిడేషన్ ఆపరేషన్ చేయును జాగ్రత్త అని చెప్పి వారించినారు

మరుసటిరోజు లాపిడేషన్ అనే మాటకు అర్ధము తెలుసుకోవడానికి డిక్షనరీ చూడగా రాళ్ళతో కొట్టి శిక్షించుట అని అర్ధము కనిపించినది అర్ధము గ్రహించిన తర్వాత సాయి.బా.ని.. ఆమె వద్దకు వెళ్ళడానికి సాహసించలేదు
సాయి పాఠకులకు 20 చాంబర్స్ డిక్షనరీ లోని లాపిడేషన్ అన్నపదానికి అర్ధము ఉన్న పేజీ 512 .పేజీ లింక్ ఇక్కడ ఇస్తున్నానుచూడండి


బ్రోస్:

సాయి.బా.ని.. ఒకసారి బ్రిటిష్ సాయి భక్తుడు (ఆర్థర్ ఆస్ బోర్న్రాసిన పుస్తకముపై విశ్లేషణ చేయుటకు ప్రయత్నిస్తుండగా
సాయి.బా.ని..కు కఠినతరమయిన ఆంగ్ల భాష పదాలను అనువాదము చేయుటకు కష్ఠతరమయిన సందర్భములో బాబాను   ప్రార్ధించగా, బాబా స్వప్న దర్శనములో తెల్లటి సూటు, ధరించి ఒక మల్టీ నేషనల్ కంపనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా దర్శనము ఇచ్చిసాయి.బా.నిస.ను, తెల్లటి అంబాసిడర్ కారులో  ఒక పెద్ద ఆధునిక పరమైన హోటలుకు తీసుకుని వెళ్ళారుఆయనకు "బ్రోస్" అనే వేడి పానీయమును త్రాగడానికి ఇచ్చి ఆశీర్వదించెనుకలలో ఆవేడి పానీయము త్రాగుటవలన నాలిక కాలిన అనుభూతిని పొంది సాయి.బా.ని.. నిద్రనుంచి లేచి కూర్చొనెనుఉదయము నిద్రనుండి లేచి బ్రోస్ అనే పానీయము గురించి ఎంతమందిని అడిగినను అర్ధము చెప్పలేకపోయారుఅపుడు ఆయనదగ్గర ఉన్నటువంటి ఛాంబర్స్ 20యత్ సెంచరీ డిక్షనరీ లో బ్రోస్ పదానికి అర్ధము చూడగా క్రింది విధముగా ఉన్నది
బ్రోస్: వేడి పాలలో ఓట్స్ వేసి అందులో వెన్న, తేనె కలిపిన పానీయము.

( సాయి భక్తులకు బ్రోస్ అన్నపదానికి అర్ధము ఉన్న పేజీ లింక్ 118 ఇస్తున్నాను చూడండి )


నీకు జన్మ ఇచ్చిన తల్లే నీపాలిట దేవత:

2000 సంవత్సరము అక్టోబరులో చికాగో  కాన్ ఫరెన్స్ కు (విశ్వసాయి భక్తుల సమ్మేళనమువెళ్ళేముందు బాబా సాయి.బాని.సకు తన మాతృమూర్తి రూపములో దర్శనమిచ్చారు.   100 సంవత్సరముల క్రితం, వివాకానందులవారు చికాగోలో ఆధ్యాత్మిక ఉపన్యాసము (సర్వమత సమ్మేళనము) ఇవ్వడానికి వెళ్ళేముందు, రామకృష్ణ పరమహంసవారు ఆయనకు జగన్మాత కాళికాదేవిని ప్రత్యక్ష దర్శనము చేయించారు.
 
సాయి.బా.ని.., మరి నేను కూడా చికాగో వెడుతున్నాను కదా, మూడవ అధ్యాయములో త్రిగుణాత్మ స్వరూపము నేనే, జగన్మాతను నేనే అని చెప్పావు కదా


మరి నాకు కూడా అమ్మవారి దర్శనము కలిగించు అని అడిగారు.

బాబా  సాయి.బా.ని. కు ఆయన మాతృమూర్తి రూపములో దర్శనమిచ్చారు.  ఆయన తల్లి సాయి.బా.ని.సకు. మంచి పట్టుచీర కట్టుకుని, నగలతో వచ్చి సాయి.బా.ని.. ప్రక్కన కూర్చుని, ఎందుకు పిలిచావు అని అడగగా నిన్నెవరు పిలిచారు అని సాయి.బా.ని.. తన తల్లిని జగన్మాతగా ఊహించలేక తూలనాడి  పంపివేయగా, బాబా దర్శనమిచ్చి నీతల్లే నీజగన్మాత.  ఆమెను నీవు గుర్తించకుండా, కనీసం ఆమెకు నమస్కారము కూడా చేయకపోవడం నీ దురదృష్ఠం అని ఫకీరు రూపములో దర్శనము ఇచ్చి చెప్పారు.
                            


(*) నా విశ్లేషణ ::


(డార్విన్ సిధ్ధాంతము ప్రకారము శాస్త్రీయముగా చూసినా కోతియే మనకు ఆదిమానవుడు. సాయి ఎప్పుడూ తన గొప్పతనాన్ని చాటుకోలేదు.  ఆ గొప్పతనమంతటినీ తన భక్తులకు సంపాదించి పెట్టారు..  హేమాద్రి పంత్ చేత తన చరిత్రను తానే వ్రాయించుకొని  సాయి సత్ చరిత్రను వ్రాసిన కీర్తిని ఆయనకు సంపాదించి పెట్టారు.  అలాగే "సాయి" అన్న మాట లక్షల సంవత్సరాల క్రితమే ఉన్నా తన నామధేయాన్ని భక్త మహల్సాపతి నోటివెంట పలికించి మొట్టమొదటగా "సాయి" అన్న పదం ఆయనే పలికారనే పేరు ఆయనకు ఆపాదించి గొప్పవాడిని చేశారు.   ... త్యాగరాజు )


సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 


కంటి సమస్యను తీర్చిన బాబా

0 comments Posted by tyagaraju on 3:42 AM



                                               
కంటి సమస్యను తీర్చిన బాబా


30.06.2012 శనివారము


ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


ఈ రోజు అమెరికా నుంచి పేరు వెల్లడించవద్దని కోరిన, ఒక భక్తురాలు పంపించిన బాబా లీలను ప్రచురిస్తున్నాను. బాబా మీద అమెకెంత నమ్మకము, విశ్వాసము ఉన్నాయో ఈ లీలను చదివిన తరువాతమనకు అర్ధమౌతుంది.  బాబామీద ప్రగాఢమైన నమ్మకం ఉన్న భక్తులు బాబా ఊదీనే పరమౌషధంగా స్వీకరిస్తూ ఉంటారు.  ఆమె ఈ మెయిల్ ద్వరా పంపిన ఈ లీలను ఇప్పుడు చదవండి......



 రోజు నేనుమీకు బాబాయొక్క అద్భుతమైనలీలను మీఅందరితోను కలిసి పంచుకుంటానుమా అబ్బాయి
పేరు సాయి.ప్రస్తుతం మూడవ సంవత్సరం నడుస్తోంది.మాఅబ్బాయి వయసు 3 - 5 నెలలమధ్యలో
ఉన్నపుడు డాక్టర్లు  మా అబ్బాయికి హ్రస్వదృష్టి(nearsightedness, myopia) ఉందని చెప్పారు


అది వినినేనెంతగా బాధపడ్డానోచెప్పనవసరం లేదు. నాకు10 సంవత్సరముల వయసునుండి 
మయొపియ (దూరపు వస్తువులుకనపడకపోవుట) (హ్రస్వ దృష్ఠి) ఉంది. అదిపెరుగుతూ 
పవరు 7డయాప్టర్స్ వరకు 
వచ్చిందినాకళ్ళు, 50 సంవత్సరాల వయసువున్నవారికళ్ళలా ఉండేవికాని అప్పటికి
 నా వయసు23 సంవత్సరాలు అంతే గాక  డాక్టర్ నాకు భవిష్యత్లో గ్లూకోమారావచ్చు 
రాకపోవచ్చుఅని చెప్పారుచిన్నప్పటినుంచి ఎన్నొ వెక్కిరింతలుభరించాను.
మా అబ్బాయికి మంచిదృష్టినిమ్మని బాబాని చాలా తీవ్రంగా ప్రార్ధించడం మొదలుపెట్టానురెండు 
కళ్ళకీ ఊదీని రాయడంచేసేదానినిబాబా విగ్రహాన్ని అభిషేకించి అభిషేకజలంతో 
బాబుకళ్ళను తుడవడం మొదలుపెట్టాను. 
మా అమ్మగారికి బాబామీద అచంచలమైనవిశ్వాసంఆవిడకి బాబామీద ఎంత భక్తిఉన్నదో నాకు
తెలుసుభక్తే బాబాతన అద్భుతమైనలీలని చూపించేలాచేసిందిడాక్టర్ గారు మాఅబ్బాయికి 
హ్రస్వ దృష్ఠి లేదని నిర్దారించిచెప్పారు
భవిష్యత్లో రావచ్చన్నట్లుగాచెప్పారునేనుబాబాని నిరంతరం ప్రార్ధిస్తూఉండాలిమాఅబ్బాయి
 కళ్ళుకొంచెం పెద్దవిగాఉండటం వల్లనేను గ్లూకోమా సస్పెక్ట్ అవడం మూలానా డాక్టర్ గారు 
గ్లూకోమ లేదని నిర్ధారణ చేసుకోవడానికి, మాఅబ్బాయిని 3 నెలల తరవాత తీసుకుని
 రమ్మన్నారుఇది వినగానే నాకుచాలా భయంవేసింది. సెప్టెంబరులో మరలా 
మా అబ్బాయిని డాక్టర్దగ్గిరకితీసుకుని వెళ్ళాను.  రోజున డాక్టర్గారు, 
మాబాబుకి గ్లూకోమాలేదని, దృష్టికూడా చాలాఅద్భుతంగా ఉందని నిర్ధారించి చెప్పారు. 

వయసులో ఉండేపిల్లలకన్నాకూడా ఇంకా ఎక్కువగానే చక్కటిదృష్టి ఉందని చెప్పారు. 
డాక్టర్ గారు గ్లూకోమాకాదని తేల్చారు. ఎందుకంటే వాడి కళ్ళు అప్పుడెంత పెద్దగా
వున్నాయో ఇప్పుడూ అలానేవున్నయని, అవిపెరగలేదని  చెప్పారు.  నేనుహాయిగా 
ఊపిరిపీల్చుకున్నాను

నేను షిరిడీకి నాప్రార్ధనలను పంపుతూ ఉండేదానినిషివపూర్లోని బాబాగుడిలోని 
అమిత్ గారితో కూడా మాట్లాడి మా అబ్బాయితరపున ప్రార్ధించమనిఅడిగాను

ప్రార్ధనలన్ని కూడా ఫలించాయినేను అమిత్ గారితోకూడా మాట్లాడానుఅప్పుడు 
15 నెలలు ఉన్న మాబాబుఆరోగ్యంగా ఉంటాడని చెప్పారు. ఆయన చెప్పినమాటలు
నిజమయ్యాయి.నాకన్న మాఅమ్మగారికి, అమిత్ గారికి బాబామీద ఎంతోనమ్మకం.

మా బాబుకు కంటిసమస్యలుతీరిపోవడం బాబా అనుగ్రహముఆయన చేసిన
అద్భుతమైన లీలనేనింకా ఇప్పటికీ మాబాబు రెండుకళ్ళకీబాబా ఊదీరాస్తూ 
అభిషేకతీర్ధజలంతోరెండు కళ్ళనీకడుగుతున్నాను.
బాబాకు నాహృదయపూర్వకమైన ధన్యావాదాలను తెలుపుకుంటున్నాను.

నేను మరలా 6 నెలలతరవాత మాబాబుని కళ్ళడాక్టర్ దగ్గిరకితీసుకుని వెళ్ళాము
డాక్టర్ గారు మా బాబువిషయంలో ఎటువంటిఆందోళన చెందనవసరములేదనిచెప్పారు.
డాక్టర్గారు ఎంత చల్లటి వార్త చెప్పారు.ఇప్పటికీ మేము మా బాబుకళ్ళకి ఊదీనిరాస్తు , 
అభిషేక జలంతో కూడా కళ్ళనుతుడుస్తున్నాము. మందులతో నయంకాని 
వ్యాధులకు ఊదీ పరమౌషధము.

సర్వం శ్రీసాయినాధార్పణమస్తు

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List