03.05.2024
శుక్రవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బందువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయిలీల ద్వైమాస పత్రిక నవంబరు, డిసెంబరు
2023 సంచికనుండి గ్రహింపబడినది.
ఆంగ్ల
మూలం : డా.క్షితిజ రాణే
తెలుగు
అనువాదం ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
ఫోన్.
9440375411, 8143626744
సాయి
అనుగ్రహం అపారమ్ – 10 వ.భాగమ్
కోర్టులో జాదవ్ గారు హాజరు కావలసిన రోజు. ఆరోజే జడ్జిగారు విచారణ చేసి తీర్పు చెప్పే రోజు. జాదవ్ గారు కోర్టుకు వెళ్లడానికి పోలీస్ యూనిఫారం ధరించి సిధ్ధంగా ఉన్నారు. బయలుదేరేముందు ఆయన సద్గురు భావు మహారాజ్ (భావూ మహరాజ్ తన జీవితంలో గత ఏడు సంవత్సరాలుగా జాదవ్ గారి ఇంటిలోనే ఉన్నారు) ముందు కూర్చున్నారు.