19.01.2019 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
నామ స్మరణ -
ప్రాణ
రక్షణ
ఈ రోజు మీకొక అధ్భుతమయిన బాబా వారు చేసిన సహాయం గురించి ప్రచురిస్తున్నాను.
ఇంతకు
ముందు నేను భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నరసాపురం శాఖలో పనిచేస్తున్న సమయంలో శ్రీ ఎస్.వి.ఎస్. రామప్రసాద్ గారు 2000 వ. సంవత్సరంలో మాకు ఛీఫ్ మానేజరు.
ఆయన పదవీవిరమణ చేసిన
తరువాత ప్రస్తుతం విశాఖపట్నంలో నివాసముంటున్నారు.
క్రిందటివారం నేను విశాఖపట్నం వెళ్ళినపుడు ఆయనను కలుసుకోవడం జరిగింది.
ఆయన
కూడా గొప్ప సాయి భక్తులు.
ఆయన
తన అనుభవాలను చెబుతూ ఉండగా నేను స్వయంగా వ్రాసుకోవడం జరిగింది.
బాబావారి
అనుభూతులను నాతో పంచుకుంటున్న సమయంలో బాబా వారు తనపైన చూపిన అనుగ్రహానికి ఆయన ఎంతగానో ఉద్విగ్నత చెందారు.
ఎంతో
కాలమయినా అప్పటి అనుభూతులను ఆయన నాకు చెబుతున్న సమయంలో ఆయన కంఠం గాద్గదికమయి ఆయన ఒడలు పులకరించింది.
ఇప్పుడు
ఆయన చెప్పిన విషయాలన్నీ యధాతధంగా మీముందు ఉంచుతున్నాను. ఆయన చెప్పిన సంఘటనలకు అనుగుణంగా శ్రీ సాయి సత్ చరిత్రలో బాబా చెప్పిన మాటలను కూడా అధ్యాయాల సంఖ్యలతో (మణెమ్మగారు వ్రాసిన శ్రీసాయి సత్ చరిత్ర) సహా మీకు అందిస్తున్నాను. జరిగిన సంఘటనలకు బాబా సత్ చరిత్రలో బాబా చెప్పిన మాటలను మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి.
సాయిబాబా వారు సత్ ఛరిత్రలో ఎల్లప్పుడూ తన నామాన్ని జపించుకుంటూ ఉండమని చెప్పారు.
ఆ విధంగా
చేసినట్లయిటే
బాబావారు తన భక్తులని ఆపద సమయాలలో ఏవిధంగా రక్షిస్తారో ఇది చదివిన తరువాత మనకి పూర్తిగా అర్ధమవుతుంది.
ఇక
ఆయన చెప్పిన విషయాలు ఆయన మాటలలోనే…..
అది 1965వ.సంవత్సరం.
అప్పుడు
నేను 11వ.తరగతి చదువుతున్నాను.
నేను
మొట్టమొదటిసారిగా
నా స్నేహితుల ఇంటిలో బాబా
ఫొటోని చూశాను.
రోజూ
స్కూల్ కి వెళ్ళేటప్పుడు నా స్నేహితులు బాబా ఊదీ పెట్టుకుని
నాకు కూడా పెట్టేవారు.