09.12.2022 గురువారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి దయా సాగరమ్ 50 వ, భాగమ్
అధ్యాయమ్
– 49
మరాఠీ
మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్
--- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
తెలుగు
అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట,
హైదరాబాద్
9440375411 & 81436267
సాయి
ఎప్పుడూ సరైన దారి చూపిస్తారు
మా
అమ్మాయి నేహ వివాహం నిశ్చయం అయింది. వివాహసమయంలో
నీటికి గాని, డబ్బుకి, వివాహం జరిగే ప్రదేశం ఇంకా పెళ్ళికి సంబంధించిన వేటికీ కూడా
ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడమని సాయిని ప్రార్ధించుకున్నాను. వివాహ సమయంలో అన్నీ అనుకున్నట్లుగానే సజావుగా జరిగాయి. వివాహానికి వచ్చిన అతిధుల కోసం పై అంతస్థులోని ఫ్లాట్
ని వసతిగా ఏర్పాటు చేసాము. 24 గంటలూ నీటివసతికి
ఇబ్బంది కలగకుండా గడిచింది. ఎటువంటి సమస్యలూ
ఉత్పన్నం కాలేదు.