11.07.2014 శుక్రవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
గురుపౌర్ణమి శుభాకాంక్షలు
చాలా రోజుల తరువాత మరలా బ్లాగులో ప్రచురణకు అవకాశమేర్పడింది. ప్రచురణకు ఆటంకాలు ఏమీ లేకపోయినా పరిస్థితులు నాకు కొన్ని అనుకూలంగా లేకపోవడంచేత అనువాద ప్రక్రియ సజావుగా సాగడంలేదు. బాబావారిని మన్నించమని వేడుకొంటూ ఈ రోజు సాయిసోదరి రేఖగారి అనుభవాన్ని మీకందిస్తున్నాను.
త్వరలోనే సాయికి అంకిత భక్తుడయిన శ్యామా గురించి విపులంగా అందిస్తాను.
వ్యాధిని మాయం చేసిన బాబా
సాయి సోదరి రేఖ అనుభవం
చిన్నతనం నుంచీ నాకు బాబా గురించి తెలుసు. అందరినీ పూజించినట్లుగానే బాబాను కూడా పూజిస్తూ ఉండేదానిని. బాబా వారి వివిధరకాల ఫోటోలను సేకరించి వాటినన్నిటినీ ఒక ఫైల్ లో పెట్టుకొంటూ ఉండేదానిని. అది నా అలవాటు. నా స్నేహితులలో ఒకరు నాకు సాయి సత్ చరిత్రను, మరొకరు బాబా విగ్రహాన్ని బహూకరించారు. బాబాకు సంబంధించిన ప్రతి విషయం ఎంతో గొప్పదయినప్పటికీ ఒకరోజు మాత్రం ఆయన నన్ను తనకు సన్నిహితంగా చేసుకొన్నారు.