బాబా (తల్లి,తండ్రి,గురువు)
30.04.2014 బుధవారం
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి సోదరి శ్రీమతి జ్యోతి గారు పంపించిన బాబా తొ తమ అనుభవాన్ని మీకందరకూ వివరిస్తాను. బాబా తమ లీలను ఎప్పుడు ఏవిధంగా అందిస్తారో మనకి తెలియదు. ఇక చదవండి.
*****
మీ బ్లాగులో ప్రచురించే బాబా లీలన్నిటినీ చదువుతున్నాను. బాబా నాకు చూపించిన లీలను మీకు వివరంగా చెప్పడం నాకెంతో ఆనందాన్నిస్తుంది. దయచేసి ఈ నా అనుభవాన్ని మీ బ్లాగులో ప్రచురించండి.
బాబా దయవల్ల నాకు ఇద్దరు అబ్బాయిలు. నా భర్త కూడా బాబాకి భక్తులు. నాయొక్క రెండు అనుభవాలను మీకిప్పుడు వివరిస్తాను.
1. షిరిడీలో గొప్ప అనుభూతి.
2008 వ.సంవత్సరంలో మానాన్నగారు హటాత్తుగా చనిపోయారు. హటాత్తుగా జరిగిన ఈ సంఘటన నాలో ఎంతో నైరాశ్యాన్ని కలిగించింది. తరువాత నేను షిరిడీ వెళ్ళాను. బాబా ఆశీర్వాదం కోసం ద్వారకామాయిలో కి అడుగుపెట్టాను. అక్కడ చాలామంది భక్తులు వరుసలో నుంచుని ఉన్నారు. నేనుకూడా వరుసలో నిలబడి ఉన్నాను. వరుసలోనుండి కదలుతూ బాబా ఎప్పుడూ కూర్చొనేచోటకు వచ్చాను. ఇప్పుడు అక్కడ బాబా వారి చిత్రపటం ఉంది.
అనుకోకుండా ఒక గార్డ్ నావద్దకు వచ్చి, నన్ను నాభర్త మాయిద్దరిని మాత్రమే ద్వారకామాయి లోపలికి వెళ్ళడానికి దారిచూపించాడు. ద్వారకామాయి లోపల ఒక ఫకీరు ధ్యానం లో ఉన్నాడు. ద్వారకామాయి లో ఉన్న కొళంబే నుండి నీరు తీసుకొన్నాను. అక్కడ కొద్ది నిమిషాలు కూర్చొని బాబావారి దర్శనానికి వెళ్ళాను.
బాబా ఈ విధంగా నన్ననుగ్రహించారని తరువాత నాకర్ధమయింది. మానాన్నగారిలాగే బాబా కూడా నన్ను కనిపెట్టుకొని ఉన్నారని నాకెంతో ఆనందం కలిగింది. జీవితాంతం నాకీ అనుభూతి మనసులో ఉండిపోతుంది.
2. బాబా అనుగ్రహం.తల్లి, తండ్రి, గురువు అన్నీ ఆయనే.
2014వ.సంవత్సరం ఫిబ్రవరి నెలలో నేను మా సోదరుడి యింటిలో ఉన్నాను. నాసోదరుడు కూడా నన్ను మానాన్నగారిలాగే ప్రేమగా చూసుకుంటాడు. నాసోదరుడి గృహంలో నేను మా అమ్మగారి కోసం సాయి సత్ చరిత్ర పారాయణ చేశాను. ఏడవరోజున పూజ చేసి శ్రధ్ధగా పారాయణ పూర్తిచేశాను. చివరగా బాబాకు ఆపిల్ పండ్లు నైవేద్యం పెట్టాను. అప్పుడు బాబా నాకు అధ్బుతాన్ని చూపించి నన్ను అనుగ్రహించారు. ఆపిల్ పండ్లమీద అగరువత్తుల బూడిద రాలి, బాబావారు రాతి మీద కూర్చున్న భంగిమ కనిపించింది. వాటి తాలూకు ఫోటోలు కూడా యిక్కడ యిస్తున్నాను.
అఖండ కోటి రాజాధి రాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సాయినాధ్ మహరాజ్ కీ జై
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)