14.12.2017 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి పదానంద రాధాకృష్ణస్వామీజీ
గారు భక్తులనుద్దేశించి
చేసిన ప్రసంగాలలోని విషయాలను “Swamiji talks to Devotees” పుస్తకంలోని విషయాలను తెలుగులో అనువదించి అందిస్తున్నాను. SrI sai
Spiritual Centre, T.Nagar, Bangalore వారు ముద్రించారు. ఈ రోజు ఆ ఈ పుస్తకానికి సంపాదకులు, ప్రొఫెసర్ పి.ఎస్.నారాయణ రావు, శ్రీ బి.కె. రఘు ప్రసాద్ గార్లు. సాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది.
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
శ్రీస్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ - 4 వ.భాగమ్
20.04.1971 స్వామీజీ “భగవంతుని కోసం కొంత సమయాన్ని ఎందుకని కేటాయించకూడదు?” మనం ఆఫీసు పనికి, బంధువులను, స్నేహితులను కలుసుకోవడానికి, సరకులు కొనడానికి, వినోదాలకి ఈ విధంగా అనేక రకాలయిన వ్యాపకాలకి కొంతకొంత సమయాన్ని కేటాయిస్తున్నాము. మరి అటువంటప్పుడు రోజుకి ఒక్క పదినిషాలు భగవంతుని కోసం కేటాయించలేమా?