28.01.2014 మంగళవారం
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయీ నీలీలలు వర్ణించ తరమా?
ఈ అద్భుతమైన లీల శ్రీ ప్యారేలాల్ ఖన్న, 13 థియేటర్ రోడ్ కోల్ కత్తా వారివి. ఈ లీల శ్రీసాయి లీల ద్వైమాస పత్రిక నవంబరు-డిసెంబరు 2003వ.సంవత్సరంలో (61వ.నంబరు) ప్రచురింపబడింది. అందులో ప్రచురింపబడిన ఈ లీల యధాతధంగా మీకందిస్తున్నాను.
నేను నాభార్య 1950వ.సంవత్సరంలో రామేశ్వరం వెళ్ళాము. దక్షిణ భారత దేశమంతా తిరిగాము. మేమెక్కడికి వెళ్ళినా మాకు తలపాగా చుట్టుకొని వున్న ఒక యోగి చిత్రపటాలు మాకు దర్శనమిస్తూ ఉండేవి.
ఆయనెవరో మాకు తెలీదు. ఆఖరికి ఆఫొటోలు శ్రీషిరిడీ సాయిబాబా వారివని తెలిసింది.