Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, June 2, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1997 (09)

0 comments Posted by tyagaraju on 8:00 AM






02.06.2012
సాయి.బా.ని.స. డైరీ - 1997  (09)

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


14.06.1997

నిన్నరాత్రి శ్రీసాయి షిరిడీ సాయిమందిరములోని పూజారిగా దర్శనము ఇచ్చి అన్నమాటలు. 

1) భగవంతుడు తన గొప్పతనాన్ని శ్రీసాయికి చూపినారు.  పంచభూతాలలో ఉన్న భగవంతుడిని శ్రీసాయి తన భక్తులకు చూపించినారు.  

2) శారీరిక సుఖాలుకోసము మీరు అడ్డదారులులో ప్రయాణము చేసిన మిగిలేవి మీశరీరాలకు రోగాలు మాత్రమే. అదే మీరు మానసిక సుఖశాంతులకోసము ప్రయత్నాలు చేసిననాడు అవి కొంచము ఆలస్యముగా వచ్చిన ఆసుఖశాంతులు శాశ్వతముగా మిగులుతాయి.

3) గృహస్థ జీవితములో భార్యయొక్క ధనసంపాదన పైనే ఆకుటుంబము ఆధారపడినపుడు భర్త ఆకుటుంబ వ్యవహారాలలో జాగ్రత్త పడకపోతే ఆకుటుంబము రోడ్డున పడే ప్రమాదముయుంటుంది. 

16.06.1997

నిన్నరాత్రి శ్రీసాయి నేను పుట్టిన గ్రామపెద్దగా దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1)  జీవితములో ఎగుడు, దిగుడులు సహజము.  ఈవిధమైన జీవిత ప్రయాణములో ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవలి.  నీవు ఇంకొకరి గురించి ఆలోచించటములో అర్ధము లేదు. 

2)  ప్రతి తల్లికి తన పిల్లలు అంటే చాలా ప్రేమ.  నీవు వారి వ్యవహారాలలో తలదూర్చటము ఆతల్లి కోపానికి గురికావటము అని గ్రహించు. 
3) మామిడి చెట్లు అన్నీ చూడటానికి ఒకే రూపములో యుంటాయి.  కాని ఆచెట్లకు కాచే మామిడి పండ్లు యొక్క రుచులు వేరు.  

అలాగే శ్రీసాయి భక్తులు అందరు ఒక్కలాగే యుంటారు.  కాని వారిమనోభావాలు వేరువేరుగా యుంటాయి అని గ్రహించు.  
4)  నీగురువుకు నీగురించి అన్ని విషయాలు తెలుసును.  నీవు వారియోగ క్షేమాలు తెలుసుకోవాలి అనే తాపత్రయము పడేకన్న వారి సేవలో నీజీవితాన్ని గడిపి నీజీవిత గమ్యాన్ని చేరుకో.   

08.08.1997

నిన్నరాత్రి శ్రీసాయి ఒక అజ్ఞాత వ్యక్తిగా దర్శనము ఇచ్చి అన్నమాటలు. 

1) జీవితములో ప్రతిఒక్కడు ఒక సమయములో ఉన్నత స్థితిని చవిచూస్తాడు.  తర్వాత అక్కడనుండి సాధారణ స్థితికి చేరుకొంటాడు.  అటువంటి సమయములో నిజాలను అంగీకరించటమే ఆధ్యాత్మిక శక్తి. 

2)  ఆధ్యాత్మిక రంగములో కాలుపెట్టిన వ్యక్తి తన చుట్టు ఉన్నవ్యక్తులు తనను చూస్తున్నారు అనే భావనతో మంచి మార్గములో ముందుకు సాగిపోవాలి.  తనప్రక్కవాడికి మార్గదర్శకుడిగా యుండాలి.  అంతేగాని, ప్రాపంచిక రంగములోని తలనొప్పిలను తెచ్చుకోరాదు.  

3) ఆనాడు బాబా " సబ్ కా మాలిక్ ఏక్  హై , అల్లా మాలిక్  హై అని అన్నారు.  కాని మనమందరము ఇపుడు ఒక మాటపై నిలబడదాము. అదే " హం సబ్ కా ఖూన్ ఏక్ హై, సాయి ఉస్ ఖూన్ కా తాకత్ హై" 

16.08.1997

నిన్నరాత్రి శ్రీసాయి నేను చదివిన హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయునిగా దర్శనము ఇచ్చి, భారతదేశ జాతీయ జెండాను ఆవిష్కరించి అన్నమాటలు. 

1) పదవులు సంపాదించుకోవటానికి కులము, మతమును అడ్డుగా పెట్టుకొంటారు.  పదవులు వచ్చిన తర్వాత ఆపదవులను కాపాడుకోవటానికి కులము, మతముల మధ్య వైషమ్యాలు కలిగించుతారు.  నిజానికి కులమతాల మధ్య స్నేహము లేదు, శత్రుత్వము లేదు.  భగవంతుని దృష్ఠిలో అన్నికులాలు మతాలు సమానమే.   

2) నీవు వెండి కంచములో భోజనము చేసినావా, లేక బంగారు కంచములో భోజనము చేసినావా, అనేది ముఖ్యము కాదు.  అలాగే ఏమతములో జన్మించినావు  అనేది ముఖ్యము కాదు.  నీవు చేసే ఆధ్యాత్మిక భోజనము వలన నీమనసులో ఉన్న ఆకలి తీరినదా లేదా అనేది ముఖ్యము. అందుచేత ఏమతము గొప్పది అనే విషయమును ఆలోచించవద్దు.   

(ఇంకాఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు

Friday, June 1, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1997 (08)

0 comments Posted by tyagaraju on 8:12 AM






01.06.2012  శుక్రవారము

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి బంధువులకు ఒక వివరణ

సాయి.బా.ని.స. డైరీ - 1997 --  7వ.భాగములో పొరబాటున 09.05.1997 రోజు డైరీ పోస్ట్ కాలేదు.  దానిని ఈ 8వ. భాగములో పోస్ట్ చేస్తున్నాను.  గమనించగలరు.  పొరపాటుకు చింతిస్తున్నాను. 


సాయి.బా.ని.స. డైరీ - 1997 (08)

09.05.1997


శ్రీసాయి నిన్నరాత్రి కలలో ఒక సన్యాసి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

"దొంగలు దోచుకోలేని జ్ఞానము అనే ధనాన్ని ప్రసాదించేవాడు భగవంతుడు.  మానవుల మధ్య ప్రేమ బంధాలను కల్పించేవాడు భగవంతుడు. మూగవానికి మాట్లాడే శక్తిని కల్పించేవాడు భగవంతుడు.  మానవుని మనసులో ప్రవేశించి తోటిమానవునికి సహాయము చేసేవాడు భగవంతుడు.  విజయదశమిరోజున మానవులు అందరి చేత సంతోషముగా శక్తికి పూజలు చేయించేది భగవంతుడు.  అటువంటి భగవంతుని అనుక్షణము స్మరించటము మానవుల విధి." 

2) యింటి దగ్గర బంగారునగలు దాచుకొని తీర్ధయాత్రలకు బయలుదేరి ఆయాత్రలో డబ్బు ఖర్చుగురించి, యింటిదగ్గర దాచిన బంగారు నగలు గురించి ఆలోచించితే

 యింక ఆతీర్ధయాత్రకు అర్ధము ఏమిటి?  అటువంటి పరిస్థితిలో తీర్ధయాత్రలు చేయకుండ యింటి పట్టున యుండటము మేలు. 



29.05.1997

నిన్నరాత్రి శ్రీసాయి నేను పనిచేస్తున్న కర్మాగారములోని ఒక వృధ్ధ కార్మికుని రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) భగవంతుడు సర్వాంతర్యామి అని స్టేజీమీద ఉపన్యాసాలు ఇచ్చే స్వామీజీలు తమకాలి క్రింద నలిగిపోతున్న క్రిమికీటకాల గురించి ఆలోచించనినాడు ఆస్వామీజీ మాట్లాడే మాటలకు అర్ధము ఏమిటి?

2)  అకలితో ఉన్న బీదవాడు మజ్జిగతో అన్నము తింటు ఆభగవంతునికి కృతజ్ఞతలు తెలియచేసుకొనుచున్నాడు.

  మరిఒకడు ధనమదముతో ఆకలితో యున్నపుడు పెరుగు అన్నము తింటు తనపళ్ళెములోని సగము అన్నమును నేలపాలు చేసి ఆనందించుతున్నాడు.  

మరి అన్నము పరబ్రహ్మ స్వరూపమని తలచిన బీదవాడు గొప్పవాడా, లేక ధనమదముతో అన్నమును సరిగా భుజింపకుండ నేలపాలు చేసినవాడు గొప్పవాడా! నీవు అలోచించు.   

30.05.1997

నిన్నరాత్రి శ్రీసాయి ఒక సన్యాసి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు. 

1)  నీవు నాసేవలో ఎంతచేయగలవు అనేది ఆలోచించి చేయి, అంతేగాని సమాజములోని తోటివారు నాకు ధనసహాయము చేయలేదు లేకపోతే ఇంకా చాలా సేవ చేసేవాడిని అని మాత్రము ఆలోచించవద్దు.

2) పదిమందిలో నీవు ఒక్కడివి  అని ఆచోటకు నీవు వెళ్ళకపోయిన ఫరవాలేదు.  అదే నీవు ఆచోటకు వెళ్ళకపోతే ఆపదిమందికి యిబ్బంది కలుగుతుంది అని భావించినపుడు నీవు అక్కడకు తప్పక వెళ్ళాలి.  

3) ఇతరులు సాయిసేవలో ఎంత పనిచేస్తున్నారు అనేది నీకు అనవసరము.  నీవు సాయిపేరిట ఎంతపని చేయగలవు అనేది ముఖ్యము.  

4) మరణము అనేది శరీరానికి శాశ్వత నిద్ర.  ఆటువంటి నిద్రలో ఉన్న శరీరానికి దహనము చేయడానికి, లేదా ఖననము చేయడానికి రాత్రి ఆగితే నాఎమి పగలు అయితేనేమి ఒక్కసారి ఆలోచించు. 


12.06.1997

శ్రీసాయి నిన్నరాత్రి ఒక పల్లెటూరివాని గా దర్శనము  ఇచ్చి అన్నమాటలు.

1) మీజీవితాలు అరటితోటలువంటివి.  ఆతోటను పెంచి, జాగ్రత్తగా పంటపండేలాగ చూసుకొనే తోటమాలిని నేను.  నేను మీనుండి కోరేది శ్రధ్ధ, సాబూరి అనే రెండుఫలాలు మాత్రమే. 

2) నేను నాభక్తులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మంటలులోనేనా లేదా నూతిలోనేనా దూకడానికి సిధ్ధపడతాను. 
3) సంతోషము అనేది బాహ్యముగా ప్రదర్శించే మానసిక స్థితి.  మీసంతోషములో నేను పాలుపంచుకొంటాను.  

(ఇంకాఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు

Thursday, May 31, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1997 (07)

0 comments Posted by tyagaraju on 7:02 AM



31.05.2012  గురువారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి.బా.ని.స. డైరీ - 1997 (07)

28.04.1997

శ్రీసాయి నిన్నరాత్రి నా  చిన్ననాటి స్కూల్ టీచర్ గా  దర్శనము ఇచ్చి అన్నమాటలు.

"భగవంతుడు మానవుని మనుగడకోసము చక్కటి ప్రకృతిని సృష్ఠించినాడు. మా నవుడు తనను సృష్ఠించిన ఆ భగవంతుని మర్చిపోయి తన జీవన విధానాన్ని ఓసమరముగా మార్చుకొన్నాడు.  తాను సృష్ఠికి ప్రతి సృష్ఠిని గావించగలను అనే అహంకారముతో అంధకారములో ప్రయాణము చేస్తున్నాడు."

03.05.1997

శ్రీసాయి నిన్నరాత్రి ఒక అజ్ఞాత వ్యక్త్రి రూపంలో దర్శనము ఇచ్చి అన్నమాటలు. 

1) జీవిత ప్రయాణములో నీవు నీకుటుంబ సభ్యులతో కలసి ప్రయాణము సాగించుతున్నాను అని తలచటము నీలోని భ్రమ.  ఒక సైకిల్ మీద నలుగురు కలసి చేసే ప్రయాణాన్ని పోలీసు (భగవంతుడు) అంగీకరించడు అనే ఆలోచనే నీలో ఆధ్యాత్మిక ప్రయాణానికి ఆరంభము అని గ్రహించు. 

2)  భగవంతుని గొప్పతనాన్ని తెలుసుకోవడానికి సంగీత కచేరీలకు, కవ్వాలి పాటలు వినడానికి వెళ్ళనవసరము లేదు.  నీవు భగవంతుని నామము అనుక్షణము స్మరణము చేసిన ఆభగవంతుడు సదా నీహృదయములోనే నివసించుతాడు. 

06.05.1997

నిన్నరాత్రి శ్రీసాయి అడవిలోని ఓగిరిజనుడు రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) నీతల్లి గర్భమునుండి బయటకువచ్చి ఈప్రకృతిలో ప్రయాణము కొనసాగించుతున్నావు.  
Fantasy art images, Images of nature

ఖరికి నీవు ఈప్రకృతి ఒడిలో కన్నుమూసి తిరిగి యింకొక మాతృమూర్తి గర్భములో చేరుతున్నావు. 

2) నీమేలు కోరేవారు బీదవారు అయినపుడు వారు ధనములేక నీయింటికి రాలేరు అని గ్రహించు.  అదే ధనవంతులు నీయింటికి రాలేకపోయినవారు నీమేలు కోరి నీయింటికి రాలేదు అని గ్రహించు. 

3) ఎవరో నీయింట పూలమొక్కలనుండి పూలు కోసుకొని వెళ్ళుతున్నారని నీవు నీయింట ఉన్న పూలమొక్కను ఎందుకు కొట్టివేస్తావు. 
 ఆపూల మొక్కకు ఏమితెలుసు తననుండి పూలు కోస్తున్నవారు నీకు శత్ర్తువులా లేక మిత్రులా!   

16.05.1997

నిన్నరాత్రి శ్రీసాయి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు. 

1) నేటి సమాజములో అర్హత లేనివారు అందరు గొప్పవారి సిఫార్సులతో అందలము ఎక్కి సుఖప్రదమైన జీవితము కొనసాగించుతున్నారు అని బాధపడవద్దు.  నీకు రావలసిన ఫలము నీకు యోగము ఉన్న ఏదో విధముగా నీకు భగవంతుడు అందచేస్తాడు అని నమ్ము.  అలాగే ఎందరో తప్పుడు పనులు చేస్తు పెద్దమనుషులుగా చలామణి అగుతున్నారు అని బాధపడవద్దు.  వారు ఏనాటికి ప్రశాంతముగా జీవించలేరు.  నీవు మంచిపనులు చేస్తు జీవించు.  నీలోని ప్రశాంతతను ఎవరు దొంగిలించలేరు. 

2) నీజీవితములో ఏడు అంతస్థుల మేడను నిర్మించుకొని మొదటి ఆరు అంతస్తులను (అరిషడ్ వర్గాలను) ఖాళీగా యుంచి ఏడు   తలుపులుగల (నీశిరస్సు) ఏడవ అంతస్తులో జీవించుతు జీవిత ఆఖరి దశలో భగవంతుని చేరుకో.  


  (ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు

Wednesday, May 30, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1997 (06)

0 comments Posted by tyagaraju on 7:51 AM











30.05.2012 బుధవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు 

సాయి.బా.ని.స. డైరీ - 1997  (06)


07.04.1997


నిన్నరాత్రి  శ్రీ సాయి ఒక ఫకీరు రూపములో సాయి దర్బారుకు వచ్చి అన్న మాటలు నేను ఎన్నడు మరచిపోలేను.


1) సాయిదర్బారులో నీవు ఒక సేవకుడివి మాత్రమే.  అన్ని మతాలువారికి ఇక్కడ భగవంతుని గురించి ప్రార్ధనలు చేసుకోడానికి అనుమతి ఉంది అనే విషయము నీవు మర్చిపోవద్దు. 



2) నీఇంటికి వచ్చే నాభక్తులకు మంచినీరు ఇచ్చి దాహము తీర్చుతున్నావు.  మరి నీఇంటిముందు నిలబడి దాహపు బాధను తెలియచేయలేని నోరులేని మూగ జీవాల సంగతి ఎప్పుడైన ఆలోచించావా! 




3) సమాజములోని మానవులలోని మంచితనాన్ని నీవు గ్రహించు.  వారిలోని చెడుకు నీవు దూరముగా ఉండు. 


4) స్త్రీ, పురుషులు నాసమక్షములో వివాహము చేసుకొన్న చాలదు.  భార్య భర్తలు నీతిమంతులై ఉండాలి.  అపుడే వారికి నా ఆశీర్వచనాలు లభిస్తాయి. 


10.04.1997


నిన్నరాత్రి శ్రీసాయి నేను పనిచేస్తున్న కర్మాగారములోని ఓవృధ్ధ కార్మికుని రూపములో దర్శనము ఇచ్చి అన్న మాటలు. 


1) నీవు రోజూ నీశరీరములోని మలినాన్ని విసర్జించుతున్నావు. అలాగే ఏదో ఒకరోజున నీవు నీశరీరాన్ని విసర్గించక తప్పదు.  విసర్జించబడే ఈశరీరమును మట్టిలో ఏవిధముగా కలపాలి అనే విషయముపై గొడవలు పడటము ఎందుకు. 


2) ఎవరైన తప్పుడు పనులు చేస్తు ఉంటే నీవు వారికి అటువంటి పనులు చేయరాదు అని సలహా మాత్రమే ఇవ్వగలవు.  మాకు తెలుసులే అని సమాధానము వారినుండి వస్తే మాత్రము నీవు వారిదరిదాపులకు వెళ్ళటము పెద్ద తప్పు. 


15.04.1997


శ్రీసాయి నిన్నరాత్రి ఒక సన్యాసి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు. 


1) నీయింటికి నామనుషులు వస్తారు. వారి బాధలను నివారించి వారికి ప్రశాంత జీవితాన్ని ప్రసాదించేది నేనే.  నీవు సాక్షిభూతుడివి మాత్రమే.


2) హరిదాసులు చేప్పే హరికధకంటే, తల్లి చేప్పే విద్యకన్న, తండ్రి ఇచ్చే రక్షణకన్న శ్రీహరి యొక్క కరుణను సంపాదించే మార్గములో నిన్ను నడిపించేది నేనే. 



3) నీదగ్గరకు వచ్చే నామనుషులలో గొప్ప, బీద అనే తారతమ్యము విడనాడి అందరికి సమానముగా నాగురించి చెప్పు.  


4) నాతత్వప్రచారములో ఆడంబరాలకు పోవద్దు.  నీశక్తికి మించిన ఖర్చులు చేయవద్దు.   


5) నేను ఇతరమత సాంప్రదాయాలలో ఉన్నా నీవు నీమత సాంప్రదాయాన్ని పాటిస్తూ నాసేవను నిర్వర్తించు. 


6) మంచి స్నేహితులతో  స్నేహము, సాయి బంధువులతో సత్ సంఘాలు నాకు చాల ఇష్ఠము.  నేను అటువంటివారితోనే యుంటాను. 



(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 

Monday, May 28, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1997 (05)

0 comments Posted by tyagaraju on 9:29 PM

 
29.05.2012  మంగళవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి.బా.ని.. డైరీ -  1997 (05)
08.03.1997

శ్రీసాయి నిన్నరాత్రికలలో నావికాదళములోని ఒకసిపాయి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు

 

 1) సముద్ర ప్రయాణములో నీటి అలలు మనమీద పడుతున్నాయి అని మన ప్రయాణము మానివేస్తామా!  
 

అలాగే జీవిత ప్రయాణములో మనతోటి మానవులలో వచ్చే అపార్ధాలు అనే అలలు మనమీద పడతాయి. వాటిని లెక్క చేయకుండ మనము ముందుకు సాగిపోవాలి

2) ఇతరులు తప్పులు చేస్తున్నారు అని బాధపడవద్దువారి విషయాలలో నీవు తలదూర్చవద్దుభగవంతుడే వారికి సమయము చూసి శిక్షను విధించుతాడు

09.03.1997

శ్రీసాయి నిన్నరాతి సాయిబందు శ్రీశంకరయ్యగారి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) మానవత విలువలు కాపాడుతు ఇతరుల మనసు నొప్పించకుండ సాయి బంధువులతో వ్యవహరించుతు ఉండాలి

2) శ్రీసాయి సమక్షములో అందరు సమానమేసాయి ప్రసాదాన్ని అందరికి సమానముగా పంచిపెట్టాలిశాంతము, సహనముతో శ్రీసాయి దర్బారును నిర్వహించాలి.


3) ఆధ్యాత్మిక ప్రగతికి కాషాయ వస్త్రాలు ధరించి సన్యాసిలాగ మారనవసరములేదు. మానసికముగా సన్యాసిలాగ యుంటు సాయి విభూతియొక్క గొప్పతనాన్ని గుర్తించాలి

4) ఈవిశ్వమంతటిలోను శ్రీసాయి ఉన్నారు అనే భావనతో అనుక్షణము జీవించాలి.
 

12.03.1997

శ్రీసాయి ఒక సన్యాసి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) "నీలోని నిజమైన ప్రేమ తోటి మానవుని మరణాన్నికోరదుఆవిధమైన మరణాన్నికోరటము రాక్షసత్వముతోటిమానవుని సుఖాన్ని కోరడము మానవత్వము. ఈమానవత్వమునుండే భగవంతునికి ఇష్ఠమైన ప్రేమతత్వము జన్మించినది. ఈప్రేమ తత్వానికి మారుపేరు ఆధ్యాత్మికత, మానవత్వముతో ఆధ్యాత్మిక రంగములో పయనించుతు భగవంతుని తెలుసుకో.

2) వేరువేరు మత సాంప్రదాయలవారు ఒకరి కష్ఠసుఖాలలో ఇంకొకరు పాలు పంచుకుంటే గొడవలు రావుకాని ఒకరి ఆచార వ్యవహారాలలోను, మత సాంప్రదాయాలలోను కలగచేసుకొంటే మాత్రము అపోహలు అనర్ధాలు వస్తాయికనుక ఒకరు ఇంకొకరి మత సాంప్రదాయాలలో కలుగచేసుకోరాదు.
27.03.1997

నిన్నరాత్రి శ్రీసాయి నామేనమామ రూపములో దర్శనముఇచ్చి అన్నమాటలు నాలో చాల ఆలోచనలను రేకెత్తించినవి.

1)      కొందరు భోజనము చేయడానికి విస్తరినిండ (ఆకునిండ) అన్నీ వడ్డించుకొని తినబోయే సమయములో ఈదరగాలికి ఆనిండు విస్తరి ఎగిరిపోయినపుడు వానికి తినే యోగము లేనట్లేకదా!


2) కొందరు తమ జీవితాంతము తమ కుటుంబ సభ్యుల సుఖసంతోషాలకోసము ధన సంపాదన చేస్తు ఆధన సంపాదన కార్యములో కన్ను మూస్తారుఅదివారి విధివ్రాత కాదా!

3) కొందరు ఎవరు చూడకుండ ఎదుటివాని ధనాన్ని కొల్లగొడతారుయింకొకడు తియ్యగా మాట్లాడుతు, లేని ఆప్యాయతను ప్రదర్శించుతు ఎదుటివాని ధనాన్ని కొల్లగొడతారుఇద్దరు చేసే పని ఒక్కటే గనుక వారుఇద్దరు దొంగలే.  
28.03.1997

నిన్నరాత్రి శ్రీసాయి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) నీగత జీవితములో నీవు చేసిన చెడుపనులు, చెడు ప్రవర్తనలు అన్నీ నాకు తెలుసు. నీవు ఆమార్గమును విడనాడి నూతన మార్గములో ప్రయాణము చేయటము శ్రీసాయి మార్గములో పయనించినట్లే.

2) జీవితములో ప్రతిరోజు నీకు ఒక పరీక్ష ఆపరీక్షకు సిధ్ధపడటము అంటే శ్రీసాయి మార్గములో ప్రయాణము చేసినట్లే

3) పసిపిల్లలు అయిన, వారి తల్లిల్తండ్లులు అయిన కాలచక్రములో తమ వంతు పాత్రను వారు పోషించుతు ముందుకు సాగిపోవాలి. -- అదే శ్రీసాయి మార్గములో పయనించటము.

4) నీలో నీశత్రువుపై ప్రతీకార వాంఛ వదలి ముందుకు సాగిపోవడము సాయిమార్గములో పయనించటమే.

5) మరణము గురించి భయము విడనాడి ప్రశాంత జీవితము గడపటము అంటే శ్రీసాయి మార్గములో పయనించటము.
                                                             
01.04.1997

నిన్నరాత్రి శ్రీసాయి ఓవృధ్ధ మహిళ రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) పిల్లలు లేరని బాధపడుతున్నపుడు భగవంతుని అనుగ్రహముతో ఆడపిల్ల కలిగిన నిరుత్సాహము చెందకుండ ఆపిల్లను పెంచి పెద్ద చేసి కన్యాదానము చేయాలి, అంతే గాని వంశోధ్ధారకుడు మగపిల్లవాడు పుట్టలేదు అని విచారించకూడదు.

2)      నీజీవితములో బ్రహ్మచర్యములోని బాధలు, గృహస్థ ఆశ్రమములో పిల్లలతో బాధలు అన్ని అనుభవించిన తర్వాత కూడ జీవితముపై మమకారము పోవటములేదుజీవితాన్ని ఓకర్పూరపు దండలాగ తయారు చేసుకొని నీవారికి మరియు భగవంతుని సేవకు ఉపయోగ పడేలాగ యుండాలి

02.04.1997

నిన్నరాత్రి శ్రీసాయి ఒకవృధ్ధ మహిళరూపములో దర్శనము ఇచ్చి మానవ శరీర సమస్యలపై ఇచ్చిన సలహాలను మీకు తెలియ చేస్తాను.

1) శరీరానికి కావలసినది పౌష్ఠిక ఆహారము మనసుకు కావలసినది ప్రశాంతత దానికి భగవన్ నామస్మరణ చాల ముఖ్యము.

2) జీవితములో అందచందాలు ముఖ్యము కాదుసుఖప్రదమైన జీవితము గడపాలి అంటే సక్రమమైన మార్గములో ధనసంపాదన, ఇతరులకు సహాయము చేయాలి అనే ఆలోచన మరియు ఆచరణ కలిగియుండాలి.

3) శరీర అందచందాలు సినీమాలోని వినోదానికి పనికివస్తుంది. తర్వాత ఆందమైన శరీరము ఒకనాడు మట్టిలో కలసిపోతుందిభగవంతుని సేవలో పనికివచేది ఆత్మఅందుచేత శరీరతత్వము కన్న ఆత్మ తత్వము గురించి తెలుసుకోవాలి.

శరీరము ఆరోగ్యముగా ఉన్నంత కాలము మనకు ఎవరి సహాయము అవసరములేదుకాని, ఆనారోగ్యము రాగానే మనతోటివారి సహాయమును ఆశిస్థాముఅందుచేత నీవు ఆరోగ్యముగా ఉన్నపుడే నీతోటివారితో మంచిగా జీవించునీకష్ఠాలలో నీతోటివారి సహాయము ఆశించు.

 (ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు


 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List