29.05.2012 మంగళవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి.బా.ని.స. డైరీ
- 1997 (05)
08.03.1997
శ్రీసాయి నిన్నరాత్రికలలో నావికాదళములోని ఒకసిపాయి
రూపములో దర్శనము
ఇచ్చి అన్నమాటలు
1) సముద్ర ప్రయాణములో నీటి అలలు మనమీద పడుతున్నాయి అని మన ప్రయాణము మానివేస్తామా!
అలాగే జీవిత ప్రయాణములో మనతోటి మానవులలో వచ్చే అపార్ధాలు అనే అలలు మనమీద పడతాయి. వాటిని లెక్క చేయకుండ మనము ముందుకు సాగిపోవాలి.
1) సముద్ర ప్రయాణములో నీటి అలలు మనమీద పడుతున్నాయి అని మన ప్రయాణము మానివేస్తామా!
అలాగే జీవిత ప్రయాణములో మనతోటి మానవులలో వచ్చే అపార్ధాలు అనే అలలు మనమీద పడతాయి. వాటిని లెక్క చేయకుండ మనము ముందుకు సాగిపోవాలి.
2) ఇతరులు తప్పులు చేస్తున్నారు
అని బాధపడవద్దు. వారి
విషయాలలో నీవు తలదూర్చవద్దు. భగవంతుడే వారికి
సమయము చూసి
శిక్షను విధించుతాడు.
09.03.1997
శ్రీసాయి నిన్నరాతి సాయిబందు
శ్రీశంకరయ్యగారి రూపములో దర్శనము
ఇచ్చి అన్నమాటలు.
1) మానవత విలువలు కాపాడుతు
ఇతరుల మనసు
నొప్పించకుండ సాయి బంధువులతో వ్యవహరించుతు ఉండాలి.
2) శ్రీసాయి సమక్షములో అందరు
సమానమే. సాయి
ప్రసాదాన్ని అందరికి సమానముగా పంచిపెట్టాలి. శాంతము,
సహనముతో శ్రీసాయి
దర్బారును నిర్వహించాలి.
3) ఆధ్యాత్మిక ప్రగతికి కాషాయ
వస్త్రాలు ధరించి సన్యాసిలాగ మారనవసరములేదు. మానసికముగా సన్యాసిలాగ యుంటు సాయి
విభూతియొక్క గొప్పతనాన్ని గుర్తించాలి.
4) ఈవిశ్వమంతటిలోను శ్రీసాయి ఉన్నారు
అనే భావనతో
అనుక్షణము జీవించాలి.
12.03.1997
శ్రీసాయి ఒక సన్యాసి
రూపములో దర్శనము
ఇచ్చి అన్నమాటలు.
1) "నీలోని నిజమైన ప్రేమ తోటి
మానవుని మరణాన్నికోరదు. ఆవిధమైన
మరణాన్నికోరటము రాక్షసత్వము. తోటిమానవుని సుఖాన్ని
కోరడము మానవత్వము.
ఈమానవత్వమునుండే భగవంతునికి ఇష్ఠమైన
ప్రేమతత్వము జన్మించినది. ఈప్రేమ తత్వానికి మారుపేరు
ఆధ్యాత్మికత, మానవత్వముతో ఈ ఆధ్యాత్మిక రంగములో
పయనించుతు భగవంతుని తెలుసుకో.
2) వేరువేరు మత సాంప్రదాయలవారు
ఒకరి కష్ఠసుఖాలలో
ఇంకొకరు పాలు
పంచుకుంటే గొడవలు రావు. కాని
ఒకరి ఆచార
వ్యవహారాలలోను, మత సాంప్రదాయాలలోను కలగచేసుకొంటే మాత్రము
అపోహలు అనర్ధాలు
వస్తాయి. కనుక
ఒకరు ఇంకొకరి
మత సాంప్రదాయాలలో
కలుగచేసుకోరాదు.
27.03.1997
నిన్నరాత్రి శ్రీసాయి నామేనమామ
రూపములో దర్శనముఇచ్చి
అన్నమాటలు నాలో చాల ఆలోచనలను రేకెత్తించినవి.
2) కొందరు తమ జీవితాంతము
తమ కుటుంబ
సభ్యుల సుఖసంతోషాలకోసము
ధన సంపాదన
చేస్తు ఆధన
సంపాదన కార్యములో
కన్ను మూస్తారు. అదివారి
విధివ్రాత కాదా!
3) కొందరు ఎవరు చూడకుండ
ఎదుటివాని ధనాన్ని కొల్లగొడతారు. యింకొకడు
తియ్యగా మాట్లాడుతు,
లేని ఆప్యాయతను
ప్రదర్శించుతు ఎదుటివాని ధనాన్ని కొల్లగొడతారు. ఇద్దరు
చేసే పని
ఒక్కటే గనుక
వారుఇద్దరు దొంగలే.
28.03.1997
నిన్నరాత్రి శ్రీసాయి ఒక
అజ్ఞాత వ్యక్తి
రూపములో దర్శనము
ఇచ్చి అన్నమాటలు.
1) నీగత జీవితములో నీవు
చేసిన చెడుపనులు,
చెడు ప్రవర్తనలు
అన్నీ నాకు
తెలుసు. నీవు
ఆమార్గమును విడనాడి నూతన మార్గములో ప్రయాణము
చేయటము శ్రీసాయి
మార్గములో పయనించినట్లే.
2) జీవితములో ప్రతిరోజు నీకు
ఒక పరీక్ష
ఆపరీక్షకు సిధ్ధపడటము అంటే శ్రీసాయి మార్గములో
ప్రయాణము చేసినట్లే.
3) పసిపిల్లలు అయిన, వారి
తల్లిల్తండ్లులు అయిన కాలచక్రములో
తమ వంతు
పాత్రను వారు
పోషించుతు ముందుకు సాగిపోవాలి. --
అదే శ్రీసాయి
మార్గములో పయనించటము.
4) నీలో నీశత్రువుపై ప్రతీకార
వాంఛ వదలి
ముందుకు సాగిపోవడము
సాయిమార్గములో పయనించటమే.
5) మరణము గురించి భయము
విడనాడి ప్రశాంత
జీవితము గడపటము
అంటే శ్రీసాయి
మార్గములో పయనించటము.
01.04.1997
నిన్నరాత్రి
శ్రీసాయి ఓవృధ్ధ మహిళ రూపములో దర్శనము
ఇచ్చి అన్నమాటలు.
1) పిల్లలు
లేరని బాధపడుతున్నపుడు
భగవంతుని అనుగ్రహముతో ఆడపిల్ల కలిగిన నిరుత్సాహము చెందకుండ ఆపిల్లను
పెంచి పెద్ద
చేసి కన్యాదానము
చేయాలి, అంతే గాని వంశోధ్ధారకుడు
మగపిల్లవాడు పుట్టలేదు అని విచారించకూడదు.
02.04.1997
నిన్నరాత్రి శ్రీసాయి ఒకవృధ్ధ
మహిళరూపములో దర్శనము ఇచ్చి మానవ శరీర
సమస్యలపై ఇచ్చిన సలహాలను మీకు తెలియ
చేస్తాను.
1) శరీరానికి కావలసినది పౌష్ఠిక
ఆహారము మనసుకు
కావలసినది ప్రశాంతత దానికి భగవన్ నామస్మరణ
చాల ముఖ్యము.
2) జీవితములో అందచందాలు ముఖ్యము
కాదు.
సుఖప్రదమైన జీవితము గడపాలి
అంటే సక్రమమైన
మార్గములో ధనసంపాదన, ఇతరులకు సహాయము చేయాలి
అనే ఆలోచన
మరియు ఆచరణ
కలిగియుండాలి.
3) శరీర అందచందాలు సినీమాలోని
వినోదానికి పనికివస్తుంది. తర్వాత ఆందమైన శరీరము
ఒకనాడు మట్టిలో
కలసిపోతుంది. భగవంతుని
సేవలో పనికివచేది
ఆత్మ.
అందుచేత శరీరతత్వము కన్న ఆత్మ తత్వము
గురించి తెలుసుకోవాలి.
శరీరము ఆరోగ్యముగా ఉన్నంత
కాలము మనకు
ఎవరి సహాయము
అవసరములేదు. కాని,
ఆనారోగ్యము రాగానే మనతోటివారి సహాయమును ఆశిస్థాము. అందుచేత
నీవు ఆరోగ్యముగా
ఉన్నపుడే నీతోటివారితో మంచిగా జీవించు.
నీకష్ఠాలలో నీతోటివారి సహాయము
ఆశించు.
(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment