21.01.2014 మంగళవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయితో మధుర క్షణాలు - 33
బాబా భక్తుల విశ్వాసాన్ని పరీక్షించుట
ఈ రోజు శ్రీసాయితో మధురక్షణాలలోని ఒక మధుర క్షణం తెలుసుకుందాము. ఈ లీల చదివిన తరువాత మనకే కనక అటువంటి పరీక్ష ఎదురయితే మన ఆపరీక్షలో నెగ్గగలమా అని అనిపించక మానదు. సాయి అంటే ఎవరు? పూర్తిగా గ్రహించుకున్నపుడే మనం ఆయన పెట్టే పరీక్షలలో విజయం సాధిస్తాము.
సాయి తత్వాన్ని ప్రచారం చేసినవారిలో శ్రీనరసిం హ స్వామీజీ గారు సుప్రసిధ్ధులు. ఆయన 1936 లో శ్రీఉపాసనీ బాబా గారిని దర్శించడానికి వెళ్ళిన తరువాత సాయి అంటే ఏమిటో ప్రత్యక్షంగా తెలుసుకొన్నారు. ఆయన ఉపాసనీ బాబా వద్ద ఉన్న సమయంలో మరొక సాయి భక్తుడు కూడా అక్కడే ఉన్నారు.