Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, March 9, 2019

శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ –12 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 7:06 AM

       Image result for images of shirdisai
                    Image result for images of rose hd

09.03.2019  శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ –12 .భాగమ్ 
YOU BRING US JOY MERE KHWAJA
FRIENDSHIP WITH GOD
LORRAINE WALSHE RYAN & FRIENDS
 బాబాతో సాన్నిహిత్యమ్ -  డైరీ లో ప్రచురించిన 
 సాయి భక్తుల అనుభవాలు - 1

తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు 
నిజాంపేటహైదరాబాద్ ఫోన్ :  9440375411
8143626744
ఇందులో నాకు నచ్చినవి మాత్రమే ప్రచురిస్తున్నాను.  నిజం చెప్పాలంటే ఏదీ వదలడానికి లేకుండా ఉన్నాయి.  కాని పరిమితుల వల్ల కొన్నిటిని మాత్రమే ప్రచురిస్తున్నాను. 
దీనికి సంబంధించిన అన్ని హక్కులు సాయిదర్బార్హైదరాబాద్ వారివి.  దీనిలోని ఏ భాగము కూడా మరే ఇతర బ్లాగులలోను ప్రచురించరాదని సవినయంగా మనవి చేస్తున్నానుసాయిబానిస శ్రీరావాడ గోపాలరావుగారు ప్రత్యేకంగా నాకు అనుమతినిచ్చినందువల్ల నేను మరెవరికీ అనుమతిని ప్రసాదించలేను.
ఓమ్ సాయిరామ్  
ఈ రోజునుండి లోరై వాల్ష్ గారి డైరీలో ప్రచురింపబడ్డ భక్తుల అనుభవాలను కొన్నింటిని ప్రచురిస్తాను.  మధ్యమధ్యలో డైరీలోని విషయాలను కూడా కొన్నింటిని ప్రచురిస్తాను.

సాయిపూనమ్ – చెన్నై గారి అనుభవమ్

నేను మా అమ్మమ్మ, తాతగారి ఇంటిలో ఉన్నపుడు కొద్ది నెలలక్రితం జరిగింది ఈ సంఘటన.  ఆ రోజు గురువారం.  ఉదయం 6 గంటలసమయం.  నేను మంచి గాఢనిద్రలో ఉండగా మా తాతగారు “మంటలు మంటలు” అని పెద్దగా అరుస్తూ ఉండటం వినిపించింది.  నేను వెంటనే లేచి మాతాతగారి దగ్గరకు వెళ్ళి ఎక్కడ మంటలు అని ఆదుర్దాగా అడిగాను.  మేమున్న భవనం రెండవ అంతస్తులో మంటలు మొదలయ్యాయి.  మేము మొదటి అంతస్తులో నివాసం ఉంటున్నాము.  గ్రౌండ్ ఫ్లోర్, రెండవ అంతస్తులలో ఫ్యాక్టరీ ఉంది.  ఈ సంఘటన జరిగినపుడు మొత్తం భవనంలో నేను, మాతాతగారు, మా అమ్మమ్మగారు ముగ్గురమే ఉన్నాము.  నేను వెంటనే సాయిబాబా సహాయం కోసం అర్ధించాను.  అదే సమయంలో ఒక కార్మికుడు ఫ్యాక్టరీవైపు వెడుతూ ఉండటం కనిపించింది.  మామూలుగా అయితే ఎప్పుడూ ఉదయం 8.30 కి వచ్చె వ్యక్తి ఈ రోజు అంత తొందరగా రావడం చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది.   బాబా దయవల్ల ఆకార్మికుడి సాయంతో మాతాతగారు మంటలను ఆర్పివేసారు.  జరిగిన నష్టాన్ని తలచుకుంటూ నేను చాలా బాఢపడ్డాను.  గురువారం అంటే బాబాకు ప్రీతికరమయిన రోజు.  మరి అటువంటిది ఈ రోజున ఈవిధమయిన సంఘటన జరగడం నాకెందుకో మనసుకు వెలితిగా అనిపించింది. (సాధారణంగా గురువారాలలో మంచే జరుగుతుందని నా అభిప్రాయం.)

మా తాతగారు, అమ్మమ్మగారికి కూడా ఈసంఘటన చాలా విషాదాన్ని కలిగించింది.  మాతాతగారే కనక ఉదయం పైన డాబామీద పచార్లు చేయడానికి వెళ్ళి ఉండకపోయినట్లయితే మొత్తం భవనమంతా మంటలలో కాలిపోయి ఉండేది.  వారి బాధ చూసి మంగళప్రదమయిన గురువారంనాడు ఇటువంటి సంఘటన ఎందుకు జరిగిందని సాయిబాబాను అడిగాను.  నాపర్సులోనుండి సాయిచాలీసా పుస్తకం తీయగానే నాప్రశ్నకు సమాధానం లభించింది. 
                            Image result for images of sai chalisa tamil book

పుస్తకం అట్టమీద బాబా ఫొటో ఉంది.  ఆ ఫొటోలో బాబా ముఖం మీద కాలిన గుర్తులు ఉన్నాయి.  ఒక్కసారిగా అదిరిపోయాను.  బాబా ముఖం మీద మాత్రమే కాలిన గుర్తులు ఉన్నాయి.  మిగతా పుస్తకంతా ఎక్కడా అటువంటి గుర్తులు లేవు.  నేను ఆపుస్తకం మీద శుభ్రంగా తుడిచి ఇది ఎలా జరిగిందా అని ఆశ్చర్యపోతూ ఉన్నాను.  అదే సాయిబాబా చూపిన అధ్భుతం.  శుభప్రదమయిన రోజున ఆయన మూడు ప్రాణాలను ఏవిధంగా కాపాడరో దీని ద్వారా తెలియచేసారు.  మమ్మల్ని కాల్చవలసిన మంటలను తాను స్వీకరించి మమ్మల్ని కాపాడారు.  తన భక్తులకు కలగబోయే అరిష్టాలను ముందుగానే గ్రహించి తాను స్వీకరించి వారిని కాపాడుతారనే మాట అక్షర సత్యం.

(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)



Thursday, March 7, 2019

శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ – 11 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 7:56 AM

       Image result for images of shirdi baba
            Image result for images of beautiful flowers hd

07.03.2019  గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ – 11 .భాగమ్ 

YOU BRING US JOY MERE KHWAJA
FRIENDSHIP WITH GOD
LORRAINE WALSHE RYAN & FRIENDS

బాబాతో సాన్నిహిత్యమ్ -  2007 .సంవత్సరమ్
డైరీ

తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు 
నిజాంపేటహైదరాబాద్ ఫోన్ :  9440375411
8143626744

ఇందులో నాకు నచ్చినవి మాత్రమే ప్రచురిస్తున్నాను.  నిజం చెప్పాలంటే ఏదీ వదలడానికి లేకుండా ఉన్నాయి.  కాని పరిమితుల వల్ల కొన్నిటిని మాత్రమే ప్రచురిస్తున్నాను. 

దీనికి సంబంధించిన అన్ని హక్కులు సాయిదర్బార్హైదరాబాద్ వారివి.  దీనిలోని ఏ భాగము కూడా మరే ఇతర బ్లాగులలోను ప్రచురించరాదని సవినయంగా మనవి చేస్తున్నానుసాయిబానిస శ్రీరావాడ గోపాలరావుగారు ప్రత్యేకంగా నాకు అనుమతినిచ్చినందువల్ల నేను మరెవరికీ అనుమతిని ప్రసాదించలేను.
ఓమ్ సాయిరామ్  

నాడీ జాతక వివరాలు చదివిన తరువాత బాబా ఆమె తలచుకున్న వెంటనే ఏ విధంగా దర్శనమిస్తున్నారోఆవిడ అడిగిన విధంగా ఏది కోరితే అది ఎందుకని తీరుస్తున్నారో ఈ పాటికి పాఠకులు గ్రహించే ఉంటారు.  కాని ఆయన మనకు కూడా పలుకుతారు.  కావలసినది శ్రధ్ధసబూరి....

23.11.2007

               Image result for images of candle before baba photo

సాయంత్రం 6 గంటలకు ఆన్ లైన్ లో బాబా ఆరతి చూసేముందు బాబాని ఒక కోరిక కోరుకొన్నాను. --- “బాబా! నీముందు వెలిగించబడిన ఈ కొవ్వొత్తి 4 గంటలపాటు మాత్రమే వెలుగుతుంది. ఈ కొవ్వొత్తి దీపాన్ని రాత్రంతా వెలిగేలా చెయ్యి.  లేకపోతే నువ్వు రాత్రంతా చీకటిలో ఉంటావు.  నాలుగు గంటల తరువాత నేను నిద్రనుంచి లేచి మళ్ళి మరొక కొవ్వొత్తిని వెలిగించలేను.  ఈ కొవ్వొత్తి రాత్రంతా వెలిగేలా చేసినట్లయితే అది చాలా అద్భుతమయిన లీల”.  నేను ఈ విధంగా బాబాని కోరుకోవడానికి ఒక కారణం ఉంది.  అబ్దుల్ బాబా, బాబా కోసం ఎప్పుడూ దీపాలు వెలిగించి ఉంచుతూ ఉండేవాడు.  అతనిలాగె నేను కూడా చేద్దామనే ఆలోచనతో ఆవిధంగా కొరుకొన్నాను.  ఆతరువాత నేను నిద్ర పోయాను.

పొద్దున్న 6.45 కు లేచాను.  లేచిన వెంటనే పూజాగదిలోకి వెళ్ళాను.  అద్భుతమ్, ఆశ్చర్యం --- రాత్రి వెలిగించిన కొవ్వొత్తి ఇంకా మంచి వెలుగును ప్రసరిస్తూ వెలుగుతూనే ఉంది.  దానిని వెలిగించి 12 గంటలయింది.  12 గంటలపాటు అలా వెలుగుతూనే ఉంది.  బాబా సర్వజ్ఞుడు.  బాబా చూపించిన ఈ లీలకి నాకు నవ్వు వచ్చింది.  ఆయన నా ప్రార్ధనను మన్నించి 4 గంటలపాటె వెలిగే కొవ్వొత్తిని 12 గంటలపాటు వెలిగేలా తన లీలని చూపించారు.

ఈ రోజు శుక్రవారం ఉదయం ఆరతి ఇచ్చేసమయంలో “అల్లా అల్లా” అని నామస్మరణ చేద్దామనుకున్నాను.  అకస్మాత్తుగా బాబా పింక్ కలర్ ఫొటో ముందు వెలిగించిన కొవ్వొత్తి దీపం ఒక్కసారిగా తళుక్కుమని గాలిలోకి వెలుగును విరజిమ్మింది. 
                       Image result for images of candle before baba photo
ఆ మెరుపును చూసి ఒక్కసారిగా అదిరిపడ్డాను.  నా శరీరం వణకడం మొదలుపెట్టింది.  నా రోమాలు నిక్కపొడుచుకొన్నాయి.  పింక్ కలర్ లో ఉన్న బాబా ఫొటోని వింతగా చూసాను.  అవునన్నట్లుగా బాబా మృదువుగా తన కనురెప్పలను మూసి తెరిచారు.  ఈ లీలను నాకు అనుగ్రహించినందుకు ధన్యవాదాలు బాబా…

(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)






Monday, March 4, 2019

శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ – 10 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 8:52 AM

      Image result for images of shiva shirdi saibaba
              Image result for images of jasmine flowers


04.03.2019  సోమవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ – 10 .భాగమ్ 
YOU BRING US JOY MERE KHWAJA
FRIENDSHIP WITH GOD
LORRAINE WALSHE RYAN & FRIENDS
 బాబాతో సాన్నిహిత్యమ్ -  
2007 .సంవత్సరమ్ డైరీ 
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు 
నిజాంపేటహైదరాబాద్ ఫోన్ :  9440375411
8143626744

ఇందులో నాకు నచ్చినవి మాత్రమే ప్రచురిస్తున్నాను.  నిజం చెప్పాలంటే ఏదీ వదలడానికి లేకుండా ఉన్నాయి.  కాని పరిమితుల వల్ల కొన్నిటిని మాత్రమే ప్రచురిస్తున్నాను. 
దీనికి సంబంధించిన అన్ని హక్కులు సాయిదర్బార్హైదరాబాద్ వారివి.  దీనిలోని ఏ భాగము కూడా మరే ఇతర బ్లాగులలోను ప్రచురించరాదని సవినయంగా మనవి చేస్తున్నానుసాయిబానిస శ్రీరావాడ గోపాలరావుగారు ప్రత్యేకంగా నాకు అనుమతినిచ్చినందువల్ల నేను మరెవరికీ అనుమతిని ప్రసాదించలేను.
ఓమ్ సాయిరామ్  

నాడీ జాతక వివరాలు చదివిన తరువాత బాబా ఆమె తలచుకున్న వెంటనే ఏ విధంగా దర్శనమిస్తున్నారోఆవిడ అడిగిన విధంగా ఏది కోరితే అది ఎందుకని తీరుస్తున్నారో ఈ పాటికి పాఠకులు గ్రహించే ఉంటారు.  కాని ఆయన మనకు కూడా పలుకుతారు.  కావలసినది శ్రధ్ధసబూరి....




01.01.2007

బాబాని అడగండి.  ఆయన మీరడిగినవి ఇస్తారు.  ఈ రోజు నూతన సంవత్సరం మొదటిరోజు.  ఉదయం ప్రార్ధన చేసుకుంటూ బాబా! ఈ రోజు నేను డైరీలో వ్రాసుకోవడానికి నాకేదయినా విశేషాన్ని అనుగ్రహించు అని వేడుకొన్నాను.  నేను అడిగిన వెంటనే బాబా అనుగ్రహించారు.
           Image result for images of shirdi sai baba photo on wall
గోడమీద నాకు బాబా సాక్షాత్కరించారు.  ఆయన ధరించిన కఫనీ తెలుపు రంగులోకి మారింది.  బాబా కదులుతూ ఉన్నారు.  ఆయన తన రెండు చేతులను పైకెత్తుతూ ఆశీర్వదిస్తున్నారు.  
                   Image result for images of shirdi saibaba raising hands

Sunday, March 3, 2019

శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ – 9 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 7:31 AM


      Image result for images of Shirdisaibaba with lord siva
          Image result for images of jasmine flower

03.03.2019  ఆదివారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు


శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ – 9 .భాగమ్ 
YOU BRING US JOY MERE KHWAJA
FRIENDSHIP WITH GOD
LORRAINE WALSHE RYAN & FRIENDS

తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు 
నిజాంపేట, హైదరాబాద్ ఫోన్ :  9440375411
8143626744

ఇందులో నాకు నచ్చినవి మాత్రమే ప్రచురిస్తున్నాను.  నిజం చెప్పాలంటే ఏదీ వదలడానికి లేకుండా ఉన్నాయి.  కాని పరిమితుల వల్ల కొన్నిటిని మాత్రమే ప్రచురిస్తున్నాను. 

దీనికి సంబంధించిన అన్ని హక్కులు సాయిదర్బార్హైదరాబాద్ వారివి.  దీనిలోని ఏ భాగము కూడా మరే ఇతర బ్లాగులలోను ప్రచురించరాదని సవినయంగా మనవి చేస్తున్నానుసాయిబానిస శ్రీరావాడ గోపాలరావుగారు ప్రత్యేకంగా నాకు అనుమతినిచ్చినందువల్ల నేను మరెవరికీ అనుమతిని ప్రసాదించలేను.

ఓమ్ సాయిరామ్  
నాడీ జాతక వివరాలు చదివిన తరువాత బాబా ఆమె తలచుకున్న వెంటనే ఏ విధంగా దర్శనమిస్తున్నారో, ఆవిడ అడిగిన విధంగా ఏది కోరితే అది ఎందుకని తీరుస్తున్నారో ఈ పాటికి పాఠకులు గ్రహించే ఉంటారు.  కాని ఆయన మనకు కూడా పలుకుతారు.  కావలసినది శ్రధ్ధ, సబూరి....

బాబాతో జీవనమ్ – 2006 .సంవత్సరమ్
లోరైన్ వాల్ష్ గారి డైరీ

27.11.2006

ఈ రోజున నేను 102 ఏంజెల్స్ ( 102 Angles) పుస్తకం పూర్తిగా చదివేసాను.  బాబా నాకు ఒక ఏంజిల్ (దేవదూత) ని చూడాలని  ఉంది.  చూపించవా అని కోరుకొన్నాను.  ఈ రోజు ఆఫీసులో మిస్టర్ TM గారికి సహాయం చేయమని నన్ను నియమించారు.  ఆయన మా డిపార్టుమెంటు గురించి మొత్తం పరిశోధన  (Research) చేస్తున్నారు.  ఆయన సేకరించిన సమాచారాన్నంతటినీ నేను టైప్ చేయాలి.  
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List