20.09..2022 మంగళవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి దయా సాగరమ్ 24వ, భాగమ్
అధ్యాయమ్
– 22
మరాఠీ
మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్
--- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
తెలుగు
అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట,
హైదరాబాద్
9440375411 & 8143626744
నా
జీవితాన్ని నెలబెట్టిన బాబా
ఇది
నాజీవితంలో యదార్ధంగా జరిగిన సంఘటన. నేను
30 సంవత్సరాలుగా ఒక కంపెనీలో పనిచేస్తున్నాను.
మా కుటుంబ సభ్యులం అయిదుగురం ఉన్నాము.
నేను, నా భార్య, నా ముగ్గురు కుమార్తెలు.
మా కుటుంబంలో నేనొక్కడినే సంపాదనపరుడిని.
పదమూడు సంవత్సరాల క్రితం మా కంపెనీని మూసేశారు. నాకింక ఉద్యోగం లేకుండా పోయింది. ఇక కుటుంబాన్ని ఎలా పోషించాలన్నదే నాముందున్న పెద్ద సమస్య.
మా అమ్మాయిలు ఇంకా చదువుకుంటున్నారు.
అందుచేత మాకింకా ఎక్కువ వత్తిడి. నా
భార్య నన్ను పార్లేలో ఉన్న సాయి మందిరానికి వెళ్లమని చెబుతూ ఉండేది. కాని నేను ఆమె మాటని దాటవేస్తూ ఉన్నాను. రోజురోజుకి పరిస్థితులు దిగజారుతూ ఉన్నాయి.