20.09..2022 మంగళవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి దయా సాగరమ్ 24వ, భాగమ్
అధ్యాయమ్
– 22
మరాఠీ
మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్
--- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
తెలుగు
అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట,
హైదరాబాద్
9440375411 & 8143626744
నా
జీవితాన్ని నెలబెట్టిన బాబా
ఇది
నాజీవితంలో యదార్ధంగా జరిగిన సంఘటన. నేను
30 సంవత్సరాలుగా ఒక కంపెనీలో పనిచేస్తున్నాను.
మా కుటుంబ సభ్యులం అయిదుగురం ఉన్నాము.
నేను, నా భార్య, నా ముగ్గురు కుమార్తెలు.
మా కుటుంబంలో నేనొక్కడినే సంపాదనపరుడిని.
పదమూడు సంవత్సరాల క్రితం మా కంపెనీని మూసేశారు. నాకింక ఉద్యోగం లేకుండా పోయింది. ఇక కుటుంబాన్ని ఎలా పోషించాలన్నదే నాముందున్న పెద్ద సమస్య.
మా అమ్మాయిలు ఇంకా చదువుకుంటున్నారు.
అందుచేత మాకింకా ఎక్కువ వత్తిడి. నా
భార్య నన్ను పార్లేలో ఉన్న సాయి మందిరానికి వెళ్లమని చెబుతూ ఉండేది. కాని నేను ఆమె మాటని దాటవేస్తూ ఉన్నాను. రోజురోజుకి పరిస్థితులు దిగజారుతూ ఉన్నాయి.
ఒకసారి నేను ఉద్యోగాన్వేషణలో అంధేరీకి వెడుతూ ఉన్నాను. దారిలో ఒక పెద్ద గుంపు కనపడింది. ఏమి జరిగిందో చూద్దామని వెళ్లాను. అక్కడ ప్రమాదం జరిగిందని తెలిసింది. ఒకతను నా వద్దకు వచ్చి నన్ను పార్లేలో ఉన్న సాయిమందిరానికి రమ్మని అన్నాడు.
నేను సాయి భక్తుడినే. నాకు ఇద్దరూ కుమార్తెలే జన్మించడంతో మగ సంతానంకోసం
సాయిని ప్రార్ధిస్తూ ఉన్నాను. కాని మూడవసారి
కూడా అమ్మాయే జన్మించింది. నేను చాలా నిరాశ
చెంది బాబా దృష్టి నా మీద లేదని భావించాను;.
మాకు పుత్రసంతానాన్ని అనుగ్రహించి మా కోరిక తీర్చనందుకు నేను సాయిని పూజించడం
మానేశాను. నా ఈ కధనంతా నన్ను సాయిమందిరానికి
రమ్మన్న వ్యక్తికి వివరించాను. నన్ను సాయి
మందిరానికి తీసుకువెళ్ళడానికి నాకెంతగానో నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. బాబా తన భక్తులఎడల ఎంతో దయగా ఉంటారని చెబుతూ నన్ను
సాయి మందిరానికి రమ్మన్నాడు. నేను సాయి పూజను
మానేసినప్పటికీ నాభార్య మాత్రం ప్రతిరోజు పూజిస్తూ ఉండేది. సాయిని స్మరించుకుంటూనే ఉండేది. తరువాతి గురువారమునాడు పార్లేలోని సాయిమందిరానికి
వెళ్లాను. మా కుటుంబాన్ని అనుగ్రహించమని మరలా
సాయిని ప్రార్ధించడం మొదలుపెట్టాను. ప్రతిరోజు
ఉదయాన్నే ఆరు గంటలకు సాయిమందిరానికి వెళ్ళి సాయిని పూజించసాగాను. బాబా చాలా దయార్ద్రహృదయుడు. నేను ఇపుడుమా కుటుంబాన్ని ఎంతో సంతోషంగా నిర్వహిస్తున్నాను. మా పెద్దమ్మాయికి వివాహం చేసాను. మిగతా ఇద్దరూ బాగా చదువుకుంటున్నారు. నాకు కూడా ఉద్యోగం వచ్చింది. బాగానే సంపాదిస్తున్నాను. మా జీవితాలు ఆనందంగా గడిచిపోతున్నాయి. మేము ప్రతి సంవత్సరం షిరిడీ వెడుతున్నాము. తన సాయి మందిరంలో నాకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించిన
ఉజ్జ్వలా తాయి బోర్కర్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా జీవితంలో మరొక సారి సాయిమార్గంలో పయనించడానికి
సహాయపడిన దాదా ములేకర్ గారికి కూడా నా ధన్యవాదాలు
తెలుపుకుంటున్నాను.
మారుతీ
ధురి
9969994911
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment