30.11.2019 శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవి గారు పంపించిన మరొక లీలను ప్రచురిస్తున్నాను
కళ్ళు తెరచి చూసిన బాబా
" ఓం సాయి రాం" సాయి బంధువులు అందరికి. ఇప్పుడు నేను రాయబోయే లీల నా జీవితం లొనే
జరిగింది. బాబా నాకు ఇచ్చిన అద్భుతమైన అనుభవం. నవగురువార వ్రతం చేసేరోజుల్లో జరిగింది. ఆ రోజుల్లో తెలీకుండానే నాకు సంబల్పూర్ కి
బదిలీ అయింది. నన్ను ఆఫీస్ నుంచి రిలీవ్ కూడా చేసారు. ఏమి కారణం లేదు. నాకు చాలా బాధ వేసింది. అప్పుడే మా వారు
సిల్చేర్ అనే ఊరు నుంచి భువనేశ్వర్ కి
బదిలీ అయి వచ్చారు. మేము ఇద్దరమూ
నాలుగు సంవత్సరాలు వేరుగా ఉన్నాము. మళ్ళీ వెంటనే నన్ను వేరే ఊరికి బదిలీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగం చేసేవాళ్లకు ఈ కష్టాలు తప్పవు. ఇంక తప్పదు అని నేను సంబల్పూర్ వెళ్లి జాయిన్
అయ్యాను. ఒక గురువారం రోజు నవగురువార వ్రతం
చేస్తున్నాను. మనసంతా బాధగా ఉంది." బాబాతో మనసులో
అంటున్నాను “బాబా.."నువ్వు నన్ను చూడు,నేను నిన్ను చూస్తాను" అనే నీ మాట నిజం
కాదు. ఎందుకు భక్తులకు ఈ వాగ్దానాలు చేస్తావు? ఏమన్నా అంటే,నీ కర్మఫలం అంటావు, ఎందుకు బాబా? అని ఏదో,ఏదో..మనసులో అనుకుంటున్నాను. ఇంకో పక్కన బాబా పూజ కూడా చేస్తున్నాను. ఇంతలో విచిత్రం గా నేను పూజ చేసి బాబా
విగ్రహం లో బాబా కళ్ళు తెరిచారు.
ఆ ఫోటో కింద జత
చేస్తున్నాను.
అసలు నా శరీరం గగుర్పొడిచింది. నన్ను నమ్మండి. బాబా నిజంగానే మనల్ని చూస్తున్నాడు. మన బాధలు వింటున్నారు. సమయం వచ్చినప్పుడు సమాధానం ఇస్తారు. బాబా చెప్పిన ఏ
ఒక్కమాట పొల్లు పోదు. జరిగితీరుతుంది. కావలసినది
శ్రద్ధ,సబూరి. మనము.. ఇవ్వవలసినది ఆయన అడిగిన దక్షిణ మనము. బాబా తన మాటకు
కట్టుబడి వున్నడని నాకు అప్పుడు అర్థం అయింది.
" సర్వం సాయి నాధార్పణమస్తు"
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)