06.10.2013 ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 89వ.శ్లోకం, తాత్పర్యం
శ్రీవిష్ణుసహస్రనామం
శ్లోకం : సహస్రార్చిః సప్తజిహ్వా సప్తైధాః సప్తవాహనః |
అమూర్తిరనఘో చింత్యో భయకృద్భయనాశనః ||
తాత్పర్యం: పరమాత్మను వేయి కిరణములు గలవానిగా, ఏడు నాలుకలు గలవానిగా, ఏడు సమిధలుగా, అమరియూ ఏడు వాహనములు గలవానిగా ధ్యానము చేయుము. ఆయనకు రూపము లేదు. మరియూ పాపమంటనివాడు. ఆయన మనస్సుకందడు. ఆయన పాపులకు భయమును కలిగించి, పుణ్యాత్ములకు భయమును పోగొట్టును.
శ్రీసాయితో మధురక్షణాలు - 22
శ్రీసాయిబాబా అనుగ్రహం
ప్రియమైన పాఠకులారా! పూజ్య శ్రీనరసిం హస్వామీజీ గారు ఆంగ్లంలో తను వ్రాసిన పుస్తకాల ద్వారా, వార్తా పత్రికలలో ప్రచురించిన కధనాలు, యింకా సమావేశాలలో ప్రసంగాలద్వారా, మరాఠీభాష తెలియని భక్తులందరికి శ్రీసాయిని పరిచయం చేశారు.