Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, April 13, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1995 (23)

0 comments Posted by tyagaraju on 8:38 PM



14.04.2012
ఓం శాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

నెట్ కనెక్షన్ సరిగా లేకపోవడం వల్ల, ఈ రోజె హైదరాబాదు రావడం వల్ల ప్రచురణకు కొంత ఆలశ్యం జరిగింది. మరలా ఒక వారం రోజులు బెంగళురు కు వెడుతున్నందువల్ల వీలు వెంబడి ప్రచురణ కొనసాగిస్తాను.


సాయి.బా.ని.స. డైరీ - 1995 (23)

19.09.1995

నిన్న రాత్రి శ్రీసాయికి నమస్కరించి ఆధ్యాత్మిక సందేశమును ప్రసాదించమని వేడుకొన్నాను. శ్రీసాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి అన్నమాటలు. "గురువు యిచ్చిన నమ్మకము అనే యిటుకను నీవు దగ్గర ఉంచుకో.

ఆయిటుక నీదగ్గర ఉన్నంత కాలము నీగురువు ఏదో ఒక రూపములో నీచేరువలో యుండి నీయోగ క్షేమాలు చూస్తూ ఉంటారు."

14.10.1995

సయాటిక నొప్పితో మంచము మీదనుండి లేవలేని స్థితిలో యున్నాను. రాత్రి శ్రీసాయిని ప్రార్ధించి ఈబాధను తొలగించమని వేడుకొన్నాను. రాత్రి కలలో శ్రీసాయినాధులు వారు 1991 సంవత్సరములో అజ్మీరులో కనిపించిన వృధ్ధ మార్వాడీ రూపములో దర్శనము యిచ్చి "నేను నీకు అజ్మీర్ దర్గా దగ్గర యిచ్చిన మందు సీసా పూజ చేయటానికి కాదు.

ఈరోజు నీవు మందును వీపు నొప్పికి రాసి మాలీష్ చేయి. రేపటినుండి నీవు లేచి కూర్చుని నీపనులు నీవు చేసుకోగలవు" అన్నారు. నిద్రనుండి మేల్కొని పూజామందిరములో ఉన్న ఆమందుసీసాను నాభార్యచేత తెప్పించుకొని అందులోని తైలమును నావీపుకు రాయించుకొని నిద్రపోయినాను. తెల్లవారేసరికి నేను మంచము మీదనుండి లేచి నాకాలకృత్యాలును నేను చేసుకోగలిగినాను. శ్రీసాయి నాబాధను 1991 లోనే ఊహించి నాకు ముందుగానే మందు యిచ్చి ఈ సయాటికా బాదనుండి రక్షించినారు అనే భావనతో ఆయనకు మనసారా నమస్కరించినాను.

18.10.1995

సయాటికా నొప్పి కొంచము తగ్గినది. నాపనులను నేను స్వయముగా చేసుకొంటున్నాను. యింక ఆఫీసుకు వెళ్ళలేకపోతున్నాను. రాత్రి నిద్రకు ముందు శ్రీసాయికి నమస్కరించి "బాబా యింకా ఎన్నిరోజులు ఈబాధను అనుభవించాలి దయచేసి చెప్పు తండ్రి" అని వేడుకొన్నాను. రాత్రి కలలో శ్రీసాయి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి "భారత ప్రధాని శ్రీ పీ.వీ. నరసిం హారావుగారు విదేశీ యాత్రకు బయలుదేరినారు. వారు 11 రోజులు విదేశీయాత్ర పూర్తి చేసుకొని భారత దేశానికి తిరిగి వస్తున్నారు" నిద్రనుండి మేల్కొని శ్రీసాయి ఈవిధముగా నేను 11 రోజులు బాధ అనుభవించవససియున్నది అని తెలియచేసినారు అని భావించినాను.

పీ.ఎస్. 29.10.1995 శ్రీసాయి చెప్పినట్లుగా ఈరోజు 11.రోజు సయాటికా నొప్పి పూర్తిగా తగ్గినది.

23.10.1995

నిన్నరాత్రి శ్రీసాయికి నమస్కరించి దీపావళి సందర్భముగ సందేశము ప్రసాదించమని వేడుకొన్నాను. శ్రీసాయి ద్వారకామాయి ముందర నిలబడి యిచ్చిన సందేశము. "నీవు నాదగ్గరకు అజ్ఞానము, స్వార్ధము అనే దీపాలతో వచ్చిన నేను ఆదీపాలను వెలిగించి వాటిలోని అజ్ఞానము, స్వార్ధములను తొలగించి వాటిని జ్ఞాన దీపాలు, నిస్వార్ధ దీపాలుగా మార్చి మీ జీవితాలలో వెలుగును ప్రసాదించుతాను."

31.10.1995

నిన్నరాత్రి కలలో శ్రీసాయి అజ్ఞాతవ్యక్తి రూపములో దర్శనము యిచ్చి ప్రసాదించిన సందేశములు. "ఒక ఊరినుండి యింకొక ఊరికి బదిలీ అయినపుడు నీవు నీసామానులు అన్నీ రవాణా కంపెనీ (ట్రాన్స్ పోర్ట్ కంపెనీ) వారికి అప్పగించి ప్రశాంతముగా నీ ప్రయాణాన్ని సాగించుతావే అదే విధముగా నీజీవిత గమ్యాన్ని నీవు ప్రశాంతముగా చేరదలచినపుడు నీవు నాదగ్గరకు రా. నేను నిన్ను నీగమ్యానికి చేర్చుతాను."

"నీజీవితములో నీవు సంపాదించిన ఆస్థిపాస్థులు చూసి నిన్ను నీబంధువులు గుర్తించుతారు. దొంగలు వాటిని దోచుకొంటారు. నీవు నానుండి ఆధ్యాత్మిక సంపదను సంపాదించుకో. వాటిని ఎవరు దొంగిలించలేరు. ఆసంపాదనను నీవు నీతోటివారికి పంచిపెట్టి వారిని సాయిబంధువులుగా మార్చుకో."

(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు


Tuesday, April 10, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1995 (22)

0 comments Posted by tyagaraju on 8:56 AM


11.04.2012 బుధవారము

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈరోజు సాయి.బా.ని.స. డైరీ - 1995 22 వ.భాగాన్ని చదువుకుందాము.

సాయి.బా.ని.స. డైరీ - 1995 (22)

07.09.1995

నిన్నరాత్రి నిద్రకు ముందు శ్రీసాయికి నమస్కరించి జీవితములో తృత్వాన్ని మరచిపోవటానికి సందేశము ప్రసాదించమని వేడుకొన్నాను. శ్రీ సాయి చూపిన దృశ్యము ద్వారా గ్రహించిన సందేశము. "ఉత్తరధృవ ప్రాంతంలో మంచు ఎక్కువ. అక్కడి మానవులు మంచి యిటికలతో చిన్న చిన్న గృహాలు నిర్మించుకొని గృహాలలో చిన్న దీపాన్ని పెట్టుకొని ఆదీపమునుండి వచ్చే వెచ్చదనముతో ప్రశాంతముగా జీవించుతున్నారు. మన జీవితములో శతృత్వము మంచులాంటిదే. నీవు శతృవుగా ఎవరినైన తలచవచ్చును. నిజానికి అతను శతృవుకాడు. అదీ అతనిపై నీకు ఉన్నభావన మాత్రమే. ఈభావనను తొలగించుకోవటానికి నీమనసులో మానవత్వము అనే చిన్న దీపాన్ని వెలిగించి శతృత్వము అనే చలిని పారద్రోలు.

13.09.1995

నిన్నరాత్రి శ్రీసాయికి నమస్కరించి "సాయినాధ విజయదశమిరోజున నా యింట సాయి దర్బారు నిర్మాణము ప్రారంభించదలచినాను. నీ అనుమతిని ఆశీర్వచనాలను ప్రసాదించు తండ్రి" అని వేడుకొన్నాను. శ్రీసాయినాధుడు ఒక ముస్లిం యువకుని రూపములో దర్శనము యిచ్చి అన్నమాటలు. బిస్ మిల్లా - కాం షురూకరో" నీయింట దర్బారుకు వచ్చేవారిలో బీదవారు ఉంటారు, గొప్పవారు ఉంటారు. అందరిని సమదృష్ఠితో చూడాలి. మొదటిసారిగా దర్బారు చేయురోజున నీయింట అన్నదానము చేయాలి."

పీ.ఎస్. 26.01.1996 ఈరోజు రధసప్తమి. శ్రీసాయినాధుని ఆదేశానుసారము సాయి దర్బారు నిర్వహించినాను. సాయి బంధువులకు భోజనము (శ్రీసాయి ప్రసాదము) పెట్టినాను.

14.09.1995

నిన్నరాత్రి జన్మ జన్మల బంధము గురించి ఆలోచించుతు శ్రీసాయికి నమస్కరించి "బాబా నీకు నాకు ఎన్ని జన్మలనుండి బంధము యున్నది తెలపమని వేడుకొన్నాను. శ్రీసాయి చూపిన దృశ్యాల వివరాలు. టీ.వీ. లో సియారాం హిట్ పరేడ్ అనబడే కార్యక్రమము ప్రసారము కాబోతున్నది. టీ.వీ. తెరమీద ప్రోగ్రాం ఎనౌన్సర్ ఈరోజు కార్యక్రమములో ఐదు పాటలు చూడబోతున్నారు అని చెప్పి నిష్క్రమించినారు. మొదటి పాటలో ఒక ముస్లిం స్త్రీ తనకు అన్యాయము జరిగినది అనే బాధతో మరణించినది. రెండవపాటలో ఒక అనాధ బాలుడు హిందూకుటుంబములో పని చేయసాగినాడు. మూడవపాటలో ఒక హిందూ యువకుడు బ్రిటిష్ రాయల్ నౌకాదళములో ఒక ఆఫీసర్ గా పనిచేస్తూ మరణించినాడు. నాలుగవ పాటలో ఒక హిందూ యువకుడు భారత స్వాతంత్ర వీరులతో కలసి బ్రిటిష్ సైన్యముతో పోరడుతూ బ్రిటీష్ వారి తుపాకీ గుళ్ళకు బలయినాడు. ఐదవపాటలో నేను (సాయి.బా.ని.. గోపాలరావు) ఒక సాయిభక్తుడిగా సాయి దర్బారులో శ్రీసాయి పాదాలను కడుగుతున్న దృశ్యము ఆశ్చర్యముగా చూస్తు నిద్రనుండి మేల్కొనినాను. శ్రీసాయి ఈవిధముగా తనకు నాకు వెనకటి ఐదుజన్మల బంధము యున్నది అనితెలిపినారు.

17.09.1995

నిన్నరాత్రి శ్రీ సాయికి నమస్కరించి "సాయినాధ, నీసేవలో శ్రధ్ధ, సహనము అనే రెండు దీపాలను నిత్యము వెలిగించే భాగ్యము ప్రసాదించు తండ్రి" అని వేడుకొన్నాను. శ్రీ సాయి కలలో ఒక స్కూల్ మాస్టర్ రూపములో దర్శనము యిచ్చి, "నీవు రోజూ చదువుతున్న పుస్తకాన్ని తీసుకొని నాదగ్గరకు రా, నీకు సమాధానము ఆపుస్తకములో చూపుతాను అన్నారు". నేను శ్రీ సాయి సత్ చరిత్రను తీసుకొని వారి వద్దకు వెళ్ళినాను.

యింతలో మెలుకువ వచ్చినది. యిది కలకదా అని భావించి తిరిగి నిద్రపోయినాను. ఉదయము లేచి స్నానము చేసిన తర్వాత శ్రీసాయి సత్ చరిత్రను చేత పట్టుకొని సాయిపటము ముందు కూర్చుని నిన్నటి నాప్రశ్నకు సమాధానము సాయి సత్ చరిత్రలో చూపమని ప్రార్ధించి, కళ్ళుమూసికొని ఒక పేజీ తెరచినాను. పేజీ 175 తెరచినాను.

శ్రీసాయి చూపిన సమాధానము 175 పేజీలో ఈవిధముగా యున్నది. "ఈపుస్తకము నీవు చదవవలెను. నీవు అట్లు చేసినచో నీకోరికలు నెరవేరును."


(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు





Monday, April 9, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1995 (21)

0 comments Posted by tyagaraju on 6:27 PM


10.04.2012 మంగళవారము

ఓం సాయి శ్రీ సాయిజయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈరోజు సాయి.బా.ని.స. డైరీ - 1995 21వ. భాగాన్ని చదువుకుందాము.

సాయి.బా.ని.. డైరీ - 1995 (21)

13.08.1995

నిన్న రాత్రి శ్రీ సాయి ఎన్.ఎఫ్.సీ. సీ.. శ్రీ కె.కె. సిన్ హా రూపములో దర్శనము యిచ్చి "ఈరోజు ఆదివారము నేను నీయింటికి మధ్యాహ్న భోజనానికి వస్తాను" అని అన్నారు. ఉదయము నిద్రనుండి లేచి ఈకలను బాగా గుర్తు ఉంచుకొని నాభార్యను పిలిచి ఈరోజు ఆదివారము. శ్రీసాయి మన యింటికి మధ్యాహ్న భోజనానికి వస్తాను అని చెప్పినారు అని చెప్పినాను. నా భార్య నమ్మకము - అపనమ్మకముల మధ్య వంట చేసినది. మధ్యాహ్న్నము ఒంటిగంట అయిన ఎవరు భోజనానికి రాలేదు. నామనసులో ఆనాడు హేమాద్రి పంతు యింటికి శ్రిసాయి భోజనానికి వస్తాను అని చెప్పి భోజన సమయములో ఒక ఫొటో రూపములో వచ్చి హేమాద్రి పంతుని ఆశీర్వదించిన సంఘటనలు గుర్తు వచ్చి శ్రీసాయి ఆడినమాటతప్పరు అని భావించినాను. నాభార్య మధ్యాహ్న్నము రెండుగంటలకు విసుగుతో భోజనము చేసి నన్నుకూడా భోజనము చేయమని బలవంతము చేసినది. మనసులో శ్రీసాయి భోజనానికి వస్తారు అనే నమ్మకము ఉంది కాని నాభార్య ఒత్తిడికి తల ఒగ్గి మధ్యాహ్న్నము 2.30 నిమిషాలకు భోజనమునకు ఉపక్రమించినాను. భోజనము చేస్తున్నానే గాని మన సు శ్రీసాయిపై లగ్నము అయిఉన్నది. పెరుగు అన్నము తినుచున్న సమయములో కాలిగ్ బెల్ మ్రోగినది. నాభార్య తలుపు తీసి చూడగా ఎన్.ఎఫ్.సీ నుండి నాఅఫీసులో పని చేస్తున్న కార్మికుడు శ్రీసత్తయ్య నాయోగ క్షేమములను తెలుసుకోవటానికి మర్యాద పూర్వకముగా నాయింటికి వచ్చినట్లుగా చెప్పాడు. శ్రీ సాయి ఎన్.ఎఫ్.సీ. చీఫి ఎగిక్యూటివ్ రూపములో కలలో దర్శనము యిచ్చి మధ్యాహ్న్న భోజనానికి వస్తాను అని చెప్పి ఎన్.ఎఫ్.సీ లో పని చేస్తున్న ఒక కార్మికుని రూపములో నాయింటికి వచ్చి నాకోరికను మన్నించి నా ఆతిధ్యమును స్వీకరించటము నా అదృష్ఠముగా భావించినాను.

17.08.1995

నిన్నరాత్రి శ్రీసాయికి నమస్కరించి జీవితములో పిల్లలతో ధన సంపాదన విషయములో గొడవలు లేకుండా యుండే మార్గము చూపు తండ్రీ అని వేడుకొన్నాను. శ్రీ సాయి ఒక క్రికెట్ ఆటగాని రూపములో దర్శనము యిచ్చి ప్రసాదించిన సందేశము. "జీవితము మనము మన కన్న పిల్లలతో ఆడే క్రికెట్ ఆటలాంటిది. పిల్లలు చిన్నవాళ్ళుకదా అని వారికి ముందుగా బ్యాటింగ్ యిస్తాము.

వారు ఒకరి తవాత యింకొకరు బ్యాటింగ్ చేసుకొంటు కావలసినన్ని పరుగులు (సంపాదన) చేసుకొని జీవితములో స్థిరపడతారు. ఆసమయములో నీవు బ్యాటింగ్ చేస్తాను అన్నా ఏఒక్కరు నీకు బంతి వేయరు. నీవు నిస్సహాయ స్థితిలో పరుగులు (సంపాదన) లేక శేష జీవితము గడపవ లసి యుంటుంది. అందుచేత నీవు వివాహము చేసుకొనే ముందు ధనసంపాదన చేసి కొంత ధనాన్ని నీ వృధ్ధా ప్యానికి జాగ్రత్తగా దాచుకో."

05.09.1995

శ్రీసాయి నిన్నరాత్రి కలలో అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి ప్రసాదించిన సందేశము. "జీవిత ప్రయాణములో చీకటి వెలుగులు (కష్ఠ - సుఖాలు) వస్తాయి. అటువంటి సమయములో సద్గురువు అనే టార్చి లైటు సహాయంతో ప్రయాణము చేసిన మనప్రయాణములో మనము విరోధిగా భావించిన వ్యక్తి కూడా మనకు మితృడులాగ కనబడతాడు. అటువంటిమితృలతో కలసి ప్రయాణము సాగించుతు మన జీవిత గమ్యాన్ని చేరాలి."

అజ్ఞాత వ్యక్తి ప్రసాదించిన మరొక సందేశము.

"ప్రాపంచిక జీవితములో సాక్ష్యాలు, ఆధారాలు, కొలతలు ఉంటాయి. కాని ఆధ్యాత్మిక జీవితములో అనుభవాలు, అనుభూతులు ఉంటాయి. కొలమానాలు మాత్రము యుండవు అని గ్రహించాలి." నావయస్సు కాలమానానికి అందనిది. నేను భగవంతుని యింటపని చేసిన సేవకుడిని. ఆసమయములో నా పేరు "గర్గుడు". ఆనాటికి, ఈనాటికి నేను భగవంతుని విధేయ సేవకుడినే.


(యింకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు


 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List