శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి
సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు
26.05.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 6 వ.భాగమ్
సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న
అమూల్యమయిన సాయి సందేశాలు
08.05.2019 – నీవు నన్ను నవవిధ భక్తు గురించి అడిగావు కదా! నీకు నేను కొన్ని ఉదాహరణలు తెలియజేస్తాను.
1. ఒక తండ్రి తన కుమార్తె పెండ్లి సుముహూర్త సమయానికి తన చేతికి రావలసిన ధనము రాలేదు. పెండ్లి ఆగిపోతుందేమోనన్ భయంతో భగవంతుని ప్రార్ధించసాగాడు. అది స్మరణము.
2. ప్రపంచకప్ క్రికెట్ ఆటలో విజయానికి చేతిలో ఆఖరి వికెట్టు ఉండి ఒక బంతిని ఎదుర్కొని ఒక పరుగు తీయవలసిన సమయంలో ఆజట్టు ఆటగాళ్ళు భగవంతునితో స్నేహముతో మానసిక పూజ చేయటం కూడా నవవిధ భక్తిలో ఒక భాగమే.