04.10.2010 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖీ పుస్తక ప్రచురణకి బాబా వారి ఆశీర్వాదములతో ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలపడానికి సంతోషిస్తున్నాను. ఓమ్ సాయిరామ్
ఈ రోజు సాయిలీల మాసపత్రిక జూన్
1985వ.సంవత్సరంలో ప్రచురించిన అధ్భుతమయిన బాబా లీల గురించి తెలుసుకుందాము.
తెలుగు అనువాదమ్ ః ఆత్రేయపురపు త్యాగరాజు
ఆపదలలో ఆదుకునే సాయిబాబా
అది
1984వ.సంవత్సరమ్, జనవరి నెల గురువారమ్ 19 వ.తారీకు. నేను, నా స్నేహితుడు టి.ఆర్.సి.మీనన్, ఇద్దరమూ జలగావ్
జమోడ్ (మహారాష్ట్ర) లోని జడ్.పి. గెస్ట్ హౌస్ నుండి బయలుదేరాము. నదూరా రైల్వే స్టేషన్
కి వెళ్ళడానికి బయటనే సిధ్ధంగా ఉన్న ఖాళి టాక్సీలో ఎక్కి కూర్చున్నాము. టాక్సి బయలుదేరడానికి ఇంకా అరగంట సమయం ఉండని డ్రైవర్
చెప్పాడు. ఈ లోగా టీ త్రాగి వద్దామని మేమిద్దరం
రోడ్డు దాటి ఎదురుగా ఒక చిన్న టీ కొట్టు దగ్గరకు వెళ్ళాము. అప్పుడు సమయం ఉదయం గం.6.30 అయింది.