02.02.2019 శనివారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ముత్యాల
సరాలు
సాయిబాబా
వారి సత్సంగ సభ్యురాలు ఒకరు నాలుగయిదు సంవత్సరాల క్రితం “ముత్యాల సరాలు” పేరుతో కొన్ని
మంచి మంచి సందేశాలను వ్రాసి ఇచ్చారు. వాటిని
ఇప్పుడు మనందరికోసం ప్రచురిస్తున్నాను. ఈ సందేశాలను
మననం చేసుకుంటూ ఆకళింపు చేసుకున్నట్లయితే ఆధ్యాత్మిక జీవనానికి దారిని ఏర్పరుస్తుంది.
ఓమ్
సాయిరామ్
01. ఆడిగితే చేసేది సహాయం – అడగకుండానే చేసేది సాయం. ఆపదలో, కష్టాలలో, దుఃఖాలలో ఉన్నవారికి చేసేది దైవసాయం. మానవుడు ఈ స్థాయికి ఎదగాలి.
02. అపకారికి
కూడా ఉపకారం చెయ్యటం మానవత్వం.
03. అనన్యమైన
భక్తి కలవారు తమకు ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా దైవ చింతన మానరు. మనకి సంపద ఉన్నంత వరకు అందరూ ఆత్మీయులమని మన చుట్టూ
చేరుతారు. కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు ఎవరూ
దరి చేరరు. అలాంటి సమయంలోనే భగవంతుని పరీక్షలాగ
అనారోగ్యం కలుగవచ్చును. ఎంతటి క్లిష్ట పరిస్థితులు
ఎదురైనా, నమ్మకం కోల్పోకుండా బాబాను స్మరిస్తే బాబా కటాక్షంతో కష్టాలు తొలగిపోతాయి.