04.11.2011 ఆదివారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాసీస్సులు
ఈ రోజు స్రవంతి రెడ్డిగారికి బాబా వారు చేసిన సహాయము గురించి, వారి అనుభవాన్ని వారి మాటలలోనే తెలుసుకుందాము. ఈ అనుభవాన్ని సుకన్య గారు పంపించారు. సుంకన్యగారికి బాబావారి ఆసీస్సులు.
బాబా ఇప్పించిన డ్రైవింగ్ లైసెన్స్
ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ మహరాజ్ కి జై
మూడు వారాల కిందటే నేను ఈ అనుభవాన్ని మీకందరికీ తెలియచేయనందుకు బాబాని మొదటగా క్షమాపణ వేడుకుంటున్నాను.
డిసెంబరు 2008 లో నేను అమెరికా వచ్చాను. అప్పుడు నేను సెంట్ లూయీస్ లో ఉండేదానిని. మా చుట్టుప్రక్కలవాళ్ళందరికీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. నేను నా భర్తని డ్రైవింగ్ ఆఫీసుకు తీసుకువెళ్ళమని అడిగాను. 6 నెలల తరువాత సెంట్ లూయిస్ లో ఉన్న డీ ఎం వీ ఆఫీసుకు తీసుకునివెళ్ళారు. మొదటి ప్రయత్నం లోనే రాత పరీక్షలో ఉత్తీర్ణురాలయ్యాను. 6 నెలల వరకు పెర్మిషన్ వచ్చింది. డ్రైవింగ్ క్లాస్ 5 గంటల సేపు తీసుకుందామనుకున్నాను. ఆ సమయలో నా భర్త మరో ఉద్యోగంలోకి ప్రవేశించడంతో మేము కనెక్టి కట్ ( సీ టీ) కు మారాము. మేము డీ ఎం వీ ఆఫీసుకు వెళ్ళాము. నేను నా పెర్మిట్ ని చూపించి డ్రైవింగ్ టెస్ట్ కి అప్పాయింట్ మెంట్ ఇమ్మనమని అడిగాను. ఒక రాష్ట్రం లో తీసుకున్న పెర్మిట్ మరొక రాష్ట్రం లో చెల్లదని డీ ఎం వీ ఆఫీసులో వారు చెప్పారు. వారు మమ్మలిని సీ టీ రాష్ట్రం నించి పెర్మిట్ తెచ్చుకోమని చెప్పారు. ఇక్కడ పధ్ధతి చాలా వేరుగా ఉంటుంది. అయితే మేము ఏమిచేయాలో వివరంగా చెప్పమని అడిగాము. సీ టీ లో 8 గంటలు క్లాసులు తీసుకోవాలని చెప్పారు. (మొదటగా తప్పనిసరిగా తీసుకోవలసిన మొదటి క్లాసుకు 125 డాలర్ లు) (ఇది ఏ రాష్ట్రం లోను అవసరం లేదు) ఇక్కడ నా భర్తకు 3 మాసాలకు మాత్రమే ప్రాజెక్ట్ వచ్చింది. అందుచేత నేను 3 నెలల తరువాత యింకొక రాష్టం నించి లైసెన్స్ తెచ్చుకుందామని నిర్ణయించుకున్నాను. తరువాత మేము కొన్ని అనివార్య కారణాలవల్ల యిండియాకు వచ్చి మరలా 2 నెలల తరువాత అమెరికాకు తిరిగి వచ్చాము. నా భర్తకు సీటీ లొ ప్రాజెక్ట్ మరొక సంవత్సరంపాటు పొడిగించారు. అందుచేత జూలై 2011 లో నేను 8 గంటల క్లాసులకి ఒక వారం రోజులు హాజరయ్యాను. 8 గంటల క్లాసులు పూర్తయిపోయినతరువాత నా భర్తకి మరొక రాష్ట్రంలో యింకొక మంచి ప్రాజెక్ట్ వచ్చింది. నాకు చాలా నిరాశ వేసి క్లాసులకి ఎందుకిలా ఆటంకాలు కలుగుతున్నాయని బాబా ని అడిగాను.
కొత్త కంపనీ వారు మాకు విసా కోసం ప్రయత్నించడం మొదలెట్టారు. ఇక్కడ నేను ఒక నెలపాటు రాతపరీక్షకి హాజరవలేదు.
నా భర్త నన్ను రాత పరీక్షకు హాజరవ్వమని బలవంత పెట్టారు. మొదటిప్రయత్నం లోనే నేను పాసయ్యాను. మెల్లగా నేను నా భర్తతో కలిసి డ్రైవింగ్ నేర్చుకోవడం మొదలు పెట్టాను. నా భర్త నాకు ఎంతో ఓర్పుతో నెలరోజులపాటు డ్రైవింగ్ నేర్పారు. డ్రైవింగ్ స్కూల్ లో నేను క్లాసులకు వెళ్ళలేదు. సెప్టెంబరు 2011, 23 వ తారీకున నాకు అప్పాయింట్ మెంట్ దొరికింది. ఒక వారము ముందు అక్టోబరు 5 వ తారీకుకి (బుధవారము) రీషెడ్యూల్ చేయించుకున్నాను. అనుకోకుండా, కారు పార్క్ చేయడం యింకా మిగతా విషయాలన్నీ కూడా మర్చిపోయాను. సహనం నశించి నేనిక ఎప్పటికీ పరీక్ష పాసవలేనని నా భర్త అన్నారు. నాకు దారి చూపమని బాబా ముందర నిలబడి వేడుకున్నాను. బాబా దయ వల్ల అక్టోబరు 5 కు ముందు నేను మరలా బాగా నేర్చుకున్నాను.
అక్టోబరు 5 వ తారీకున బాబా కి నమస్కరించి పరీక్షకు వెళ్ళాను. ఆరోజున నాకు చాలా ఆందోళనగా ఉంది. పరీక్ష నిర్వాహకుడు వచ్చేముందర డీ ఎం వీ ఆఫీసులో బాబాని ప్రార్థిస్తూ కూర్చున్నాను. ఒకవేళ నేను పరీక్షలొ సరిగా చేయలేక నన్ను ఫెయిల్ చేసే పరిస్థితే కనక వస్తే ఆరోజుకు పరీక్ష లేకుండా తప్పించమని బాబాని వేడుకున్నాను. అప్పుడు పరీక్ష నిర్వహించే అధికారి వచ్చి మా కారును అంతా పరీక్షించి ఒక లోటు కనిపెట్టారు. (యైర్ బాగ్ లైట్ వెలుగుతూ ఉంది). అందుచేత ఆ సమస్య లేకుండా మరలా తరవాత రమ్మనమని చెప్పారు. మేము తిరిగి వెళ్ళిపోయాము.
నా భర్త మరొక కొత్త కారును కొనే ఆలోచనలో ఉన్నారు. బాబా దయ వల్ల అక్టోబరు 15 వ తారీకున (పుణ్య తిథి) కొత్త కారు కొనుక్కున్నాము. మరలా నవంబరు,2011, 3 వ.తారీకున నాకు అప్పాయింట్ మెంట్ ఇచ్చారు (గురువారము). ఆరోజు బాబా రోజు కాబట్టి బాబాయే నాకు అప్పాయింట్ మెంట్ వచ్చేలా చేశారని నాకు చాలా ఆనందం వేసింది. కారు కూడా బాబాదే.
సంఘటనలన్నీ గురువారమునాడే జరుగుతున్నాయి. కొత్త కంపెనీ నించి విసా వచ్చింది. మేము సీటీ రాష్ట్రం నించి నవంబరు మధ్యలో వెళ్ళిపోవాలి. ప్రతీ గురువారమునాడు నేను ధూప్ హారతి ఇస్తున్నాను. ఆరోజు నేను కాకడ హారతి ఇచ్చి పరీక్షకు వెళ్ళాను. ఎగ్జామినర్ వచ్చి మా కారును పరీక్షించాడు. నేను మా కారులో బాబా సత్ చరిత్రను ఉంచి (బాబా కారు) కారులో ఉన్న బాబా ఫొటోకు నమస్కరించి కారు నడపడం మొదలుపెట్టాను. అంతా సవ్యంగానే చేసాను కాని ఒక్క చిన్న పొరపాటు మాత్రం చేశాను. ఈ పరీక్షలో నాకు లైసెన్స్ వచ్చేలా చేయమని బాబాని ప్రార్థించాను.
టెస్ట్ అయిపోయిన తరువాత ఎగ్జామినరు కారు నడిపినప్పుడు నేను ఎలా చేశానో ప్రతీదీ వివరంగా చెప్పి ఆఖరికి పాస్ కాలం లో టిక్కు పెట్టాడు. ఆ క్షణంలో నేను సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు చెప్పాను. బయట వేచి చూస్తున్న నా భర్త కూడా ఎంతో సంతోషించారు. బాబా అనుగ్రహం వల్ల నాకు 7 సంవత్సరాల వరకు చెల్లేలా బ్రిడ్జ్ పోర్ట్ లో లైసెన్స్ వచ్చింది. (మొదటి ప్రయత్నం లోనే ఇక్కడ లైసెన్స్ రావడం చాలా కష్టం.)
థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ నేను నిన్ను ఎంతగానో ఆరాధిస్తున్నాను. దానికి అవధులు లేవు.
స్రవంతీ రెడ్డి
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు