Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, June 11, 2011

బాబా -- పిచ్చుక - 2

0 comments Posted by tyagaraju on 11:20 PM


12.06.2011 ఆదివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులకు బాబా వారి శుభాశీస్సులు

బాబా -- పిచ్చుక - 2 -- బాబాని పూజించే విథానం

ఈ రోజు మనము శ్రీ సాయి అంకిత భక్తులలో ఒకరైన శ్రీ బీ.వీ. నరసిం హ స్వామి (శ్రీ భవాని నరసిం హస్వామి) గారిని గురించి కొంత తెలుసుకుందాము.

శ్రీ నరసిం హస్వామి వారి 1874 సంవత్సరములో కోయంబత్తూరు జిల్లాలో భవాని అనే గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 1895 లో ఈయన సేలం పట్టణంలో ప్లీడరు గా పనిచేశారు.

1926 లో వానప్రస్థాశ్రమముని స్వీకరించి దేశంలో ఉన్న అన్ని తీర్థక్షేత్రాలని, సాథు సత్పురుషులని దర్శించారు.
సద్గురువుకోసం అన్వేషిస్తూ 1936 లో కుర్దీవాడి లోని నారాయణ మహరాజ్ అనే యోగిని సందర్శించారు. ఆయనని దర్శించేముందు తన మనస్సులో" నేను ఒక రత్న వర్తకుణ్ణి, సరీఇన జాతి రత్నం యెక్కడ లభిస్తుందొ తెలియచేయవలసినది" అని అనుకున్నారు. భక్తుల హృదయాలని గుర్తించే శక్తిగల నారాయణ మహరాజ్ గారు " నీవు షిరిడీకి వెళ్ళు. నువ్వు కోరుకునే మహారత్నం అక్కడ లభిస్తుంది" అని చెప్పారు. నరసిమ్హస్వామి గారు షిరిడీకి బయలుదేరి మథ్యలో సాకోరి వెళ్ళి అక్కడ శ్రీ సాయిబాబాని సేవించిన శ్రీ కాశీనాథ్ గోవింద ఉపాసనీ మహరాజ్ ని దర్శించి అక్కడ కొంతకాలం ఉన్నారు.

తరువాత శ్రీ నరసిమ్హ అయ్యరు గారు సాకోరికి 3 మైళ్ళ దూరంలో ఉన్న షిరిడీ కి చేరారు. శ్రీ సాయిబాబా సమాథిని దర్శించారు. సమాథి మందిరంలో, ద్వారకామాయి మసీదులో, థుని ముందు, బాబా భౌతింకంగా ఉన్నప్పుడు కూర్చున్న ప్రదేశంలో తాను కూర్చుని బాబాని థ్యానించారు. అక్కడ ఒకరోజున సమాథి మందిరంలో బాబా సమాథి దగ్గర థ్యానంలో కూర్చుని "బాబా నీ అనుగ్రహానికి పాత్రుడనైతే, శ్రీ సాయి భక్తిని వ్యాపింపచేసే భాగ్యం నాకు కలుగే యెడల ఒక పిచ్చుక నా తలపై చేరి కూర్చుండేటట్లు అనుగ్రహించు" అని ప్రార్థించారు. అలా శ్రీ నరసిం హ స్వామిగారు థ్యానంలో ఉండగా ఒక పిచ్చుక వచ్చి వారి తలపై నిలిచింది. బాబా గారి అనుగ్రహం ఈ విథంగా లభించింది ఆయనకి. ద్వారకా మాయి మసీదునందు, సమాథి మందిరమునందు, బాబా చిత్రపటముల ముందు థ్యాననిష్టయందు వారికి సచ్చిదానంద స్థితి లభించింది.

శ్రీ నరసిమ్హస్వామి గారు సాయి ప్రచారాన్ని నిరాడంబరంగా చేసేవారు. ఆయన దగ్గిర యెప్పుడూ ఒక సాయిబాబా పటం ఉండేది. యెక్కడకు వెళ్ళినా సత్సంగంలో ఆ పటాన్ని ఉంచేవారు. బాబా ఫోటోలు, లాకేట్లు భక్తులకి పంచిపెడుతూ ఉండేవారు. శ్రీ సాయిబాబా అనుగ్రహాన్ని పొందటానికి యేమిచేయాలో శ్రీ నరసిమ్హస్వామిగారు భక్తులకు యిలా చెప్పేవారు.

"నీ పూజా మందిరంలో బాబా చిత్రపటాన్ని యెత్తైన ఆసనం మీద ఉంచు. దానిని పుష్పాలతో అలంకరించు. మువ్వత్తుల దీపముని వెలిగించాలి. అగరత్తులను వెలిగించాలి. అక్కడ పాలు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, తాంబూలము ఉంచాలి. బాబా కి సాష్టాంగ నమస్కారం చేసి ఆసనముపై అమర్చిన బాబా పటానికి యెదురుగా కూర్చోవాలి. నీ చూపుని బాబా నేత్రముల మీద కేంద్రీకరించాలి. అష్టొత్తర శతనామములతో బాబాని అర్చిస్తూ పువ్వులతో పూజించు. నీకు చేతనైన విథంగా బాబాని సేవించు. బాబాని కీర్తనల ద్వారా ప్రార్థించు. నువ్వు సమకూర్చుకున్న పదార్థాలని సాయికి నివేదించు. తరువాత కర్పూరహారతి ఇచ్చి బాబాకు నమస్కరించు. గురు, శుక్ర, శనివారములలో నీ కుటుంబములోని వారితో గాని, అక్కడ చేరిన భక్తులతో గాని భజనలు చేయి. ఈ విథంగా తన శక్తి కొలది బాబాని సేవించేవాడు శీఘ్రకాలంలో శ్రీ సాయిబాబాని దర్శించగలడు. బాబా కరుణకి పాత్రుడౌతాడు. ఆది వ్యాథులని పోగొట్టడానికి బాబాని ప్రార్థించి ఊదీని ఉపయోగించు.

బాబా కరుణతో కొందరు కొన్ని శక్తులు పొందవచ్చు. అలా పొందినవారు తానే సాయి అని భావించుకొని యితరుల వ్యాథినివారణలు చేయడం తన శక్తి అని భావించేవారు తమ జీవిత లక్ష్యాన్ని పొందలేరు. అలా వచ్చిన శక్తి, వ్యాథులు తగ్గుట అంతా శ్రీ సాయిబాబా కరుణయే అని గుర్తుంచుకోవాలి.

చదివారుగా శ్రీ బీ.వీ. నరసిమ్హస్వామివారి గురించి క్లుప్తంగాను, యింకా సాయిని సేవించే విథానం గురుంచి ఆయన చెప్పిన విషయాలు. ఇవన్ని కూడా మనం ఆచరణలో పెట్టి మన సాయికి అంకిత భక్తులుగా ఉందాము. మనలో యేశక్తి వచ్చినా అంతా సాయి ద్వారానే జరుగుతోందని మాత్రం భావించాలి. అందు చేత అంతా నేనే చేస్తున్నాను అనే అహంకారం ఉండకూడదు. ఆయన అనుగ్రహమే లేకపోతే మనలో యేవిథమైన శక్తి ఉండదు. మనం ఉట్టి అనామకులం మాత్రమే.

సర్వం శ్రీ సాయినాథారపణమస్తు.

Thursday, June 9, 2011

పిచ్చుక రూపంలో వచ్చిన బాబా

0 comments Posted by tyagaraju on 7:18 PM


10.06.2011 శుక్రవారము

పిచ్చుక రూపంలో వచ్చిన బాబా

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

ఈ రోజు మనము శ్రీమతి ప్రియాంకా గారి ఆంగ్ల బ్లాగులోని ఒక బాబా లీలను తెలుసుకుందాము. బాబా సర్వాంతర్యామి. మనము యెక్కడవున్న, యేమి చేస్తున్నా, మన మన మనసులో యేది అనుకున్న ఆయనకి తెలుస్తుందని గ్రహించుకుంటే, బాబా మనతోనే యెప్పుడు ఉన్నారన్న అనుభూతి మనకి కలుగుతుంది.

సాయిరాం

భగవంతుడిని గురించి తెలుసుకోవడమనేది మన మనస్సుమీద ఆథారపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆత్మ కనపడకుండా ఒక గట్టి తెర అడ్డుగా ఉండటంతో మనము ఆత్మ ని చూడలేకపోతున్నాము. మనం తెరని కనకఒక్కసారి అడ్డు తొలగించుకుంటే మనలో ఉన్న సాయిని సులభంగా చూడగలము. సాయి అంతటా నిండి ఉన్నాడు. ప్రేమ, నమ్మకం అనే గాజు ద్వారా ఆయన గోచరమవుతాడు. రోజు నేను షాలిని గారి మథురమైన బాబా అనుభూతినిప్రచురిస్తున్నాను. ఆమె అనుభవాన్ని చదివితే సాయి అంతటా నిండి ఉన్నాడని మనం అడ్డు తెరను తొలగించుకోవడమేఅని అర్థమవుతుంది. ... మీ అందరికోసం నేను షాలిని మైల్ ని జత చేస్తున్నాను.

ఓం సాయిరాం .. నమస్కారం ప్రియాంకా గారు, యెలా ఉన్నారు? మథ్యనే నేను మీ బ్లాగును చూడటంతటస్థించింది. షిరిడీ సాయిబాబా గారి శక్తి , ప్రేమని ప్రజలందరు తెలుసుకునేలా మీరు చేస్తున్న సేవకి నేను చాలాముగ్థురాలినయ్యాను. అప్పటినించి నేను ప్రతీరోజు రాత్రి పొద్దుపోయేదాకా అనుభవాలన్నిటినీ చదువుతూ ఉంటాను. అవై చదువుతుంటే నేను యెంతో సంతోషిస్తాను అది నా భాగ్యం అనుకుంటాను. బాబా తో నాకు కలిగిన అనుభూతినిచెపుతాను. వీలయితే దీనిని మీ బ్లాగులో ప్రచురించండి. ఒకవేళ ఇది పెద్దదిగా ఉంటే చెప్పండి, నేను దీనిని చిన్నదిగాచేసి పంపుతాను.

శ్రీ షిరిడీ సాయి బాబాతో నా స్వీయానుభవాన్ని మీఅందరితో కలిసి పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగాఉంది. ఇప్పుడు నేను యూ. ఎస్. లో ఉన్నాను. కాని నేను భారతదేశంలో హైదరాబాదు లో ని ఒక మథ్య తరగతికుటుంబం లోనిదానిని. మేము ముగ్గురం అక్కచెళ్ళెళ్ళం. మా తల్లితండ్రులు మాకు మంచి చదువులు చెప్పించటానికిచాలా కష్ట పడ్డారు., యింకా వాళ్ళు చేయగలిగినదంతా చేశారు. మా నాన్నగారు గొప్ప సాయి భక్తులు. అందుచేతచిన్నప్పటినించి ప్రతీ గురువారము మా యింటిలో పూజ చేస్తూ ఉండేవారము. నా చిన్నప్పటినించి నేను బాబాసాన్నిహిత్యాన్ని చవి చూశాను. ఆయన నా జీవితంలో ప్రతీ విషయంలోను నడిపించారు.

1) మా అమ్మగారు పాఠశాలలో ఉపాథ్యాయురాలు. యింటి దగ్గిర కూడా చదువు చెపుతూ ఉండేది. నా తల్లితండ్రులనుసంతోషపెట్టడానికి నేను కూడా యేదైనా చెయ్యాలి అనుకునేదాన్ని. ఆర్థికంగా కాకపోయినా యేదో కొంత చేద్దామని. ఫీజులేకుండా మంచి కళాశాలలో య్లింటర్మీడియెట్ లో చేరడానికి నాకు మంచి మార్కులు యిమ్మని సాయిబాబాని ప్రార్థించేదాన్ని. నా శాయశక్తులా నేను చేయగలిగింది చేసి మిగిలినదంతా బాబా కే వదలివేసేదాన్ని. ఆశ్చర్యకరంగాబాబా అనుగ్రహంతో నాకు ఎస్.ఎస్.సీ లో రాష్ట్రంలో మూడవ రాంక్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నించి నాకు నగదుబహుమతి, యింటర్మీడియెట్లో ఉచితంగా ప్రవేశం, ఉచితంగా పుస్తకాలు లబించాయి. 2) బాబా దయ వల్ల నాకు మంచియింజనీరింగ్ కళాశాలలో ప్రవేశం లబించింది. కళాశాలనించి వచ్చిన తరువాత నేను యింటిదగ్గిర హైయ్యర్ స్టూడెంట్స్కి పాఠాలు చెపుటు ఉండేదాన్ని. నేను చేయగలిగిన చిన్న సహాయం మా కుటుంబానికి చేసేదాన్ని. ఒకసారి మాయింటిలో కరెంట్ బిల్లులు చెల్లించని కారణంగా ఒకటి తరువాత ఒకటిగా 3 నెలలలపాటు కరెంట్ లేని సందర్భంకలిగింది. పరిస్థితినించి బయట పడవేయమని, సహాయం చేయమని నేను బాబాని ప్రార్థించాను. బాబాప్రేమానురాగాలతో నాకు యూనివర్సిటీనించి బ్రాంచ్ టాపర్ మరియు కళాశాల టాపర్ గా వచ్చినందుకు రెండు బంగారుపతకాలు వచ్చాయి. మంచి మల్టి నేషనల్ కంపనీలో నాకు కాంపస్ ప్లేస్మెంట్ కూడా వచ్చింది. నా తల్లితండ్రుక కళ్ళలోసంతోషాన్ని చూశాను. యివన్ని కూడా బాబా అనుగ్రహంతోనే జరిగాయి. ఒకసారి ఉదయం మా అమ్మగారు నాకుగింజలు లేని యెండు ద్రాక్షపళ్ళు (షిరిడీనించి తెచ్చినవి) సాయంత్రం ఆఫీసునించి తిరిగి వచ్చాక తినడానికి యిచ్చారు. సాయి సచ్చరిత్రలోని అథ్యాయం మీకు గుర్తుండే ఉంటుందని అనుకుంటున్నాను. అందులో బాబా గింజలున్న యెండుద్రాక్షపళ్ళని గింజలు లేనివిగా మారుస్తారు. నేను లీలని గురించి ఆలోచిస్తూ, నామీద కనక ప్రేమ ఉంటే నేనుతినబోయే తరువాతి దానిలో గింజ ఉండాలని బాబాని ప్రార్థించాను. నేను సంతోషంలో మునిగిపోయాను యెందుకంటేనేను తరువాత తిన్న పండులో గింజ ఉంది. అంతకుముందు తిన్న వాటిల్లోనూ, తరువాత తిన్నవాటిల్లోనూ దేనిలోకూడా ఒక్క గింజ కూడా లేదు.

2) నువ్వు కనక స్వచ్చమైన హృదయంతో, మనస్సుతో నమ్మితే, చిన్న సంఘటనలలో కూడా బాబా తన ఉనికినిచాటుతారు.

3) 3. ఇప్పుదు యూ.ఎస్. లొ నా బాబా అనుభూతి ప్రారంభమవుతుంది. నాకొచ్చే జీతం సరిపోదు కాబట్టి నాకుటుంబానికి సహాయపడటానికి పై చదువుల కోసం అమెరికా వచ్చాను. బాంక్ నుంచి అప్పు తీసుకుని బాబా దయతోడిసెంబరు 2008 లో నేను మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాను. ప్రస్తుత పరిస్థితులలో మార్కెట్ యెలా ఉందో మీకు తెలుసు. అప్పటినుంచి నాకు ఉద్యోగం రాలేదు, రోజు రోజుకీ నేను కృశించిపోతున్నాను. అమెరికాలో కూడా తన ప్రేమని, ఉనికినిచూపించమని బాబా ముందు రోదించాను. నేను భారతదేశంలో ఉన్నప్పుడు ఆయన చిన్న విషయాలలో కూడా నేనుకోరినప్పుడు తన లీలలను చూపెడుతూ ఉండేవారు.

4) కాని ఇక్కడ ఇక్కడ నాకు సహాయం చేయడానికి. యూ. ఎస్ చుట్టుపక్కల బాబా లేరేమో అని యెందుకనో భావంకలిగింది. తన ఉనికిని చూపమని నేను బాబాని ప్రార్థించినప్పూడు రోజు నా గదిలోకి ఒక పిచ్చుక యెక్కడినించోవచ్చింది. నా గదిలో పిచ్చుకని చూసి నేను ఆశ్చర్యపోయాను. అది నా గదిలో కూర్చుంది. నేను కొంచెం భయపడిబయటకు వెళ్ళి హాలులో కూర్చున్నాను. అప్పుడు బాబాని ప్రార్తించాను....నువ్వే కనక పిచ్చుకగా నా గదిలోకి వస్తే, ఆకాశంలోకి క్షేమంగా వెళ్ళిపో".. నా మదిలో ఆలోచన వచ్చిన మరుక్షణమే పిచ్చుక బయటికి వచ్చియెగిరిపోయింది. ఇది నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు. బాబా నా కళ్ళు తెరిపించి తాను సర్వంతర్యామిననినేను గ్రహించేలా చేశారు. ఆయన తన భక్తులకోసం సప్తసముద్రాలనైనా దాటి రాగలరు. యింతవరకు నాకు ఉద్యోగంరాలేదు. కాని నాకు తెలుసు యేది జరిగినా అది మనమంచి కోసమే జరుగుతుందని. సాయిబాబాకి తెలుసు మనకుయెప్పుడు యేది ఇవ్వాలో. ఇక్కడ నాకు పీ.హెచ్.డీలో ప్రవేశం దొరికింది మంచి థన సహయం కూడా లభించింది.

5) మన గురించి బాబా మనసులో యేముందో మనకి తెలియదు. బాబా తన బిడ్డలనెప్పుడు ప్రేమిస్తారు తనుఇవ్వగలిగినది ఇస్తారు.

6)

7) నా అనుభవాని మీరందరూ చదివినందుకు థన్యవాదాలు. బాబా తన ప్రేమతో, అభిమానంతో మిమ్ములనందరినిదీవించు గాక.

8)

9) ఓం సాయినాథ్ మహరాజ్ కీ జై

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు






Tuesday, June 7, 2011

సాయినాథుడే నాకు జన్మించాడు

0 comments Posted by tyagaraju on 7:35 AM


07.06.2011 మంగళవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయినాథుడే నాకు జన్మించాడు

సాయి బంథువులందరకు బాబా వారి శుభాశీస్సులు

ఈ రోజు శ్రిమతి ప్రియాంకా గారి బ్లాగులో ప్రచురింపబడిన ఒక సాయి లీలను తెలుసుకుందాము. ఈ లీలను మలేసియా నించి శ్రీమతి రిమ్మీ గారు పంపించారు. ఈ అనుభవం వారి మాటలలోనే తెలుసుకుందాము. ఈ లీల చదివితే బాబా కి అసాథ్యమన్నది లేనే లేదు, అసాథ్యాలని కూడా సుసాథ్యం చేయగలరని తెలుస్తుంది. నమ్మలేని అద్భుతం ఈ సాయి లీల.

అమ్మాయి ప్రియాంకా సాయిరాం,

మలేసియానించి నేను రిమ్మీని. గడచిన రెండు మూడు నెలలనుంచి నేను మీ బ్లాగును క్రమం తప్పకుండా చదువుతున్నాను. నీ బ్లాగు, నా స్వీయానుభూతిని మైల్ చేయమని నాకు ప్రేరణ కలిగించింది. నీకిది మైల్ చేసే ముందు నేను సంధిగ్థావస్తలో ఉన్నాను, యెందుకంటే ఈ కథ చాలా రహశ్యమైనదీ, మా కుటుంబానికి సంబంథించి వ్యక్తిగతమైనది. కాని ప్రపంచ వ్యాప్తంగా అందరి అనుభూతులను చదివిన తరువాత, నేను కూడా ఈ విచారకరమైన నా కథను కూడా రాయాలని నిశ్చయించుకున్నాను.

ప్రియాంకా, మాది భారత దేశంలోని పంజాబు. 35 సంవత్సరాల క్రితమే మేము మలేసియాలో స్థిరపడ్డాము. మా జీవితంలో ప్రతీదీ చాలా చక్కగా జరుగుతున్నాయి. మాకు యిద్దరు అబ్బాయిలు, చాలా విలాసవంతమైన జీవితం వారిది. నిజానికి మంచి జీవితం గడపడానికన్న యెక్కువే ఉంది. మా యిద్దరబ్బాయిలకీ రెండు సంవత్సరాల తేడా ఉంది. వాళ్ళిద్దరూ కూడా చదువులో మనచి తెలివితేటలు కలవారు.

ఒక్ రోజున నేను, మా పెద్ద అబ్బాయి, బజారుకు వెళ్ళాము. తిరిగి వచ్చేటప్పుడు మా కారు కి చాలా పెద్ద ప్రమాదం జరిగింది. నాకు తెలివి తప్పిపోయింది. ఆరోజున మాకు యేమి జరిగిందో కూడా నాకు సరిగా తెలియదు. రెండు రోజుల తరువాత నాకు స్పృహ వచ్చి, నా భర్తని అబ్బాయి గురించి అడిగాను. ఆయన, అబ్బాయికి బాగానే ఉందని యింట్లో నిద్ర పోతున్నాడని అందుచేత ఆందోళన పడద్దు అని చెప్పారు. నేను నిద్రపోయాను. నిద్రలో నేనొక కల గన్నాను, అందులో బాబా మా అబ్బాయిని తీసుకుని వెడుతూ చెప్పారు, విచారించద్దు నేను నీ కొడుకుగా ఉంటాను. ఈ కల చాలా చిన్నది. హటాత్తుగా నేను నిద్ర లేచి బెల్ కొట్టాను. ఒక నర్స్ వచ్చి యేంజరిగిందని అడిగింది. నేను నాకు వచ్చిన కల గురించి చెప్పి యేడవడం మొదలుపెట్టాను. నర్స్ కూడా నాతోపాటు యేడవడం మొదలుపెట్టిది, అబ్బాయి మరణించిన విషయం తనకు తెలుసును.

ఆమె కన్నీళ్ళు నాకు సమాథానం చెప్పాయి. నేను మళ్ళీ తెలివితప్పిపోయాను. 3 గంటల తరువాత నాకు స్పృహవచ్చాక, నన్ను యింటికి తీసుకుని వెళ్ళమని మా ఆయనని అడిగాను. డాక్టర్ దగ్గిర ప్రత్యేకంగా అనుమతి తీసుకుని నన్ను యింటికి తీసుకుని వెళ్ళాను. మా చిన్నబ్బాయి కూడా షాక్ లో ఉన్నాడు. రికీ లేడనే విషయాన్ని నమ్మలేక నేను పిచ్చిదానిలా అయిపోయాను. యేమైనప్పటికీ బాబా దయవల్ల కోలుకున్నాను, కాని మానసికంగా కృంగిపోయాను. నేనెప్పుడు నిద్ర పోయినా నాకు ఆ కలే వస్తూ ఉండేది. ఒకరోజున నేను ఈ కల గురించి మా ఆయనకు చెప్పాను. అప్పుడాయన, చూడు, రిమ్మీ అది ఒక కల మాత్రమే. నీకిప్పుడు మెనోపాజ్ కూడా వచ్చింది నీకింక పిల్లలు పుట్టరు. నేనాయనక మాటలకి నిజమే అనుకున్నాను. కాని బాబా కల అబథ్థం అవడానికి వీలు లేదు.

రెండు నెలల తరువాత ఒక రోజున నాకు వికారంగా అనిపించింది. బహుశా వేపుళ్ళు తినడం వల్ల అయి ఉండచ్చనుకున్నాను, యెందుకంటే సాథారణంగా అలాంటి వేపుడు పదార్థాలు తిన్నప్పుడు నాకు అలా ఉంటూ ఉండేది. కాని ఆ వికారం యింకా అలాగే ఉండటంతో డాక్టర్ వద్దకు వెళ్ళాను. డాక్టర్ గారు అన్ని పరీక్షలూ చేశారు. కాని 56 సంవత్సరాలున్న స్త్రీ గర్భవతి అవుతుందని యెన్నడూ అనుకోడు. ఓహ్ ...మై గాడ్ ... ప్రియాంకా అదే బాబా చేసిన అద్భుతం. నేను మా ఆయనకి గర్భవతినైన విషయం చెప్పినప్పుడు తను కూడా నమ్మడానికి సిథ్థంగా లేరు. సరే యింక ఈ పెద్ద కథని కుదించేస్తాను. జనవరి 25, 2007 సంవత్సరంలో నాకు అబ్బాయి పుట్టాడు. నేను గర్భంతో ఉన్న సమయంలో నా వయసు రీత్యా నాకు యెటువంటి సమస్యలు రాలేదు. ఈ 9 నెలలూ యెలా గడిచాయో కూడా నాకు తెలియదు.

బాబా తన మాటని నిలబెట్టుకుని మాయింట జన్మించి నాకు కొడుకుగా వచ్చారు. మేము మా అబ్బాయిని సాయినాథ్ అని పిలుస్తాము, మాకు ఆశ్చర్యం కలిగించిన విషయమేంటే, వాడికి మాటలు వచ్చేముందు, మాట్లాడిన మొట్టమొదటి మాట మామా కాదు పాపా కాదు బాబా ... బాబా.. బాబా.

యిప్పుడు మా పెద్ద అబ్బాయి వయస్సు 23 సంవత్సరాలు. చిన్న అబ్బాయి వయస్సు 3 సంవత్సరాలు. సాయినాథ్ జన్మించాక నాకు మళ్ళి ఆ కలరాలేదు, యెందుకంటే బాబాయే మాయింటిలో మా కొడుకుగా ఉన్నారు.

ప్రియాంకా నువ్వు ఈ బ్లాగుకు చేస్తున్న సేవకు నేను చాలా ముగ్థురాలినయ్యాను. నాకింకా నీ బ్లాగంటే ఇష్టం యెందుకంటే యిందులో ఉన్న కథలన్నీ యదార్థాలు. యెప్పుడు ఇలాగే యింకా తరచూ యిటువంటివి ప్రచురిస్తూ ఉండు.

శుభాకాంక్షలు మరియు దీవెనలతో

నీ రిమ్మీ ఆంటీ.

చూశారా, యిప్పుడు బాబా చేసిన ఈ అద్భుత లీల గురించి మనమేమి చెప్పగలం. యిటువంటి అద్భుతమైన సాయి లీలను రాసినందుకు నేను రిమ్మీ ఆంటీని అభినందిస్తున్నాను. నీకు నీ కుటుంబమంతటికి నా అభినందనలు.

అల్లా మాలిక్

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Monday, June 6, 2011

బాబా కథలు దీప స్థంభములు

0 comments Posted by tyagaraju on 6:59 AM



06.06.2011 సోమవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులందరికి బాబావారి శుభాశీస్సులు

బాబా కథలు దీప స్థంభములు

ఈ రోజు బాబా గురించి, కథల గురించి కొంత తెలుసుకుందాము.

సముద్రము మథ్యలో దీపస్థంభములు ఉంటాయి. ఆ వెలుతురులో రాళ్ళ రప్పలవల్ల కలిగే హానులని తప్పించుకుని సురక్షితముగా ప్రయాణిస్తూ ఉంటారు. అంటే యేమిటన్నమాట? సముద్రంలో ఓడల్లో ప్రయాణీంచేవారికి అవి దారితప్పకుండా ప్రయాణానికి సహాయపడతాయి. ప్రపంచమనే మహా సముద్రములో బాబా కథలు దీపములుగా దారి చూపుతాయి. అవి అమృతముకంటే తియ్యగా ఉండి ప్రపంచయాత్ర సేవారికి మార్గము సులభంగాను, సుగమముగాను చేస్తాయి. మనము ఈ సంసారమనె మహా సముద్రంలో ప్రయాణించాలంటే బాబా కథలు, బోథలు మనకి కర దీపికలుగా ఉంటాయి. బాబా మన సద్గురువు, మార్గ దర్శకులు.

యోగీశ్వరుల చరిత్రలు, కథలు ప్రవిత్రములు. అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించునప్పుడు శరీర స్పృహ, అహంకారము, ద్వంద్వ భావాలు నిష్క్రమిస్తాయి. మన హృదయమందు నిలవ ఉన్న సందేహములు పటాపంచలయిపోతాయి. శరీర గర్వము మాయమయిపో యి కావలసినంత జ్ణానము నిల్వ చేయబడుతుంది. శ్రీ సాయి బాబా కీర్తి, వర్ణనలు ప్రేమతో పాడిన గాని, వినిన గాని భక్తుని పాపములు పటాపంచలవుతాయి. కాబట్టి యివే మోక్షానికి సులభ సాథనాలు. కృతయుగములో శమ దమములు (అనగా నిశ్చల మనస్సు, శరీరము) త్రేతాయుగములో యాగము, ద్వాపరయుగములో పూజ, కలియుగములో భగన్నామ మహిమలను, నామములను పాడుట, మోక్షమార్గములు. నాలుగు వర్ణముల వారును ఈ సాథనములను అవలంబించవచ్చు. తక్కిన సాథనములు అనగా, యోగము, యాగము, థ్యానము, థారణము అవలంబించుట కష్టతరము. కాని భగవంతుని కీర్తిని, మహిమను పాడుట అతి సులభము. మన మనస్సును మాత్రము అటువైపు తిప్పాలి. భగవత్కథలను వినడంవల్ల, పాడటం వల్ల మనకు దేహాభిమానము తొలగిపోతుంది. అది భక్తులను నిర్మోహులుగ చేసి చివరికి ఆత్మ సాక్షాత్కారము పొందునట్లు చేస్తుంది. ఈ కారణము చేతనే సాయిబాబా హేమాడ్ పంత్ చేత సాయి సచ్చరిత్రని సహాయపడి వ్రాయించారు.

సచ్చరిత్ర మొదటి అథ్యాయములో గోథుమలు విసిరి ఆ పిండిని ఊరిబయట చల్లి కలరా జాడ్యముని తరిమి వేసిన బాబా వింత చర్యను వర్ణించారు. యిదేగాక శ్రీ సాయి యొక్క యితర చర్యలు మహిమలు విని సంతోషించారు. ఆ సంతోషమే ఈ గ్రంథమును వ్రాయుటకు పురి కొల్పింది. బాబా గారి వింత లీలలు, చర్యలు మనసుకు ఆనందము కలుగ చేస్తుంది. అవి భక్తులకు బోథనలుగా ఉపకరిస్తాయి. చివరకు పాపములను పోగొట్టును కదాయని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును, వారి బోథనలును వ్రాయ మొదలెట్టారు.

శ్రీ హేమాడ్ పంత్ శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథ రచనకి తాను తగిన సమర్థుడను కానని భయపడ్డారు. యోగీశ్వరుని చరిత్ర వ్రాయుట బహు కష్టమని భావించారు. కాని శ్రీ సాయిబాబా ఆయన చేత యింతటి మాహా అద్భుతమైన గ్రంథాన్ని వ్రాయించి మనకు అందించారు. బాబా తలుచుకుంటే పామరుణ్ణి కూడా పండితుణ్ణి చేయగలరు. మనలో గర్వం అహంకారము లేశ మాత్రమైనా ఉండకోడదు. అంతా బాబాయే చేయుస్తున్నారు నేను నిమిత్తమాత్రుణ్ణి అనుకుంటే ఆయన మనమీద చూపించే అనుగ్రహం అపారం.

ప్రతీ భక్తుడు కూడా అలనాటి షిరిడీ యెలా ఉండేదో అని ఒక్కసారయినా అనుకోకుండా ఉండి ఉండరు. ఇక్కడ ఆనాటి షిరిడీ ఫోటొలని కొన్ని జత చేసున్నాను చూడండి. ఆ కాలంలోకి వెళ్ళి బాబాతో ఉన్నట్లుగా ఊహించుకోండి.

1. 1905 సంవత్సరములో ద్వారకామాయి ఈ విథంగా ఉంది.






2. ఈ అపురూపమైన చిత్రం బాబా చేతిలో పుస్తకము ఉన్నటువంటిది. ఒక గురుపూర్ణిమనాడు చాలా మంది భక్తులు వచ్చి బాబా ఆశీర్వదించి మరల తిరిగి ఇస్తారని, ఆయనముందు ఒక పుస్తకాన్ని ఉంచారు. అది చదివాక తమకు యెంతో ఫలితం ఉంటుందని భావించారు. యేమైనప్పటికి బాబా ఒక భక్తునినుంచి పుస్తకం తీసుకుని అది యింకొక భక్తునికిచ్చారు. ఈ ఫోటో మరాఠీ సచ్చరిత్ర మొట్టమొదటి ముద్రణలోనిది. ఆయన చేతిలో ఉన్న పుస్తక తుకారాం గాథ.


3. అదృశ్యంగా బాబా:


ఈ ఫోటో బాబా భక్తులతో లెండీబాగ్ కు వెడుతున్నప్పటిది. ఒక భక్తుడు ఫోటో తీసుకుంటానని బాబా ని అనుమతి అడిగాడట. కాని బాబా ఒప్పుకొనక నా పాదాలను మాత్రమే ఫోటో తీసుకోమన్నారట. కాని ఆ భక్తుడు మొత్తం ఊరేగింపునంతా ఫోటో తీశాడట. ఆ ఫోటో లో , గొడుగు, భాగోజీ షిండే, ఇంకా భక్తులను మాత్రమే చూడగలం కాని బాబా ఉన్నచోట ఆయన పాదాలు మాత్రమే కనిపిస్తాయి.

4. లెండిబాగ్ ఉత్సవం




బాబా, బూటీ, నూల్కర్, బాగోజీతో లెండీబాగ్ కి వెళ్ళుట.

5. లెండీ బాగ్ లో భక్తులు :

లెండీ బాగ్ లో నిలుచున్న భక్తులు: యెడమనుండి 1. రావ్ బహద్దూర్ ఎం. డ్బ్ల్యూ. ప్రథాన్ . 2. ఎస్.డీ. నవాల్కర్ రావ్ సాహెబ్ 3. టీ. గల్వాంకర్ 4. ఎస్.ఎన్. ఖార్కర్ (సెక్రటరి) లెండీ బాగ్.






6. సమాథి 1954 లో:




7. సాఠేవాడా 1908 లో నిర్మించబడింది. భక్తులకోసం 1924 నించి ఉపయోగంలోనికి వచ్చింది. (ప్రస్తుత గురుస్థాన్ ప్రాంతం) శ్రీ నవాల్కర్ దీనిని కొన్నాక ఆయన తరువాతి వారు దీనిని 1939 లో షిరిడీ సంస్థానానికి ఇచ్చివేయడం జరిగింది.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List