Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, February 6, 2019

ముత్యాల సరాలు – 4 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 8:04 AM
 Image result for images of shirdi sai
 Image result for images of rose

06.02.2019  బుధవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ముత్యాల సరాలు – 4 .భాగమ్

35.  భగవాన్ రమణమహర్షి వాక్కు
       కర్త (భగవంతుడు) వారి వారి ప్రారబ్ధ కర్మానుసారము జీవులను ఆడించును.  జరుగునది, ఎవరెంత అడ్డుపెట్టినను ఆగదు.  జరుగనిది ఎవరెంత అడ్డుపెట్టినను జరుగును.  ఇది సత్యము.  కనుక మౌనముగా ఉండుటయే ఉత్తమము.

36.  జున్నూరు నాన్నగారు  :  రామనామం వలన బుద్ధి శుధ్ధి అవుతుంది.

Monday, February 4, 2019

ముత్యాల సరాలు - 3 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 6:25 AM
      Image result for shirdi sai baba
          Image result for images of roses hd

04.02.2019  సోమవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ముత్యాల సరాలు - 3 వ.భాగమ్

29.  సత్సంగం అంటే మన నడవడిని సరి చేసుకొనేందుకు రిపేరు చేసే వర్కు షాపులాంటిదె. అదే సత్సంగం జరిగే ప్రదేశం.  గ్రంధ  పారాయణం నుండి మనం నేర్చుకోవలసినది  ఏమిటి?  మనలోని దోషాలు ఏమిటి?  వాటిని సరిచేసుకోవడం ఎలా?  మనలోని దోషాలు గుర్తించుకోవడం మన మొదటి కర్తవ్యం.  తర్వాతి మెట్టు నిర్మూలన.  అది మన తీవ్ర ప్రయత్నంతోనే సాధ్యం.  ఎవరికి వారే, వారి వారి లోపాలను నిర్మూలించుకొనే పధ్ధతులు ఆచరించాలి.  సత్సంగాన్ని మనం  మనలోని దోషాలను విముక్తి చేసే వర్కుషాపులా, వినియోగించుకోవాలి.  

Sunday, February 3, 2019

ముత్యాల సరాలు – 2 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 7:35 AM
     Image result for images of shirdi baba
    Image result for images of rose
03.02.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ముత్యాల సరాలు – 2 వ.భాగమ్
16.  డబ్బు ఎక్కువగా ఉన్నవాడు ఇంట్లోవాళ్ళకి, బయటవాళ్ళకి భయపడతాడు.  మనకు డబ్బు మీద ఆకర్షణ ఉన్నప్పుడు దేవుడు అసత్యం, లోకం సత్యం అనిపిస్తుంది.  ఏవిధమైన ఆకర్షణ లేదనుకోండి, దేవుడు సత్యం, లోకం అసత్యం అని మనకు అనిపిస్తుంది.

17. కష్టాలనుంచి బయట పడటానికి భగవంతుడిని ప్రార్ధించినవాడూ భక్తుడె, డబ్బుకోసం ఇబ్బందిపడి ప్రార్ధించినవాడూ భక్తుడె.  జ్ఞాని కూడా భక్తుడె.  కానీ, నిజమైన భక్తుడు జ్ఞాని మాత్రమే.  మిగతావారు కోరికలతో భగవంతుని ప్రార్ధిస్తారు.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List