01.09.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 20 వ.భాగమ్
సాయిబంధువులందరికి వినాయకచవితి శుభాకాంక్షలు
సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న
అమూల్యమయిన సాయి సందేశాలు
సంకలనమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
చదివిన తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
ఫోన్స్ & వాట్స్ ఆప్ : 9440375411 &
8143626744
12.08.2019 - సాయిబానిసగారికి బాబాగారు
తెలిపిన అభినందనలు
11.08.2019 నాడు బాబాగారి ఆదేశానుసారముగా సాయిబానిస గారు శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖి కార్యక్రమము పూర్తి చేసినారు. 12.08.2019 నాడు ఉదయము బాబాగారు
సాయిబానిస గారికి ఇచ్చిన చక్కని అనుభూతిని మీకు తెలియజేస్తాను. …………
త్యాగరాజు
“సాయిబానిసగారు
సికిందరాబాదులోని మిలటరీ పెరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న సైనిక కవాతు చూడటానికి
వెళ్ళారు. ప్రజలమధ్య
సాయిబానిసగారు తన తెల్లని లుంగీ, తెల్లని చొక్కా, భుజాన తెల్లని జోలి వేసుకొని నిలబడ్డారు. మిలటరీ కవాతులో భారత
సైన్యాధికారి ఫీల్డ్ మార్షల్ మానెక్ షా గారు జీపులో నిలబడి సైనికవందనము
స్వీకరించసాగారు. జీపు
ప్రజల వద్దకు వచ్చినపుడు మానెక్ షా గారు జీపు దిగి ప్రజలందరికి అభివాదము చేసి,
సాయిబానిసగారి వద్దకు వచ్చి అభివాదము చేసి, తనతోపాటు
మధ్యాహ్న భోజనమునకు రమ్మని ఆహ్వానించారు.