27.03.2011 ఆదివారము క్యాంప్: బెంగళూరు
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి భక్తుడు
ఏమీ నిన్నుపేక్షింతునా - 2
సాయి భక్తుడు తన కోర్కెలు తీరకపోయినా యెట్లా ప్రతిస్పంధించాలి?
"శ్రీ సాయి థ్వయ మంత్ర"
"మనం యెక్కువ జ్ఞానంతో ఉండాలంటే నమ్మకం, శ్రథ్థ లేక ఓర్పు లేక సహనం" యివి అలవరచుకోవాలి. యెప్పుడు? మనకు పరీక్ష కాలంలో. అప్పుడే మనం యింకా యెక్కువగా శ్రథ్థ సహనం ఎక్కువగా అభివృథ్థి చేసుకోవాలి.
ఆ సమయంలో మనం భగవంతుడిని విస్మరించరాదు. పైగా యిదంతా భగవంతుడే చేస్తున్నాడనిపొరపడకూడదు. ఈ ప్రపంచంలో మన శ్రేయస్సు కోసమే బాబా గారు యిప్పటికీ ఉన్నారు. సామాన్య మానవుడు భగవంతుడిని అర్థం చేసుకోలేడు. కానిజ్ఞానం ఉన్న మానవులు, సాథువులు సద్గురువులు చెప్పిన మాటలను విని బాగా అర్థంచేసుకోగలరు. వారు చెప్పినవి చదివి అర్థం చేసుకోగలరు. సద్గురువులు, సాథువులు మాత్రమే యెవరయితే భగవంతునియొక్క ఉనికిని తెలుసుకున్నారో వారు మాత్రమే సామాన్య మానవునికి జీవితముయొక్క అర్థం, పరమార్థం యింకా భగవంతుడంటే యెవరు, ఆత్మజ్ణానం వీటన్నిటి గురించీ వివరంగా తెలియచేగలుగుతారు.
అందుచేత షిర్డీ సాయి బాబా గారు చెప్పిన బోథలన్ని కూడా చాలా సరళంగా ,మథురంగా ఉంటాయి.
యెక్కువగా అజ్ఞానం, అశ్రథ్థ వీటి వల్ల మంచితనంగా ఉండటమనేది చాలా కష్టసాథ్యమయిన విషయంగా మారిపోయింది. అందుచేతనే కష్టాలు పెరిగిపోవడం. ఈ సత్యాన్ని కనక తెలుసుకుంటే మానవుడు యిక ముందు తప్పులు చేయకుండా ఉంటాడు.
ఒకవేళ మనము యితరులకి సహాయం చేయడం యిష్టం లేకపోతే కనీసం మనం వారికి అడ్డంకిగా ఉండకూడదు. బాథలనేవి భగవంతుని కారణంగా వచ్చినవి కావు. మనం మానవతా విలువలు మరచిపోయి మంచితనం మరిచిపోయి, మన పిల్లలనుకూడా అదే మార్గంలో నడిపించినందువల్ల వచ్చిన కష్టాలు.
ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెపుతాను.
మనము పిల్లలకు కూడా చిన్నతనం నించే యితరులతో మంచి తనంగాఉండటం, పరోపకార బుథ్థి యివన్ని నేర్పించాలి. మొక్కై వంగనిది మానై వంగదు అనే సామెత మనకందరకు తెలుసు.
ఇప్పుడు వచ్చే సినిమాలు చూడండి. అందులో డైలాగులు విని చిన్న పిల్లవాడు ముద్దు ముద్దుగా అనుకరిస్తూ మాట్లాడుతూ ఉంటే మురిసిఫొయి "ఏదీ, మళ్ళీ చెప్పమ్మా, మళ్ళి చెప్పు " అని వాడిని ప్రోత్సహిస్తూ ఉంటే పిల్లవాడు అదే బాటలో నడుస్తాడు. ఉదాహరణకి ఒక సినిమాలో హీరో ఇలా అంటాడు. "తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక మాట క్షమించడం" ఈ డైలాగుని ముద్దు ముద్దుగా చిన్న పిల్లవాడు బట్టీ పట్టినట్లు అందరి ముందూ అనుకరిస్తే వాడిని యింకా యింకా ప్రోత్సహిస్తాము. పెద్ద అయిన తరువాత వాడికి అదే అలవాటు అయ్యి యెవరిని క్షమించే మనస్తత్వం ఉండకపోవచ్చు. యెవరిని విమర్శిస్తున్నాననుకోవద్దు. లోకం తీరు గురించి మనం కాసేపు ముచ్చటించుకుందాము. సినిమాలు చూడచ్చు. టీ.వీ. చూడచ్చు. కాని వాటి లో ని విషయాలని వంట పట్టించుకోకుండా అక్కడిది అక్కడే వదలివేయడం నేర్చుకోవాలి. అప్పుడే ఈ విషయ వాంఛలేవీ మనకు అంటవు. ఉదాహరణకు మనలని తీసుకోండి. మన పిల్లలకు మనం యెంతవరకు భక్తి భావాలు నేర్పుతున్నాము. మనం భక్తి మార్గంలో ఉంటే మన పిల్లలు కూడా అదే బాటలో పయనిస్తారు. కొంచెం కాకపోయిన కొంచెమన్న భక్తి అలవడుతుంది. పూర్తిగా అలవడితే చాలా అదృష్టం. ఇలా యెందుకు చెపుతున్నానంటే యెవరినీ విమర్శించడం కాదు. నేడు ఇదంతా పోటీ ప్రపంచం. తల్లితండ్రుల దగ్గిరనించి ఎల్.కే.జీ. చదివే పిల్లలందరివరకు పొద్దున్న లేచింది మొదలు సాయంత్రం వరకు అంతా ఉరుకులు పరుగులు. ఇక పొద్దున్నే లేచి కొంచెం సేపు పూజా మందిరం ముందు కూర్చుని పూజ చేసే సమయం కూడా ఉండని రోజులు. ఇక ఆదివారము మాత్రమే కులాసాగా గడిపే రోజు.
ఈ పోటీ ప్రపంచంలో మన జీవిత విథానం గురించి బాబా గారికి ముందే తెలుసు. అందుకనే ఆయన యేమని చెప్పారూ? నాకు పూజా తంతులతో పనిలేదు, షోడసోపచార పూజలతో పని లేదు. కావలసినదల్ల భక్తి, అనే కదా చెప్పారు. ఇక్కడ మనం గ్రహించుకోవలసింది యెమిటంటే, బాబా గారు ఇల చెప్పారు కదా ఊరికే భక్తితో ఒక నమస్కరం లేద ఒక ఫలం నైవేద్యం పెడితే మన పని అయిపోతుంది అని అర్థం కాదు. ఇలా చెప్పింది యెవరికోసం? రోజులో సమయం లేనివారికి. కొతమంది భక్తులు ఉంటారు. పొద్దున్నే ఆఫీసుకి వెళ్ళాలి. నగరాల్లో ఉన్నవారికి పొద్దున్నే లేచి పూజలు చేసుకుని వెళ్ళాలంటే కుదరని పని. పొద్దున్నే 7 గంటలకే బస్సు పట్టుకుని వెళ్ళకపోతే సమయానికి చేరుకోలేని పరిస్థితి. అటువంటిఎ వారికి బాబా గారు చెప్పిన పథ్థతి. మరి సమయం ఉన్న మిగతావారి విషయంలొ మటుకు శ్రథ్థగా మనసు పెట్టి బాబా గారిని భక్తి శ్రథ్థలతో పూజించుకోవచ్చు.
నేనొక పుస్తకంలో చదివాను. అందులో రచయిత రాసినది " మనము సాయి భక్తులమని చెప్పుకుంటున్నామే కాని మనలో సాయిబాబాను పూర్తిగా విశ్వసించి వారిపై ఆథారపడి జీవించలేకపోతున్నాము" యెంత అద్భుతంగా చెప్పారో చూడండి.
ఇక్కడ మీకొక చిన్న సాయి లీల ఒకటి చెప్పడం సందర్భోచితంగా ఉంటుంది.
శ్రీ దేశిరాజు శ్రినివాసరావు అనె సాయి భక్తులు శ్రీ బాపట్ల పార్థసారథిగారిని (వీరు కూడా సాయి భక్తులు) దర్శించుటకు ఒకరోజు చెరువు గ్రామము వెళ్ళారట. తన విషయములు ఆయనతో చెప్పుకుని వారి ఆశీశ్శులు తీసుకున్న తరువాత వారు ఇచ్చిన "ఏమీ నిన్నుపేక్షింతునా" అనే మాస పత్రికను తీసుకొని రోడ్డు మీదకు వచ్చి బస్సు కోసం నిలుచున్నాడు. యితనికి ఒక చెయ్యి మోచేయి నుండి అరచేయి వరకు చాలా రోజులనుండి నొప్పిగా ఉంది బాథ పడుతున్నారట. ఆ సమయంలో నొప్పి యెక్కువై యెమీ తోచడంలేదు. తన చేతిలో నున్న "ఏమీ నిన్నుపేక్షింతునా" అనే పత్రికను నొప్పి ఉన్న చేతిపై పైకి కిందకి రాస్తూ ఓం శ్రీ సాయిరాం నామము స్మరించడం మొదలుపెట్టారు. కొంత సేపటికి బస్సు రావడంతో బస్సు యెక్కి బాపట్ల వస్తుండగా చేయి నొప్పి గుర్తుకు వచ్చిందిట. నొప్పి లేదు. ఆశ్చర్యపోయారు. అంతే అంతటితో ఆ నొప్పి తగ్గిపోయింది. సాయి నామము, సాయి పత్రిక, బాబా యందు విశ్వాసము ఆ నొప్పిని తగ్గించాయి.
ఇక్కడ యింకొక విషయం చెప్పుకుందాము.
పొన్నూరులో శ్రీ పులిపాక శేషగిరిరావు గారనె బాబా భక్తులు ఉండేవారట. మొదటలో ఆయన ఆంజనేయస్వామి ఉపాసకుడు. ఒకసారి ఈయన తమిళుడైన సంజీవయ్యగారిని (నారాయణ బాబా) గారిని 1971 లో దర్శించారు. సంజీవయ్యగారు గణపతి ఉపాసకుడు, బాబా భక్తుడు. ఆయన శేషగిరిరావు గారికి శ్రీ సాయిబాబా విగ్రహము ఇచ్చి ఇలా చెప్పారు:
" అందరు దేవతలు పూజ చేయకపోతే ఊరుకుంటారు. పూజ చేసినప్పుడు మాత్రమే అనుగ్రహిస్తారు. కాని బాబా అట్లా కాదు. ఈయనను ఒకసారి పూజ చేసిన తరువాత మరలా చేయకపోయినా ఆయనయే వెంటపడి చేయించుకుంటారు."
మనం ఇన్ని బాబా లీలలు చదువుతున్నాము. ఇది సత్యం అనిపిస్తోంది కదూ. ఇంక నా అనుభవంలో నేను గమనించింది యేమిటంటే, ఒకసారి పూజ చేసినవారిని మాత్రమే కాదు, బాబా అంటే తెలియని వారిని కూడా యేదొ ఒక చిన్న లీల లేక అనుభూతి కలిగించి తన వాడిగా చేసుకుంటారు. అంటే యేదో జన్మలో బాబా వారితో సంబంథం ఉంది ఉంటుంది. తనవారిని ఆయన వదలరుగా. యేమంటారు? దీనిని బట్టి చూస్తే బాబా గారు మానవులను ఉథ్థరించడానికి వచ్చిన సద్గురువు. మనం ఈ సద్గురువుని ఆశ్రయించిన తరువాత యింక వేరే గురువుని ఆశ్రయించవలసిన అవసరం లేదు.
అందుచేత యెవరికి వారు ఆత్మ విమర్శ చేసుకోవాలి. అదే మంచి పథ్థతి. అందు చేత మానవుడు యేవిథంగా ప్రవర్తించాలి అన్న విషయాలు కొన్ని చెప్పుకుందాము. వీటిలో మనం ఎంత వరకు ఆచరణలో పెట్టగలమో ఆలోచించాలి. వీటిలో సగమన్నా మనం ఆచరణలో పెట్టగలిగితే
మన బాథలు సహం వరకూ తగ్గిపోతాయి. ఇది సాయి తత్వం.
ఎక్షంప్లె:
ఈ నవవిథ సూత్రాలు చూద్దాము.
1. యేదయినా గాని మంచి చేయి, మంచి మాట్లాడు, మంచిగా ఆలోచించు.
2. అందరితోను దయగా ఉండు. బీదవారికి సహాయం చేయి. అవసరమయిన వారికి నీకు తగినంతలో సాయం చేయి. తిండి, బట్ట,నీద మరియు థన సహాయం చెయ్యి. ఇలా నువ్వు అవసరమయినవారికి సాయం చేస్తే నీకు తృప్తి, సంతోషం కలుగుతాయి..
3. యెవరయినా నీపట్ల తప్పు చేస్తే క్షమించడం నేర్చుకో. వాటి గురించి మర్చిపో. కాని ప్రతిగా వారినిగాయపర్చవద్దు. బదులుగా నువ్వు వారినించి తప్పుకో. నీఆలోచనలనుంచికూడా వారిని తరిమి వేయి.
4. యెవరయితే నీకు సహాయం చేశారో వారిని గుర్తుంచుకో. వారికి కృతజ్ణతగా ఉండు.
5. నువు యెవరికయినా సాయం చేస్తే మర్చిపోవడానికి ప్రయత్నించు. అహంకారానికి నో చెప్పు.
6. ప్రతీరోజు నీ శ్రేయస్సుకోసం, నీ కుటుంబ సౌఖ్యం కోసం, ప్రపంచ శాంతి కోసం, ప్రార్థించదం, మరియు భగవంతునికి గురువులకు కృతజ్ణతలు చెప్పడం అలవాటు చేసుకో.
7. మనం పడే కష్టాలకు పూర్వ జన్మలో మనం చేసిన కర్మల వల్లనేఅనిమనం ఓరిమి వహించి అంగీకరించాలి. ఆ సమయంలో భగవంతుడిని, గురువుని గట్టిగా పట్టుకో. అందుచేత తరచు దేవలయానికి వెళ్ళి దర్శించుకోవాలి. వీలు కాకపోతే థ్యానం చేయడం అలవాటు చేసుకో. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించు. ఎంతవరకు సాథ్యమయితే అంత వరకు ప్రశంతంగా ఉంటే సమస్యలు అథిగమించడానికి దోహదం చేస్తుంది.
8. తెలియక చేసిన తప్పులకి భగవంతుడిని, గురువుని క్షమాపణ అడుగు.
9. భగవంతుని మరియు గురువుయొక్క కీర్తిని నలుదిశలా వ్యాప్తి చెయ్యి.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు