Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, May 9, 2024

సాయి అనుగ్రహం అపారమ్ – 12 వ.భాగమ్

Posted by tyagaraju on 5:34 AM

 


09.05.2024 గురువారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బందువులకు బాబావారి శుభాశీస్సులు

 శ్రీ సాయిలీల ద్వైమాస పత్రిక నవంబరు, డిసెంబరు 2023 సంచికనుండి గ్రహింపబడినది.

ఆంగ్ల మూలం :  డా.క్షితిజ రాణే

తెలుగు అనువాదం ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

ఫోన్. 9440375411,  8143626744

సాయి అనుగ్రహం అపారమ్ – 12 వ.భాగమ్

10.03.1998 భావూ మహరాజ్ పరమపదించి 13 వరోజు కార్యక్రమమయిన ‘తెరవ’ కి భక్తులందరూ సమావేశమయ్యారు.  ఆ కార్యక్రమం సందర్భంగా సి.బి.డి. బేలాపూర్ లొ ఉన్న శ్రీ జాదవ్ గారి ప్రభుత్వ నివాసం వద పెద్ద పందిరి వేశారు.  తమ ప్రియతమ సద్గురుని స్మరించుకునే నిమిత్తం భక్తులందరూ ఆ పందిరిలో ఆశీనులయ్యారు.  


13 వ. రోజు జరగవలసిన కార్యక్రమాలన్నీ పూర్తయిన తరువాత బాగా అనుభవమున్న కొంతమంది భక్తులు వేదిక మీద భావూ మహరాజ్ గారి గుణగుణాల గురుంచి చెబుతూ శ్రధ్ధాంజలి ఘటిస్తున్నారు.  వారు చెప్పే విషయాలను భక్తులందరూ ఎంతో శ్రధ్ధగా వింటున్నారు.  భావు మహరాజ్ గారి ప్రేమ, ఆప్యాయతల గురించిన జ్ణాపకాలు వారందరి హృదయాలను కదిలించాయి.

మాయి, స్మితా తాయి, శ్రీ జాదవ్ గారు ఆయన భార్య వేదికకు ఒక ప్రక్కన నుంచుని భక్తులు చెబుతున్న విషయాలను వింటున్నారు.  స్మితాతాయి తన తండ్రి గతస్మృతులను తలచుకుంటూ చాలా దుఃఖిస్తూ ఉంది.  “ఇపుడు నా భావాలను ఎవరితో పంచుకోవాలి? అవసరమయినపుడు నేనెవరితో చెప్పుకోవాలి?  ఎవరి సలహాలను తీసుకోవాలి” అని మనసులో బాధ పడుతూ ఉంది.  సరిగా అదే సమయంలో మహాత్ముడిలా ఉన్న ఒక వ్యక్తి ఆమె దృష్టినాకర్షించాడు.  అతను వెలిసిపోయిన కుర్తా, లుంగీ, తలపాగా ధరించి ఉన్నాడు.  అతనికి గడ్డం ఉంది.  చేతిలో కర్ర ఉంది.

పందిరికి ఒక వైపున వంటశాలను నిర్మించారు.  ఆవంట శాలలో ఒక మూలన అతను నుంచుని ఉన్నాడు.  పందిరిలోకి ప్రవేశించడానికి ఒకే ద్వారం ఉంది.  అది కూడా అవతలి వైపుకు ఉంది.  వంటశాలలోకి ప్రవేశించాలంటే పందిరికి అవతలి వైపున ఉన్న ద్వారంలోనుంచే రావాలి.  ఆవ్యక్తిని వంటశాలలో చూసినవారందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు.  ఆ మహాత్ముడు పందిరిలోకి ప్రవేశించి వంటశాలలోకి రావడం ఎవరికంటా పడలేదు.  ఆ మహాత్ముడు తాయి దగ్గరకు వచ్చి నేనున్నాను అని అభయమిస్తున్నట్లుగా ప్రేమతో ఆమెని ఆలింగనం చేసుకున్నాడు.  అ మహాత్ముడు మాటిమాటికీ అక్కడ ఉన్న సాయిబాబా ఫోటో వైపు చూపిస్తూ తాయితో ఇలా అన్నాడు.  “సాయిబాబా నేను ఇద్దరం ఒకరమే, భేదం లేదు.  బాధపడకు.  ఇకనుంచి నువ్వు సాయిబాబాతో మాట్లాడుతూ ఉండు.  నీభాధలను, భావాలను ఆయనకు విన్నవించుకో.”  ఆమాటలు వినగానే తాయికి ఎంతగానో ఉపశమనం కలిగింది,.  గుండెల్లో గూడు కట్టుకున్న విషాదమంతా క్షణంలో మాయమయిపోయింది.

శ్రీ జాదవ్ గారు ఆ మహాత్ముడిని సత్కరించి తన కృతజ్ణతలు తెలుపుకున్నారు.  ఆయనకి భోజనం పెట్టి అతిధి మర్యాదలు చేసారు.  కార్యక్రమం పూర్తయేంతవరకు తాను అక్కడే కుర్చీలో కూర్చుని ఉంటాను అని ఆ మహాత్ముడు జాదవ్ గారితో చెప్పారు.  కాని కొంతసేపటి తరువాత ఆ కుర్చీలో ఎవరూ లేరు.  అందరూ ఆశ్ఛర్యపోయారు.  ఆ మహాత్ముడు పందిరిలోనుండి వెళ్ళడం ఎవరూ చూడలేదు.  ఆయన వెళ్ళేటట్లయితే అందరి ముందునుంచే వెళ్ళి అవతలి వైపు ఉన్న ద్వారంలోనుండే బయటకు వెళ్ళాలి.  ఆయన ఎలా అదృశ్యమయ్యాడో ఎవ్వరికీ అంతుపట్టలేదు.

బహుశ భావు మహరాజ్ తన భక్తులకు “భౌతికంగా మహాత్ములందరూ వేరు వేరుగా కనిపించవచ్చు.  కాని వారందరిలోను నివసించేది ఒకే పరమాత్మ” అని జ్ణానబోధ చేయదలచుకుని ఉండవచ్చు.

తాను అశరీరంగా ఉన్నా ఇంకా తన భక్తుల యోగక్షేమాలను చూసుకుంటూ వారిని కాపాడుతూ ఉంటానని భయమిచ్చారు.

ఈ సందర్భంగా శ్రీ సాయిబాబా తన భక్తులకిచ్చిన మాటలని గుర్తు చేసుకుని వివరిస్తున్నాను.

“నామీద విశ్వాసముంచండి  నేను లేనని మీరు విచారించవద్ధు.  నేను భౌతికంగా లేకపోయినా నా ఎముకలు మాట్లాడతాయి.  నా సమాధినుండే మీకు సమాధానము లభిస్తుంది.  నాకు సర్వశ్యశరణాగతి చేసిన వారికి నా సమాధినుండే నేను బదులిస్తాను.  నన్ను శరణు జొచ్చిన వారి యోగక్షేమాలు నేను చూసుకుంటాను.  ఎల్లప్పుడూ నన్ను గుర్తుంచుకోండి.  మీకు సర్వశుభాలు చేకూరుతాయి”

                                                                   ---శ్రీ సాయి సత్ చరిత్ర


నా సద్గురు శ్రీ భావు మహరాజ్ గారి కుటుంబ సభ్యులు మరియు సాయిబాబా భక్తులకు కలిగిన కొన్ని సంఘటనలు, అనుభవాలు మీకందరికీ అందించినందుకు, నాకు ఇటివంటి అవకాశాన్ని ప్రసాదించిన శ్రీ సాయిబాబా దివ్య చరణాలకు హృదయపూర్వకంగా నా సాష్టాంగ దండప్రణామాలను అర్పించుకుంటున్నాను.

డా.క్షితిజ రాణే

(సమాప్తం)

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List