Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, May 11, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1996 (09)

0 comments Posted by tyagaraju on 5:00 PM


12.05.2012  శనివారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


సాయి.బా.ని.. డైరీ -  1996  (09)

18.10.1996

నిన్నరాత్రి శ్రీసాయి నా చిన్ననాటి స్కూల్ టీచర్ రూపములో దర్శనము ఇచ్చి నాలో దాగి ఉన్న తప్పులను చూపి నా చేతిమీద బెత్తముతో కొట్టి నాకు కనువిప్పు కలిగించినారు. ఆయన చెప్పిన మాటలు.

1) అనవసరముగా ఇతరుల విషయాలలో కలుగచేసుకోకుండ నీపని నీవు చేసుకొంటు యోగిలాగ జీవించుతు మంచి పేరు తెచ్చుకోవాలి.

2) తప్పులు చేయటము మానవ నైజముఆతప్పులను సరిదిద్దుకోవటము మాధవుని దయకు పాత్రుడు అవటమునీజీవితములో నీవు ఎన్ని తప్పులు చేయలేదు అలోచించుయింక ఆతప్పులు చేయనని మాట ఇచ్చినావే - నీమాట నిలబెట్టుకోఇకమీదట ఇతరులు చేస్తున్న తప్పులు గురించి ఆలోచించకునీవు నమ్ముకొన్న సాయి మార్గములో ప్రశాంతముగా ప్రయాణము కొనసాగించు


20.10.1996

నిన్నరాత్రి కలలో శ్రీసాయి ఒకఫకీరు రూపములో దర్శనము ఇచ్చి చెప్పిన మాటలు నాకు సంతోషాన్ని కలిగించినవిఆమాటలు.

1) ఎంత చెట్టుకు అంత గాలి అనే సామెత నీకు తెలుసు కదా - అదేవిధముగా నీకు ఉన్న గ్రహించే శక్తికి తగిన సందేశాలను ఇస్తున్నానువాటిని నీవు అర్ధము చేసుకొనగలుగుతున్నావుదానితో తృప్తి చెందు.

2) కాకి పిల్ల కాకికి ముద్దు అనే సామెత ఉన్నదే - మరి నాభక్తులు నాకు ముద్దు కాదా !

3) నీలో దాగి ఉన్న ఒక్కొక్క దుర్గుణాన్ని విసర్జించుతున్నావుఅదే నాకు కావలసినది.

4) నా యితర భక్తులను తక్కువ అంచనా వేయవద్దుఎవరి భక్తివారిదివారి భక్తిలోని విశిష్ఠత నాకు మాత్రమే తెలుసుఅందుచేత ఇతర సాయి భక్తులను నీవు విమర్శించవద్దు.

5) మత మార్పిడి అంటే నాకు ఇష్ఠము లేదుమత మార్పిడి చేసుకొన్నవారిని చూసి జాలి పడతాను వారు చేసిన తప్పు పనికిప్రతివారు తమ స్వధర్మాన్ని పాటించుతు ప్రశాంత జీవనము సాగించుతు భగవంతుని అనుగ్రహము పొందాలి

10.11.1996

నిన్నరాత్రి నిద్రకు ముందు శ్రీసాయి సత్ చరిత్రలోని గోపాలనారాయణ అంబేడ్ కర్ ఆత్మహత్య ప్రయత్నముపై శ్రీసాయి ఇచ్చిన సలహాలు, సూచనలపై ఆలోచించుతు నిద్రపోయినానుశ్రీసాయి "మానవ జీవితములో చేయని తప్పులకు శిక్ష అనుభవించుతున్నవారిని, సంసార బాధలు పడలేక ఆత్మ హత్యలు చేసుకొన్నవారిని, ఆత్మహత్య అనంతరము ఆకుటుంబములో తలెత్తిన నూతన సమస్యలను చూపించి" సమస్యల పరిష్కారానికి ఆత్మహత్య సమాధానముకాదు అని తెలియచేసినారు.  
16.11.1996

నిన్నరాత్రి నిద్రకుముందు మానవ జీవితములో "మరణము" అనే పరిస్థితిపై సలహాలను, సూచనలను ప్రసాదించమని శ్రీసాయిని వేడుకొన్నానుశ్రీసాయి శ్మసానములోని కాటికాపరి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు

1) శ్రీసాయి భక్తులు సత్ చరిత్రలోని మేఘశ్యామునిలాగ ఆదర్శముగా జీవించి జీవితగమ్యాన్ని చేరండి.

2) జీవిత ప్రయాణములో నీవు నీగమ్యానికి చేరిన తర్వాత నీవు వదలిన శరీరము ఏవిదహముగా పంచభూతాలలో కలుస్తుంది అనే ఆలోచన నీకు అనవసరముదిక్కులేని శవాలకు దహన సంస్కారాలు చేయించేది నేనే.  

3) నీవు జీవించినంతకాలము నీజీవితాన్ని గంగానదిలాగ పదిమందికి ఉపయోగపడనియమునా నదిలాగ భక్తితో భగవంతుని పాదాలను కడగని, అపుడు నీవు సరస్వతీ నదిలో (కింటికి కనిపించని నది) మోక్షాన్ని పొందగలవుఅటువంటి జీవితముగడపినవాని పార్ధివ శరీరము బూడిద అయిన తర్వాత ఆబూడిదను ఏనదిలో కలిపిన త్రివేణి సంగమము (గంగా - యమున - సరస్వతి) నీటిలో కలిపినదానికంటే ఎక్కువ పవిత్రత సంపాదించుకొంటుంది.  

 (ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 

Thursday, May 10, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1996 (08)

0 comments Posted by tyagaraju on 7:36 PM


11.05.2012  శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


సాయి.బా.ని.. డైరీ -  1996  (08)

02.10.1996

నిన్నరాత్రి కలలో ఒక గుడికి వెళ్ళినాను. ఆగుడి ఆవరణలో ఒక స్వామీజి భక్తులను ఉద్దేశించి ఉపన్యాసము ఇవ్వసాగినారువారి ఉపన్యాసములో ముఖ్య విషయాలు నన్ను ఆకర్షించినవి.



1)  ఆధ్యాత్మికపరమైన విషయాలు వినేటప్పుడు ప్రాపంచిక విషయాలు గురించి ఆలోచించరాదుఅట్లా ఆలోచించినవాడు తన్ను తాను మోసముచేసుకోవటమే.

2)  ఆధ్యాత్మిక విషయాలు చేప్పే గురువు తన శిష్యుడిని తో సమానముగా చూడాలి.

3)  భగవంతుని గొప్పతనాన్ని గుర్తించి భగవంతునికి సేవ చేస్తున్న క్రిమి, కీటకాదులు, జంతువుల చరిత్రను (శ్రీకాళహస్తీశ్వరుని చరిత్ర)

తెలిసిన మానవుడు మాత్రముఆధ్యాత్మికపరమైన విషయాలను తెలుసుండి కూడ సాధుస్వభావాన్ని అలవర్చుకోలేకపోతున్నన్నాడే.

04.10.1996

శ్రీసాయి ఒక ఫకీరు రూపములో దర్శనము ఇచ్చి నాధ్యాత్మిక రంగ ప్రయాణములోని తప్పుడునడకలను చూపించి, కనువిప్పు కలిగించారువారు చెప్పినమాటలు.

1) యితరులు నాసేవ చేసుకొని పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు అనే భావన, వారి సేవలోని దోషాలను చూడటము మానివేయిభక్తిలో ఇతరులతో పోల్చుకోవద్దుఎవరి భక్తి వారిదినీకు ఉన్న పరిధిలో నీవే నాసేవ చేసుకొని తృప్తిపొందు.    

15.10.1996

నిన్నరాత్రి శ్రీసాయి ఒక అజ్ఞాత వ్యక్త్రి రూపములో దర్శనము ఇచ్చి నాతో అన్నమాటలు నాలోని కొన్ని బలహీనతలను తొలగించినవిఆమాటలు::

1) నీకు ఇష్ఠములేని వ్యక్తులను జంతువులతో పోల్చి ఆజంతువులను అవమానపర్చకుఆజంతువులు నీపొలములో పనిచేస్తాయికొన్ని నీయింట పాలు ఇస్తాయిఅవి చనిపోయిన తర్వాత వాటి చర్మము నీచెప్పుల తయారీకి ఉపయోగపడతాయిమరి నీకు ఇష్ఠము లేని వ్యక్తి నీకు పనికిరాడుగా!  

2) భగవంతుని గుడిలో పూజలు, గుడి చుట్టు ప్రదక్షిణలు నీఆరోగ్యానికి మేలు చేస్తాయిఒకవేళ నీవు అనారోగ్యముతో ఉన్న సమయములో భగవన్ నామస్మరణ ఒక్కటే నీలో మానాసిక పరివర్తన కలిగించి నీఅనారోగ్యానికి మూలకారణము చూపించి నిన్ను వాటినుండి దూరముగా ఉంచుతుంది.

3) నీవు అధికారములో యున్నపుడు నీఅధికారదర్పముతో ఎవరి మనసు గెలవలేవు. యుక్తిగా ప్రేమతో నీతోటి ఉద్యోగులమనసు  గెలవగలవుఅదే విధముగా భగవంతుని అనుగ్రహము పొందాలి అంటే భక్తి,  ప్రేమలతో ఆయనను అనుక్షణము స్మరించుతు ఉండాలి.

(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 


సాయి.బా.ని.స. డైరీ - 1996 (07)

0 comments Posted by tyagaraju on 8:31 AM



10.05.2012  గురువారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
 
సాయి.బా.ని.. డైరీ -  1996  (07)
28.09.1996

శ్రీసాయి నిన్నరాత్రి నాపినతండ్రి శ్రీ యూ.పీ.సోమయాజులుగారి రూపములో దర్శనము ఇచ్చి నా ఆధ్యాత్మిక జీవిత పురోభివృధ్ధికి ఇచ్చిన సలహాలు, సూచనలు.

1) పిల్లవాడు అనారోగ్యముతో యుంటే తల్లి వాని ఆరోగ్యము కోసము ఉపవాసము, పత్యము చేస్తుంది.  అదేవిధముగా తన భక్తుల బాధలను తొలగించటానికి సద్గురువు ఆబాధలను స్వీకరించుతారు.  తన భక్తుల క్షేమము కోసము భగవంతునికి ప్రార్ధనలు చేస్తారు.  మనము అటువంటి సద్గురువును ఎన్నుకోవాలి.

2) మనము రోడ్డుమీద నడుస్తున్నపుడు మనకు తెలియకుండానే పేడలో కాలు వేస్తాము.  అలాగే జీవితములో మనకు తెలియకుండానే బంధుప్రీతి అనే పేడలో కాలు వేస్తాము. 

 యింటిలోనికి వచ్చేముందు రోడ్డుమీద అంటిన పేడను శుభ్రము చేసుకొన్నట్లే నీవు ఆధ్యాత్మిక రంగములో ప్రవేశించేముందు బంధుప్రీతిని వదలించుకోవాలి.   

3) శ్రీసాయి పేరుతో ఆధ్యాత్మిక రంగ ప్రవేశము మంచిదే.  ఆధ్యాత్మిక రంగములో శ్రీసాయి పేరిట ఎంతసేపు భజనలు చేసినాము అనేది ముఖ్యము కాదు.  

 శ్రీసాయి పేరుతో ఏవిధముగా జీవితాన్ని సాగించినాము అనేది ముఖ్యము. 
  

01.10.1996

నిన్నరాత్రి కలలో రెండు ఎడ్లు కట్టినబండిలో నాస్వగ్రామము బోడసకుర్రుకు బయలుదేరినాను.   

ప్రయాణములో బండివాడు నాకు ఇచ్చిన సలహాలునాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించినవి.
 
1) నీగత జీవితములోని సంఘటనలను గుర్తుచేసుకో.  నీజీవితము అనేకమంది నీబంధువుల జీవితముకంటే సుఖముగా గడచినది కదా - దానికి భగవంతునికి కృతజ్ఞతలు తెలియచేసుకో.

2) నీతండ్రి, వారి అన్నదమ్ముల జీవితాలనుండి నేర్చుకొన్న గుణపాఠాలను మర్చిపోకు.  వాటిని నీజీవిత అనుభవాలుగా తలచుకొని మంచి మార్గములో ప్రయాణము చేస్తు ప్రశాంత జీవితాన్ని సాగించు. 

3) జీవితములో స్నేహితులతో స్నేహ సంబంధాలు మంచివేకాని ఆస్నేహము చెడిపోవడానికి ఆస్నేహితుల మధ్య ఉన్న ఆర్ధిక వ్యత్యాస, ఆర్ధిక లావాదేవీలు ముఖ్య కారణాలు.  అందుచేత ఈసత్యాన్ని గ్రహించి స్నేహాన్ని కొనసాగించటము మేలు.

 (ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు

Wednesday, May 9, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1996 (06)

0 comments Posted by tyagaraju on 6:44 AM





09.05.2012  బుధవారము


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1996  6వ.భాగాన్ని చదువుకుందాము.


సాయి.బా.ని.స. డైరీ -  1996 (06) 





07.09.1996

శ్రీసాయి నిన్నరాత్రికలలో ఒక చిన్న స్కూల్ లోని టేచర్ రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) నాతత్వ ప్రచారములో భాగముగా నీవు పదిమంది సాయి భక్తులుతో కలసి సత్ సంగాలు నిర్వహించు, లేదా అనేక వందలమందిని ఉద్దేశించి నాతత్వాన్ని ఉపన్యాసము రూపములో వారికి అందచేయి. ఎవరైనా ప్రశ్నలు వేసినపుడు ఓరిమితో వారికి సమాధానము చెప్పు.

2) అజ్ఞానము అనే అడవిలో తిరుగుతున్న నావాళ్ళకు సాయితత్వ ప్రచార పుస్తకాలను ముద్రించి వారికి పంచిపెట్టు

3) సత్ సంగాల తర్వాత నీవు నాకు హారతి ఇచ్చి నైవేద్యము పెడుతున్నావే, నేను వాటిని క్రిమికీటకాదుల రూపములో స్వీకరించుతున్నాను
నాకు అర్పించిన ఆనైవేద్యమును ప్రసాదముగా నావాళ్ళకు పంచిపెట్టు. 



08.09.1996

నిన్నరాత్రి కలలో శ్రీసాయి శిరిడీలోని వేప చెట్టుక్రింద కూర్చుని తన దగ్గరకు వచ్చిన భక్తులను ఉద్దేశించి అన్నమాటలు.

1) 1918 నాటి సినీమాల ప్రభావము సమాజము శ్రేయస్సుకు ఉపయోగపడేలాగ ఉండేదికాని నేటి సినీమాల ప్రభావము సమాజము వినాశనానికి ఉపయోగపడేలాగ మారుతున్నది.  

2) 1918 నాటి తల్లితండ్రులు తమ పిల్లల భవిష్యత్ కోసము నమ్మకముతో దేవీదేవతలను పూజించేవారుకాని ఈనాడు తల్లితండ్రులు ధనసంపాదన కోసము దేవి దేవతలను పూజించుతు, పిల్లల భవిష్యత్ గురించి పట్టించుకోకపోవటము చాలా  విచారకరము.   

3) 1918నాటి డాక్టర్లు రోగులకు వైద్యము చేస్తు భగవంతుని సహాయము అర్ధించేవారుకాని, ఈనాడు వైద్యులు తమ వైద్యముతో రోగి ఆరోగ్యము పొందగలిగితే దానిని తమ ఘనతగా చెప్పుకొంటున్నారురోగి మరణించితే భగవంతుని దయలేదు అంటున్నారు.

13.09.1996

శ్రీసాయి నిన్నరాత్రి కలలో ఒక మందిరములోని పూజారి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) జీవితములోని కష్ఠాల వరదనుండి బయటపడి నీతల్లితండ్రుల ఆశీర్వచనములతో భగవంతుని గుడికి చేరుకొన్నావుకష్ఠాల వరదలో కొట్టుకొనిపోయి తమ ప్రాణాలను కోల్పోయినవారు అనేక మంది ఉన్నారునీవు చాలా అదృష్ఠవంతుడివిభగవంతుని గుడిమెట్లు పైకి ఎక్కగలగినావు.

*** 2) ఉద్యోగాలు లేక అనేకమంది బాధలుపడుతుంటే నీవు ఉద్యోగము మానివేస్తాను అంటావు ఎందుకుసరి అయిన సమయము రాగానే నేనే నీచేత ఉద్యోగము మానిపించి నాతత్వ ప్రచారానికి నిన్ను నియమిస్తానుఅంతవరకు ఉద్యోగము చేయి.

3) అడ్డదారులు త్రొక్కుతు ధనసంపాదన చేస్తున్న స్త్రీ, పురుషులనుండి దూరంగా జీవించు.

4) నీజీవితములో ఇంతవరకు పేరుకొనిపోయిన చెడు అనే మురికిని "సాయి" అనే పటికతో శుభ్రము చేసుకొని మంచిమార్గములో పయనించు.   

***శ్రీసాయి ఆదేశానుసారము శ్రీ సాయిబానిస రావాడ గోపాలరావుగారు తన ఉద్యోగమునుండి మార్చ్ 2000 సంవత్సరములో స్వచ్చంద పదవీ విరమణ చేసి శ్రీసాయి సేవకు అంకితమైనారు

27.09.1996

నిన్నరాత్రి శ్రీసాయి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) పరస్త్రీలను పొగడటము, నీపేరు ప్రఖ్యాతుల కోసము వారిని వాడుకోవడము మహాపాపము.

2) ఈజీవిత నాటక రంగములో నీవు ఒకనటుడివిఈవిషయాన్ని తెలుసుండికూడా నీవు స్వంతనాటకాలు ఆడుతు ఎవరిని మోసము చేయదలచినావు?

3) సంసారము అనే సముద్రములో కష్ఠాలు కలిగించే పాములు ఉన్నాయిమరియు ప్రశాంతతనిచ్చే ముత్యపు చిప్పలు ఉన్నాయినీవు భగవన్ నామము ఉచ్చరించుతు పాములకు దూరంగా యుంటు ఆముత్యపు చిప్పలులోని ముత్యాలను ఏరుకోవాలిజీవితాన్ని సార్ధకము చేసుకోవాలి

4) శ్రీసాయినాధుని బడిలో కడుపునిండ ఆధ్యాత్మిక విందు ఆరగించిన తర్వాత బయటకు వచ్చి చిరుతిళ్ళు తినడము ఎందుకు

 (ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 


Tuesday, May 8, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1996 (05)

0 comments Posted by tyagaraju on 7:09 AM





08.05.2012  మంగళవారము


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ -  1996 5వ.భాగాన్ని చదువుకుందాము


సాయి.బా.ని.స. డైరీ -  1996  (05) 



08.08.1996

నిన్నరాత్రి శ్రీసాయి ఫకీరు రూపములో దర్శనము ఇచ్చి అన్న మాటలు. 

"శ్రీ సాయి లీలా అమృతమును కొందరు త్రాగి జీర్ణించుకొని సుఖ శాంతులతో జీవించుతారు.  కొందరు ఆలీలామృతము సీసాను (శ్రీసాయి సత్ చరిత్ర) తమ యింట షోకేసులో పెట్టుకొని సంతోష పడతారు.  ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే లభించుతుంది.  అందుచేత ఎవరి చేత బలవంతముగా శ్రీసాయి లీలామృతము త్రాగించరాదు. 

20.08.1996

నిన్నరాత్రి కలలో శ్రీసాయి ఫకీరు రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు నాలో ఆలోచనలు రేకెత్తించినవి.  అవి

1) నా తత్వ ప్రచారములో నీమాటలు కొందరికి రుచించుతాయి.  కొందరికి కాలక్షేపము కలిగించుతాయి.  నీవు మాత్రము నేను ఇచ్చిన బాధ్యతను పూర్తిచేయి.

2) నాతో నీవు పొందిన అనుభవాలను నీపిల్లలు డైరీలో వ్రాసి నీకు బహుకరించుతారు.

3) నీవు తెల్లని వస్త్రాలను ధరించినావు.  కాని, నీవు యింకా యితరులను దూషించసాగటము వలన నీవస్త్రాలపై మరకలు పడుతున్నాయి.  ఆమరకలను శుభ్రము చేయడము కష్ఠము.  అందుచేత ఇతరులను దూషించటము మానివేయి.

4) నీవు వ్రాస్తున్న డైరీనుండి సాయి బంధువులు అనేక విషయాలు తెలుసుకొని సుఖ, శాంతులతో జీవించుతారు.


25.08.1996

నిన్నరాత్రి శ్రీసాయి నామాతా మహుని రూపములో దర్శన ము ఇచ్చి అన్నమాటలు.

"మనిషి చనిపోయి పునర్జన్మ ఎత్తటము సహజము.  ఆమనిషి బ్రతికి ఉన్నపుడు అతనికి పూజలు చేయడము గొప్పకాదుఅతని మరణానంతరము కూడ ఆతనిలోని గొప్పతనాన్ని గుర్తుంచుకొని పూజించటము నీఔన్నత్యానికి నిదర్శనముసంవత్సరానికి ఒకరోజున (ఆభ్ధికమునాడు) అతనిని పూజించుఅంతేగాని చేదుమాటలు మాత్రము అనవద్దు.

29.08.19996

నిన్నరాత్రి శ్రీసాయి సమాధి మందిరములో సత్ సంగము జరిగినదిఅక్కడ హాలులో ఒక సైకిల్ మీద పదిమంది ఎక్కినారు. కాని ఒక ముసలివాడు (శ్రీసాయి) మాత్రము ఆసైకిలును త్రొక్కసాగినాడుతెల్లవారిన తర్వాత దీనికి అర్ధము ఏమిటి అని ఆలోచించినానునాకు తోచినది.  "శ్రీసాయి సత్ సంగములలో సాయిమార్గమును చూపించువారు శ్రీసాయిఆమార్గములో ప్రయాణము చేయవలసినవారు శ్రీసాయి భక్తులు.    `

(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 


 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List