02.02.2023 గురువారమ్
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఓమ్ శ్రీ గణేశాయనమః
శ్రీ మాత్రేనమః
ఓమ్ శ్రీ సాయినాధాయనమః
శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర –13 వ.భాగమ్
ప్రేరణ ; గీతాచార్యుడు శ్రీ కృష్ణపరమాత్మ, మరియు సాయినాధులవారు
ప్రేరణా స్థలమ్ … శ్రీ వేణుగోపాలస్వామి
ఆలయమ్
సమన్వయ కర్త ; ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట్, హైదరాబాద్
ఫోన్. 9440375411
& 8143626744వ.
శ్రీమద్భగవద్గీత అధ్యాయమ్ – 6 శ్లోకమ్
- 29
సర్వభూతస్థమాత్మానమ్ సర్వభూతాని చాత్మని
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః
సర్వవ్యాపమైన అనంత చైతన్యమునందు ఏకీభావస్థితిరూప
యోగయుక్తమైన ఆత్మ కలవాడును, అంతటను అన్నింటిని సమభావముతో చూచువాడును అగు యోగి తన ఆత్మను
సర్వప్రాణులయందు స్థితమై యున్నట్లుగను, ప్రాణులన్నింటిని తన ఆత్మయందు కల్పితములుగను
భావించును. (చూచును)
(క్రింద ఇచ్చిన ఉదాహరణలను బట్టి బాబా ఒక యోగి అని కూడా మనం గ్రహించుకోవచ్చు)
శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్ – 13
బాబా అన్న మాటలు --- “నేనందరి హృదయములను పాలించువాడను. అందరి హృదయములలో నివసించువాడను. నేను ప్రపంచమందుగల చరాచర జీవకోటినావరించి యున్నాను. పురుగులు, చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి యంతయు
నా శరీరమే, నారూపమే.”