15.08.2016
సోమవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి
బోధనలు మరియు తత్వము
ఆంగ్లమూలం
: లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు
అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
(7)
మానవ జన్మ – (2వ.భాగమ్)
కొన్ని
సందర్భాలలో బాబా తన శక్తిని ఇంకా మానవాతీతమయిన శక్తిని ఉపయోగించి తన భక్తులు తిరిగి
ఆధ్యాత్మిక జీవనం సాగించేలా చేసేవారు.
శ్యామా
అనగా మాధవరావు దేశ్ పాండే బాబాతో చాలా సన్నిహితంగా
ఆయన వెంటే ఉండేవాడు. బాబాకు ప్రియ భక్తుడు.