Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, August 15, 2016

శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము - (7) మానవ జన్మ – (2వ.భాగమ్)

Posted by tyagaraju on 7:19 AM
Image result for images of sai
Image result for images of rose hd

15.08.2016 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము
       Image result for images of m b nimbalkar
ఆంగ్లమూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
(7) మానవ జన్మ – (2వ.భాగమ్)

కొన్ని సందర్భాలలో బాబా తన శక్తిని ఇంకా మానవాతీతమయిన శక్తిని ఉపయోగించి తన భక్తులు తిరిగి ఆధ్యాత్మిక జీవనం సాగించేలా చేసేవారు.
శ్యామా అనగా  మాధవరావు దేశ్ పాండే బాబాతో చాలా సన్నిహితంగా ఆయన వెంటే ఉండేవాడు.  బాబాకు ప్రియ భక్తుడు.  


              Image result for images of madhava rao des pandey

అందుచేత శ్యామాయొక్క ఆధ్యాత్మిక జీవనంలో అతని శ్రేయస్సుకోసం బాబా ఎంతగానో ఆసక్తి కనబరచేవారనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు.  27వ.అధ్యాయంలో సాయిబాబా, శ్యామాకు మేలు చేయదలచి అతని చేత సుప్రసిధ్ధమయిన విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని ఏవిధంగా పారాయణ చేయించదలచారో మనం గమనించవచ్చు.   సాయిబాబా రామదాసితో తనకు తీవ్రంగా కడుపు నొప్పిగా ఉందని అసత్యమాడి, బజారుకు వెళ్ళి సోనాముఖి తీసుకురమ్మని రామదాసిని బజారుకు పంపించారు.  రామదాసి బజారుకు వెళ్ళగానే బాబా రామదాసి పారాయణచేస్తున్న విష్ణుసహస్రనామ పుస్తకాన్ని శ్యామాకు అతనికిష్టం లేకపోయినా ఇచ్చారు.  రామదాసితో తనకు కయ్యం ఏర్పరచాలని బాబా ఈపని చేసారని శ్యామా భావించాడు.  కాని బాబా తన మెడలో విష్ణుసహస్రనామం అనబడే కంఠాభరణాన్ని తన మెడలో వేసి ప్రాపంచిక దుఃఖాలనుండి రక్షించి మేలు చేయబోతున్నారని గ్రహించుకోలేకపోయాడు.  భగవన్నామము యొక్క ఫలితం, ప్రభావం బాగా తెలుసున్నదే.  ఆనామస్మరణే మానవుని పాపాలనుండి, చెడు ధోరణులనుండి విముక్తుడిని చేసి జననమరణ చక్ర భ్రమణాలనుండి తప్పిస్తుంది.  భగవన్నామస్మరణకు మించిన సులభమయిన సాధన మరొకటి లేదు.
               Image result for images of balasaheb bhate
బాలా సాహెబ్ కి మరొక పేరే పురుషోత్తమ్ సఖారామ్ భాటే.  కళాశాలలో ఉన్నప్పుడే ఇతను స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు.  ఎప్పుడూ సిగరెట్లు కాలుస్తూ ఉండేవాడు.  ఇంకా చెప్పాలంటే శుధ్ధ నాస్తికుడు.  “తిను, త్రాగు, ఈరోజు ఆనందంగా జీవించు” ఇదే అతని గుణం.  అతను మామలతదారుగా మంచి సమర్ధుడయిన ఉన్నతాధికారిగా కలెక్టరు ఇతనిని బాగా అభిమానించేవాడు.  కోపర్ గావ్ కి మామలతదారుగా అయిదు సంవత్సరాలు (1904 – 1909) వరకూ పని చేసాడు.  విధ్యావంతులయిన అతని స్నేహితులు ఎవరయినా షిరిడీ యాత్రకు వెడుతుంటే వారిని హేళన చేసేవాడు.  సాయి మీద ఎటువంటి గౌరవం లేకుండా ఆయనొక పిచ్చివాడు అని ఎగతాళిగా మాట్లాడుతూ ఉండేవాడు.  అతని స్నేహితులు ఒక్కసారి సాయిబాబా దర్శనం చేసుకో అపుడు నీ అభిప్రాయం చెప్పు అనేవారు.  1909 వ.సంవత్సరంలో భాటే షిరిడీలో బస చేసినప్పుడు ప్రతిరోజు సాయిబాబాను దర్శించుకునేవాడు.  అయిదవరోజున సాయిబాబా అతనిని సన్యాసులు ధరించే ఎఱ్ఱటి వస్త్రంతో కప్పారు.  ఆరోజునుంచి భాటేలో మార్పు వచ్చింది.  అప్పటినుండి అతను మారిన మనిషి.  అతను తనకు వచ్చే ఆదాయాన్ని, తన ఉద్యోగాన్ని పట్టించుకోలేదు.  షిరిడీలోనే ఉండి ఆయన సేవ చేసుకుంటూ, చావయినా, బ్రతుకయినా ఆయన సమక్షంలోనే అని కోరుకున్నాడు.  ఒక సంవత్సరానికి సెలవు కావాలని అభ్యర్ధిస్తూ ఒక కాగితం వ్రాసి దానిమీద భాటే చేత సంతకం చేయించమని, సాయిబాబా అతని స్నేహితుడయిన దీక్షిత్ తో చెప్పారు.  భాటే ఒక సంవత్సరం తరువాత తిరిగి వస్తాడేమో చూద్దామనే ఉద్దేశ్యంతో, కలెక్టర్ సంవత్సరంపాటు సమయం ఇచ్చారు. కాని, సంవత్సరం తరువాత కూడా భాటే తన గురువు వద్దే పిచ్చివానిలా ఉండిపోయాడు.  అతనొక వేదాంతిగా మారిపోయినందున జాలిపడి నెలకు రూ.30/- పింఛను ఏర్పాటు చేశారు.

భాటే తన భార్యాపిల్లలతో షిరిడీలోనే నివాసం ఏర్పరచుకున్నాడు.  నిత్యకర్మలు చేసుకుంటూ సాయి ఎదుట ఉపనిషత్తులు చదువుతూ ఉండేవాడు.  (అప్పుడప్పుడు అతను చదివినదానిమీద బాబా వ్యాఖ్యానం చెప్పేవారు) సాయిబాబా మహాసమాధి చెందిన తరువాత ఆయన ఆఖరి సంస్కారాలు జరిపే మహద్భాగ్యం భాటేకు కలిగింది.  మరాఠీ మూలగ్రంధం శ్రీసాయిసత్ చరిత్రలో భాటేను ‘భక్తరత్న’ గా అభివర్ణించడంలో ఎంతమాత్రం ఆశ్చర్యం లేదు.
                    Image result for images of dasaganu
దాసగణు ఉరఫ్ గణేష్ దత్తాత్రేయ సహస్ర బుధ్ధే పోలీస్ శాఖలో పనిచేస్తూ ఉండేవాడు.  అతను మహారాష్ట్రలోని గ్రామాలలో జరిగే వీధినాటకాలకి అశ్లీలమయిన పాటలను (లావణి) రాస్తూ ఉండేవాడు. ఆడవారితో కలిసి ఆ పాటలు పాడుతూ సమయాన్ని గడిపేవాడు.   మొదట్లో దాసగణుకి సాయిబాబా మీద నమ్మకం లేదు.  1894 వ.సంవత్సరంలో తన విధినిర్వహణలో భాగంగా, అప్పట్లో అహమ్మద్ నగర్ కలెక్టర్ కి వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న నానా సాహెబ్ చందోర్కర్ తో వచ్చాడు.  కాని, సాయిబాబా మెల్లగా దాసగణును తనవైపుకు ఆకర్షించుకొన్నారు.  సాయిబాబా అతనిచేత బలవంతంగా పోలీసు ఉద్యోగం మాన్పించడమే కాకుండా, అతనికున్న దుర్గుణాలన్నిటినీ మాన్పించారు.  ఆతరువాత అతనిని జీవితంలో వేలమందిలో ఒక గౌరవనీయమయిన మహాపురుషునిగా మార్చివేసారు.

సాయిబాబా ప్రేరణతో, దాసగణు ఆధునిక మహాపురుషుల జీవిత చరిత్రలను మూడు సంపుటాలు రచించారు.  ఆతరువాత కూడా ఎన్నోపుస్తకాలను (మరాఠీభాషలో ఓవీల రూపంలో) వ్రాశారు.  అవన్నీకూడా ఆధ్యాత్మిక విషయాలమీద వ్రాసినవి.  వాటికి ఆయన సంత్ – కవి (కవి-సాధువు) అని నామకరణం చేసారు.  దాసగణు మంచి కీర్తనకారుడు కూడా.  తన కీర్తనలతో, మహారాష్ట్రలోని పశ్చిమ ప్రాంతాలలో ముఖ్యంగా బొంబాయిలో సాయిభక్తిని వ్యాపింపచేసిన ప్రముఖుడు.  ఒక పుణ్యదినాన 95 సంవత్సరాల వయసులో ఆయన 1962వ.సంవత్సరంలో దేహాన్ని చాలించారు.


(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 
( సాయి బంధువులకు మనవి : రేపు కృష్ణానది పుష్కరాలకి విజయవాడ   వెడున్నందువల్ల నాలుగు రోజులపాటు ప్రచురణ సాధ్యం కాదు.  అందువల్ల మరలా 21 వ.తేదీన ప్రచురిస్తాను.  సాధ్యమయితే విజయవాడనుండి ప్రచురిస్తాను.)


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List