21.08.2016
ఆదివారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయిబాబావారి బోధనలు
మరియు తత్వము
ఆంగ్లమూలం
: లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు
అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
7.
మానవ జన్మ – (3వ.భాగమ్)
సాకోరీలోని
ఉపాసనీ మహరాజ్ ఉరఫ్ కాశీనాధ్ గోవింద ఉపాసనీ, షిరిడీ రాకముందు ఆధ్యాత్మిక సాధన మరియు
యోగ సాధనలో ఎంతో మంచి ఉన్నత స్థితిని సాధించారు.
కాని, ఆయన చేసిన కొన్ని తప్పిదాలవల్ల ఆయనకు జబ్బు చేసి, దాని వల్ల ఆయన సాధనలోని ప్రగతి
ఆగిపోయింది. ఆయన షిరిడీ వచ్చి బాబాను దర్శించుకున్నపుడు,
బాబా ఆయనను తిరిగి వెళ్ళనివ్వలేదు. దానికి
బదులుగా ఆయన తన దివ్యశక్తితో ఉపాసనీ మహరాజ్ ను నాలుగు సంవత్సరాలపాటు ఖండోబా దేవాలయంలోనే ఉండిపోయేలా
చేశారు.
అక్కడ ఉపాసనీకి అనేక అనుభవాలు కలిగాయి. సాయిబాబా ఆయనను ఎంతో ఉన్నతమయిన ఆధ్యాత్మిక స్థాయికి
చేరుకోవడానికి మార్గం చూపారు. సాయిబాబా మహాసమాధి
చెందిన తరువాత, ఒక సమయంలో ఉపాసనీ పేరు ప్రఖ్యాతులు
గౌరవం ఎంతలా పెరిగాయంటే, ఆఖరికి మహాత్మా గాంధీగారు కూడా దేశక్షేమం కోసం ఆయన ఆశీర్వాదాలు
తీసుకుందామని ఉపాసనీ వద్దకు వచ్చారు. ఉపాసనీ
బొంబాయిలో ఉన్నపుడు ఆయన దర్శనం కోసం భక్తులు ఎంతగా వచ్చారంటే, అందరూ దర్శించుకునేటప్పటికి
పూర్తిగా ఒక పగలు, రాత్రి పట్టింది. సాకోరీలొ
ఉన్న ఉపాసనీ గారి కన్యాకుమారి ఆశ్రమం గురించి అందరికీ తెలిసినదే.
సాయిబాబా
తాను మహాసమాధి చెందిన తరువాత కూడా, ఆధ్యాత్మిక జీవనాన్ని ఆశించి చిట్టచివరిగా మోక్షాన్ని
పొందగోరేవారికి ఇప్పటికీ సహాయం చేస్తూనే ఉన్నారు.
దీనికి ఒక స్పష్టమయిన ఉదాహరణ, గుజరాత్ లో ప్రముఖుడయిన సాధువు శ్రీమోటాగారు. ఆయన 1976 లో దేహాన్ని చాలించారు. అప్పటికే శ్రీమోటాగారికి, మధ్యప్రదేశ్ లోని ధునివాలే
దాదా సంఖేడా గారి ద్వారా ఆధ్యాత్మికంగా మార్గదర్శకత్వం, అనుగ్రహం లభించింది. అయినప్పటికీ 1938 వ.సంవత్సరంలో (సాయిబాబా మహాసమాధి
చెందిన 20 సంవత్సరముల తరువాత) మోటాగారు కరాచీలో (ఇపుడు అది పాకిస్తాన్ లో ఉంది) ఉన్నపుడు
సాయిబాబా ఆయనకు ఎన్నోసార్లు కనిపించి, కొన్ని యోగాసనాలను నేర్పారు. త్వరలోనే ఆధ్యాత్మికంగా ముందుకు సాగేలా అతీంద్రియ
దర్శనాలను కూడా ఇచ్చారు. ఆఖరికి 1939, మార్చి,
29 రామనవమి రోజున కాశీలో మోటాగారికి సాయిబాబా అద్వైతం మీద అద్భుతమైన గొప్ప అనుభవాన్నిచ్చి,
ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించారు. ఆతరువాత
శ్రీమోటాగారు, “సాయిబాబా నా ఆధ్యాత్మిక ప్రగతికి తుది మెరుగులు దిద్దారని” గొప్పగా చెబుతూ ఉండేవారు. మోటాగారు సాయిబాబాను శ్లాఘిస్తూ మధురమయిన 17 పద్యాలను గుజరాతీ భాషలో రచించారు.
ఆవిధంగా
సాయిబాబా తాను జీవించి ఉన్నపుడు, ఆతరువాత కూడా, మానవ జన్మను సార్ధకం చేసుకొని, వచ్చిన
అవకాశం వదలుకోకుండా మోక్షాన్ని సాధించుకోమని తన భక్తులకు ఎప్పుడూ ఉపదేశిస్తూనే ఉన్నారు. తమ శక్తికి మించి శరీరాన్ని బాగా కష్టపెట్టి, ఉపవాసాలు
చేసి తమని తాము నిర్లక్ష్యం చేసుకోవద్దని కూడా సాయిబాబా తన భక్తులను ఇదే సందర్భంలో
హెచ్చరిస్తూ ఉండేవారు.
“దేహాన్ని
అశ్రధ్ధ చేయకూడదు అలాగని ముద్దుగా పెంచకూడదు.
తగిన జాగ్రత్త తీసుకొనవలెను. గుఱ్ఱపు
రౌతు తన గమ్యస్థానము చేరువరకు గుఱ్ఱమును ఎంత జాగ్రత్తగా చూచుకొనునో అంత జాగ్రత్త మాతమే
తీసుకొనవలెను”.
అధ్యాయము – 8
(రేపు
ఇంద్రియ సుఖాలు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment