Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, October 8, 2022

శ్రీ సాయి దయా సాగరమ్ 34 వ, భాగమ్

0 comments Posted by tyagaraju on 7:38 AM

 

08.10.2022  శనివారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ మాత్రే నమః


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి దయా సాగరమ్ 34 వ, భాగమ్

అధ్యాయమ్ – 32

మరాఠీ మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి

ఆంగ్లానువాదమ్ ---  శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి

తెలుగు అనువాదమ్ ---  ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

9440375411  & 8143626744

నా అహంకారం తొలగిపోయింది

(నీకు వి. ఐ. పి.  పాసు అవసరమా?)

బాబా నన్ను పరీక్షిద్దామనుకున్నారు.  ఆ అనుభవాన్ని ఇపుడు మీతో పంచుకుంటాను.  గత 40 సంవత్సరాలుగా నేను షిరిడీకి వెళ్ళివస్తూ ఉన్నాను.  అప్పట్లో బాబాను దర్శించుకోవడానికి క్యూలు ఉండేవి కాదు.  చాలా సులభంగా దర్శించునేవాళ్ళం. ఏ సమయంలోనయినా భక్తులు సమాధిమందిరానికి వెళ్ళి సాయి దర్శనం చేసుకునేవాళ్ళు.  కాని ప్రస్తుతం బాబాని దర్శించుకోవాలంటే పెద్ద  క్యూలో నుంచుని వెళ్ళాల్సివస్తోంది.  దర్శనం చాలా కష్టతరంగా మారింది.  

Friday, October 7, 2022

శ్రీ సాయి దయా సాగరమ్ 33 వ, భాగమ్

0 comments Posted by tyagaraju on 4:35 AM


07.10.2022  శుక్రవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ మాత్రే నమః 


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి దయా సాగరమ్ 33 వ, భాగమ్

అధ్యాయమ్ – 31

మరాఠీ మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి

ఆంగ్లానువాదమ్ ---  శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి

తెలుగు అనువాదమ్ ---  ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

9440375411  & 8143626744

బాబాని గుర్తించలేకపోయాను

మన దైనందిన జీవితంలో మనకు ఎన్నో చిన్న చిన్న విచిత్రాలు, లీలలు ఎదురవుతూ ఉంటాయి.  మనలో కొంతమంది తమకు ఎదురయిన అనుభవాలను ఇతరులతో పంచుకుంటారు.  మరికొంతమంది తమకు కలిగిన అనుభవాలను తమ మనసులోనే దాచుకుని క్రమంగా మర్చిపోతూ ఉంటారు.  నాకు కలిగిన ఒక అనుభవం నాకింకా గుర్తుంది.  ఒకరోజున నేను నా చిన్న కూతురిని స్కూటర్ మీదఎక్కించుకుని వెడుతున్నాను.  ఆవిధంగా స్కూటర్ నడుపుతూ ఉండగా నామదిలో ఒక ఆలోచన వచ్చింది.  

Thursday, October 6, 2022

శ్రీ సాయి దయా సాగరమ్ 32 వ, భాగమ్

0 comments Posted by tyagaraju on 4:34 AM

 



06.10.2022  గురువారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ మాత్రే నమః

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి దయా సాగరమ్ 32 వ, భాగమ్

అధ్యాయమ్ – 30

మరాఠీ మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి

ఆంగ్లానువాదమ్ ---  శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి

తెలుగు అనువాదమ్ ---  ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

9440375411  & 8143626744

శస్త్ర చికిత్సను నివారించిన బాబా

మా అబ్బాయికి 12 సం. వయసు.  వాడికి కిడ్నీలో సమస్య ఏర్పడింది.  వైద్య పరీక్షలో అది కిడ్నీ కాన్స ర్ గా బయట పడింది. అది  మాకు చాలా భయంకరమయిన వార్త.  కిడ్నీ బయాప్సీ కూడా చాలా కష్టతరంగా ఉంటుంది.  వైద్యుడు కెమోథెరపీ చేయాలని అన్నారు.  దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి.  భారతదేశంలోనే ప్రముఖమయిన AIIMS లో వైద్యం చేయిస్తున్నాము.  కాని ఎటువంటి ఫలితం కనిపించలేదు.

Wednesday, October 5, 2022

శ్రీ సాయి దయా సాగరమ్ 31 వ, భాగమ్

0 comments Posted by tyagaraju on 12:02 AM

 



05.10.2022  మంగళవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ మాత్రే నమః


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

విజయదశమి  శుభాకాంక్షలు

శ్రీ సాయి దయా సాగరమ్ 31 వ, భాగమ్

అధ్యాయమ్ – 29

మరాఠీ మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి

ఆంగ్లానువాదమ్ ---  శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి

తెలుగు అనువాదమ్ ---  ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

పాదయాత్రలో జరిగిన అధ్భుతమ్

నాపేరు సాయిప్రసాద్ సవర్దేకర్.  నేను పార్లే (పశ్చిమ) లో నివసిస్తున్నాను.  చాలా సంవత్సరాలుగా నేను పార్లే తూర్పులో ఉన్న సాయిమందిరంలో సాయిసేవ చేస్తూ ఉన్నాను.  పార్లేలో ఉన్న సాయిభకులమయిన మేమంతా ఒక బృదంగా ఏర్పడి సాయిసేవక్ మండలి దాదర్ తూర్పు నుండి ప్రతిసంవత్సరం రామనవమికి పాదయాత్రగా షిరిడీ వెడుతూ ఉంటాము.  ఆ విధంగా మా పాదయాత్ర ఎనిమిదవ రోజుకి చేరుకుంది.  ఆరోజున మా వద్ద ఉన్న త్రాగడానికి తెచ్చుకున్న నీళ్ళు చుక్క లేకుండా అయిపోయాయి.  

Tuesday, October 4, 2022

శ్రీ సాయి దయా సాగరమ్ 30 వ, భాగమ్

0 comments Posted by tyagaraju on 7:40 AM

 



04.10.2022  మంగళవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ మాత్రే నమః

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

దసరా శుభాకాంక్షలు

శ్రీ సాయి దయా సాగరమ్ 30 వ, భాగమ్

అధ్యాయమ్ – 28

మరాఠీ మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి

ఆంగ్లానువాదమ్ ---  శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి

తెలుగు అనువాదమ్ ---  ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

ఫోన్. 9440375411 & 8143626744

ప్రాణభిక్ష పెట్టిన బాబా

నేను విలే పార్లేలో ఉన్న సాయి మందిరంలో ముఫై సంవత్సరాలనుండి మానేజర్ గా పనిచేస్తున్నాను.  మందిరంలో ఉన్న వివాహాలు జరిగే హాలును, ఇంకా మరికొన్ని వ్యవహారాలను పర్యవేక్షిస్తూ ఉంటాను.  30 సంవత్సరాలుగా సాయిసేవలోనే ఉన్నాను.  క్రీందటి సంవత్సరం నేను, నాభార్య నేహ, మా ఇద్దరమ్మాయిలు నమ్రత, తన్విలతో షిరిడీ వెళ్ళాము.

Monday, October 3, 2022

శ్రీ సాయి దయా సాగరమ్ 29 & 30 భాగాలు

0 comments Posted by tyagaraju on 4:43 AM

 




03.10.2022  సోమవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ మాత్రే నమః


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి దయా సాగరమ్ 29వ, భాగమ్

అధ్యాయమ్ – 27

మరాఠీ మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి

ఆంగ్లానువాదమ్ ---  శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి

తెలుగు అనువాదమ్ ---  ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

9440375411  & 8143626744

పునర్జన్మను ప్రసాదించిన సాయి

నేను, నా భర్త ఇద్దరం పట్టయ్య, సింగపూర్ విహార యాత్రకు వెడదామనుకున్నాము.  జనవరి 2007 వ.సం.లో మేము అనుకున్న ప్రకారంగా తెల్లవారుఝాము 4 గంటలకు విమానం ఎక్కాము.  ఉదయం 8 గంటలకు పట్టయ చేరుకున్నాము.  ఉదయం చాలా తొందరగానే లేచి విమాన ప్రయాణం చేయడం వల్ల మేము నిద్రపోలేకపోయాము.  పట్టయాలో బీచికి బస్సులో బయలుదేరాము.  అక్కడ పారాగ్లైడింగ్ చేయడానికి కొన్ని బృందాలుగా ఉన్నాము.  

Sunday, October 2, 2022

శ్రీ సాయి దయా సాగరమ్ 27 & 28 భాగాలు

0 comments Posted by tyagaraju on 5:05 AM

 



02.10.2022  ఆదివారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ మాత్రే నమః

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి దయా సాగరమ్ 27 వ, భాగమ్

అధ్యాయమ్ – 25

మరాఠీ మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి

ఆంగ్లానువాదమ్ ---  శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి

తెలుగు అనువాదమ్ ---  ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

9440375411  & 8143626744

ప్రమాదంనుండి కాపాడిన బాబా

సోమవారమ్, జనవరి 25, 2021  గం.9.30  రాత్రి

గత 25 సంవత్సరాలుగా నేను ప్రతిరోజు సాయి మందిరానికి వెళ్ళి సాయిసేవ చేస్తూ ఉండేవాడిని.  కాని రెండు సంవత్సరాల క్రితం మా కుటుంబంతో సహా పార్లే నుండి దహసిర్ కి వచ్చేసాము.  అయినప్పటికీ ప్రతిరోజూ పార్లేకి వెళ్ళి సాయిసేవను కొనసాగిస్తూ ఉన్నాను.  ఒకసారి నేను అంధేరీ నుండి దెహసిర్ కి లోకల్ రైలులో వెడుతున్నాను.  

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List