06.10.2022 గురువారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ
మాత్రే నమః
శ్రీ
సాయి దయా సాగరమ్ 32 వ, భాగమ్
అధ్యాయమ్
– 30
మరాఠీ
మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్
--- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
తెలుగు
అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట,
హైదరాబాద్
9440375411 & 8143626744
శస్త్ర చికిత్సను నివారించిన బాబా
మా
అబ్బాయికి 12 సం. వయసు. వాడికి కిడ్నీలో సమస్య
ఏర్పడింది. వైద్య పరీక్షలో అది కిడ్నీ కాన్స
ర్ గా బయట పడింది. అది మాకు చాలా భయంకరమయిన
వార్త. కిడ్నీ బయాప్సీ కూడా చాలా కష్టతరంగా
ఉంటుంది. వైద్యుడు కెమోథెరపీ చేయాలని అన్నారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. భారతదేశంలోనే ప్రముఖమయిన AIIMS లో వైద్యం చేయిస్తున్నాము. కాని ఎటువంటి ఫలితం కనిపించలేదు.
మరింత
మెరుగయిన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకు వెళ్ళాము. కాని అబ్బాయి పరిస్థితి రోజురోజుకు దిగజారుతూ వస్తోంది. వైద్యం కొనసాగించడానికి వెల్లూరు కూడా వెళ్ళాము. రాం దేవ్ బాబాగారి ఆయుర్వేద మందులు కూడా వాడాము,
కాని ఎన్ని వైద్యాలు చేయించినా రకరకాల మందులు వాడినా అన్నీ నిష్ఫలమయ్యాయి. కిడ్నీ సరిగా పనిచేయకపోవడంతో శరీరమంతా నీరు పట్టేసి
వాచిపోయింది. ఒక కన్నుకు కూడా దుష్ప్రభావం వల్ల కాటరాక్ట్ వచ్చింది. రోజురోజుకు ఆరోగ్యం క్షీణించసాగింది. చివరికి వైద్యుడు కిడ్నీ ఆపరేషన్ చేయడనికి నిర్ణయించారు. మేము సాయినే నమ్ముకున్నసాయి భక్తులం. మేమెంతో ఆర్తితో ,మా హృదయాంతరాళలోనుండి మా అబ్బాయి
ఆరోగ్యం కోసం బాబాని వేడుకోసాగాము.
శస్త్రచిత్స జరిగే రోజు. వైద్యుడు మా అబ్బాయిని ఆపరేషన్ ధియేటర్ లోకి తీసుకువెళ్ళి బల్ల మీద పడుకోబెట్టారు. ఇక వైద్యుడు శస్త్రచికిత్స మొదలు పెట్టడానికి సిధ్ధంగా ఉన్నాడు. ఇంతలో ఒక వృధ్ధుడు కనిపించి బల్ల మీద ఉన్న శరీరాన్ని తాకద్దు అని వైద్యుడితో అన్నాడు. ఆ మాట విన్న వైద్యుడు కంగారు పడ్డాడు. మరలా శస్త్ర చికిత్స మొదలుపెట్టడానికిప్రయత్నించాడు. మరలా ఆవృధ్ధుడు వైద్యునితో శరీరాన్ని తాకద్దు అని గట్టిగా అరిచాడు.
వైద్యుడు ఆపరేషన్ ధియేటర్ నుండి బయటకు వచ్చి ఒక
వృధ్ధుడు తనను ఆపరేషన్ చేయడానికి వీలులేదని అడ్డుకుంటున్నాడనీ ఆయన ఎవరని అడిగాడు. ఆస్పత్రిలో మాతోపాటు ఏవృధ్ధుడు లేడు. అపుడు మాకు అర్ధమయింది. ఆవృధ్ధుడు సాయిబాబా తప్ప మరెవరూ కాదనే విషయం. వైద్యుడు ఎటువంటి శస్త్ర చికిత్స చేయకుండా మా అబ్బాయిని
బయటకు తీసుకువచ్చాడు. వైద్యుడు కొన్ని మందులనిచ్చి
వాటిని వాడమన్నాడు. ఒక సంవత్సరం గడిచేటప్పటికి
మా అబ్బాయి మెల్లమెల్లగా కోలుకున్నాడు. మంచి
ఆరోగ్యం చేకూరింది. ఇపుడు మా అబ్బాయి ఆరొగ్యవంతుడయ్యాడు. ఇపుడు 7వ. తరగతి చదువుతున్నాడు. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు. సాయిబాబా మాత్రమే మా అబ్బాయిని రక్షంచారని మేము ఘంటాధంగా
చెబుతున్నాము.
సోహం
ముఖర్జీ
9836987448
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment