05.10.2022 మంగళవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
విజయదశమి శుభాకాంక్షలు
శ్రీ
సాయి దయా సాగరమ్ 31 వ, భాగమ్
అధ్యాయమ్ – 29
మరాఠీ
మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్
--- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
తెలుగు
అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట,
హైదరాబాద్
పాదయాత్రలో
జరిగిన అధ్భుతమ్
నాపేరు సాయిప్రసాద్ సవర్దేకర్. నేను పార్లే (పశ్చిమ) లో నివసిస్తున్నాను. చాలా సంవత్సరాలుగా నేను పార్లే తూర్పులో ఉన్న సాయిమందిరంలో సాయిసేవ చేస్తూ ఉన్నాను. పార్లేలో ఉన్న సాయిభకులమయిన మేమంతా ఒక బృదంగా ఏర్పడి సాయిసేవక్ మండలి దాదర్ తూర్పు నుండి ప్రతిసంవత్సరం రామనవమికి పాదయాత్రగా షిరిడీ వెడుతూ ఉంటాము. ఆ విధంగా మా పాదయాత్ర ఎనిమిదవ రోజుకి చేరుకుంది. ఆరోజున మా వద్ద ఉన్న త్రాగడానికి తెచ్చుకున్న నీళ్ళు చుక్క లేకుండా అయిపోయాయి.
మేము అపుడు ఒక చిన్న గ్రామమయిన పోహెగావ్ దగ్గరకు చేరుకున్నాము. అక్కడికి లోఖన్ డే అనే అతను మావద్దకు వచ్చి సాయిబాబా
తనను మాదగ్గరకు పంపించారనీ, మాకందరికీ అతని పొలంలో మాకు స్నానాలకు ఏర్పాట్లు, భోజన
ఏర్పాట్లు చేయమన్నారని చెప్పాడు.
మాకందరికీ
అప్పటికే చాలా దాహంగా ఉండటం వల్ల అతని పొలం దగ్గరకు వెళ్లాము.
అతని
పొలంలో ఒక బోరుబావి ఉంది. ఆరోజు వరకూ అది నీళ్ళు
లేక ఎండిపోయి ఉంది.
ఉదయం
లోఖన్ డె బాబా ఊదీని ఆ ఎండిపోయిన బోరుబావిలో వేశాడట. అప్పుడె అధ్బుతం జరిగింది. బోరుబావి నీటితో నిండింది. మేము లోఖండే పొలంలోనే స్నానాలు కానిచ్చి భోజనాలు
చేసాము. మా సాయి భక్తులందరికీ సేవ చేసుకున్నందుకు
అతను ఎంతగానో ఆనందించాడు. ఆతరువాత మేము షిరిడికి
పాదయాత్ర కొనసాగించాము. అక్కడినుంచి బయలుదేరే
సమయంలో బాబా తన భక్తులయెడల కురిపించిన దయకు ఆయన అనుగ్రహాన్ని అనుభవించిన మాకు కళ్ళంబట
ఆనంద భాష్పాలు కారాయి.
సాయిప్రసాద్
సవెర్దేకర్
(రేపటి సంచికలో శస్త్రచికిత్సను నివారించిన బాబా)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment