24.12.2014 బుధవారం
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈరోజు సాయిలీల ద్వైమాసపత్రిక మే-జూన్, 2008 సం.సంచికలోని బాబా లీల మరొకటి తెలుసుకొందాము.
శ్రీ కె.వెంకటకృష్ణయ్య, బి.ఎ. (ఆనర్స్) బి.ఎల్,
అడ్వొకేట్, 1-9-18/4/1/1, మార్కెట్ లేన్, రాం నగర్, హైదరాబాద్ -500 020.
వయసు నిర్ధారణ (ఏజ్ ప్రూఫ్)
రోజూ రాత్రయేటప్పటికి నేను జ్వరంతో బాధపడుతూ ఉండేవాడిని. అప్పుడు మా అమ్మాయి శిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకోమని చెప్పడంతో, మేము సికందరాబాద్ స్టేషన్ నుంచి మన్మాడ్ ఎక్స్ ప్రెస్ లో రాత్రి బయలుదేరాము. నాగర్ సోల్ స్టేషన్ సమీపిస్తూ ఉండగా, రైలు సిగ్నల్ కోసం ఆగింది.
నేను 40 రోజుల సాయిబాబా దీక్షా వ్రతంలో ఉడటం వల్ల ఆకుపచ్చని దుస్తులు ధరించాను. అప్పుడే మేమున్న స్లీపర్ కోచ్ లోకి సివిల్ డ్రస్ లో ఉన్న ఒక వ్యక్తి వచ్చి నా బెర్తు నంబరు, నాపేరు అడిగాడు. నాబెర్తు దగ్గరకు వచ్చి నా రిజర్వేషన్ టికెట్ చూపించమన్నాడు. ఆవచ్చిన వ్యక్తి ఎవరా అని నేను చాలా ఆశ్చర్యపోయాను. టికెట్ లో సీనియర్ సిటిజన్ కన్సెషన్ అని చూసి నావయసుని గురించి ఋజువు చూపించమని అధికార దర్పంతో అడిగాడు. ఆస్వరానికి నాకు ఆశ్చర్యం వేసింది. వెంటనె నేను నాపాస్ పోర్ట్ చూపించాను. అది చూసి అతను పళ్ళికిలించి నవ్వి వెళ్ళిపోయాడు. ఆవచ్చినతను ఎవరయి ఉంటారో తెలుసుకుందామనే ఆలోచన తట్టి వెంటనే అతను వెళ్ళినవైపుకు నడచుకుంటూ వెళ్ళాను. కాని అతనెక్కడా కనపడలేదు. అతను గాలిలో మాయమయినట్లుగా అనిపించింది నాకు. నేను ప్రక్కనే ఉన్న ప్రయాణీకులవైపు వెళ్ళాను. కాని బోగీలో అందరూ నిద్రలోఉన్నారు. టికెట్లు తనిఖీ చేస్తున్నట్లుగా ఎటువంటి వ్యక్తీ నాకు కనపడలేదు. ఆ వచ్చిన వ్యక్తి షిరిడీ సాయిబాబా తప్ప మరెవరూ కాదని నాకర్ధమయింది. శ్రీసాయినాబాతో నాకు కలిగిన మొట్టమొదటి అనుభూతి, మరచిపోలేనిది.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)