18.02.2021 గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస
గ్రంధము – 46 వ.భాగమ్
(పరిశోధనావ్యాస రచయిత… శ్రీ ఆంటోనియో
రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ – కోపర్ గావ్ – షిరిడీ
సోమవారమ్ – అక్టోబరు, 21, 1985
షిరిడీలో హోమీబాబా ఆశ్రమం వద్ద సాయంత్రం గం.5.30
పార్శీ మహాత్ముడయిన హోమీబాబాను దర్శించుకున్న తరువాత నాకు కలిగిన అభిప్రాయాలు -
ఆయనను
దర్శించుకున్న
వెంటనే ఈ వ్యాఖ్యలను వ్రాసుకున్నాను.
ఎంతోమంది భక్తులు తన చుట్టూ
గుమిగూడి ఉన్న సమయంలో హోమీబాబా సాయిబాబా పటం ముందు మంత్రం గాని ప్రార్ధన గాని చేస్తుండటం చూసాను.
ఆయన
చుట్టూ ఉన్న భక్తులలో చాలామంది పార్శీవారే.
హోమీబాబా మెహర్ బాబా శిష్యుడయి ఉండవచ్చని లేక ఆయన గతంలో ఆయనను కలుసుకుని ఉండవచ్చని నా దుబాసీ స్వామి శేఖరరావు చెప్పాడు.
ఆ
తరువాత ఈ విషయాన్ని హోమీబాబా ఖండించారు.
సాయిబాబాలాగే వేషధారణ చేసుకుని ఇప్పటికీ గత పదకొండు సంవత్సరాలుగా హోమీబాబా షిరిడిలోనె ఉంటున్నారు.