16.02.2019 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
మన బ్లాగులో ప్రచురించి చాలా రోజులయింది. ప్రచురించడానికి, సాయి భక్తుల మనస్సులను అధికంగా ప్రభావితం చేసే బాబా లీలలను ప్రచురిద్దామనే వెదకుతూ ఉన్నాను.
ఇంతకుముందు
ఒక బ్లాగులోనివి ప్రచురిస్తూ వచ్చాను.
అందులోనివి
అనువాదం చేసి ప్రచురిద్దామంటే అకస్మాత్తుగా ఆ సైట్ ఓపెన్ కాకుండా ఎఱర్ మెసేజ్ వస్తూ ఉండటం వల్ల ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది.
ఇక
ఏమి ప్రచురిద్దామనే ఆలోచనలో ఉండగా లోరైన్ వాల్ష్ గారి “YOU BRING US JOY MERE KHWAJA, FRIENDSHIPS
WITH GOD” పుస్తకాన్ని
అనువాదం చేస్తే బాగుంటుందనిపించింది. ఆవిడ
ఆస్ట్రేలియాలో ఉంటారు.
ఆవిడకు
బాబా ఇచ్చిన సందేశాలు ఆవిడ అనుభవాలు అన్నీ ఒక డైరీగా వ్రాసి ప్రచురించిన పుస్తకమ్.
ఆవిడకు
మైల్ ఇచ్చి అనువాదమ్ చేయడానికి అనుమతి తీసుకుందామనే ఉద్దేశ్యంతో ముందుగా సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావుగారిని సంప్రదించాను. అనువాదం చేసి బ్లాగులో ప్రచురించమని ఆయన
వెంటనే నాకు అనుమతినిచ్చారు. కాని
ఒక్క షరతు పెట్టారు. పుస్తకం
మొత్తం అనువాదం చేయకుండా కొన్ని కొన్ని మాత్రమే ప్రచురించమన్నారు. అందులో
ఉన్న భక్తుల అనుభవాలను కూడా ప్రచురించడానికి అనుమతినిచ్చారు. వారికి
నా ధన్యవాదములను తెలుపుకొంటున్నాను. ఇంతకు ముందు ఆయనకు బాబా గారు ఇచ్చిన సందేశాలను ఆయన డైరీ నుంచి సంగ్రహించి మన బ్లాగులో సాయిబానిస డైరీగా ప్రచురించాను.