Saturday, March 31, 2012
సాయి.బా.ని.స. డైరీ - 1995 (18)
సాయి.బా.ని.స. డైరీ - 1995 (18)
31.03.2012 శనివారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు, శ్రీరామనవమి శుభాకాంక్షలు
ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1995 18 వ.భాగాన్ని చదువుకుందాము.
10.07.1995
నిన్నరాత్రి నిద్రకుముందు శ్రీసాయికి నమస్కరించి జీవితములో కలిగే ఋణానుబంధములు గురించి చెప్పమని వేడుకొన్నాను. శ్రీసాయి కలలో చూపిన దృశ్యాల సారాంశము. ఋణానుబంధము అనేది భార్యా పిల్లల వరకే పరిమితము కాదు. జీవితములో అనేక సంఘటనలు ఋణానుబంధము వలన జరుగుతూ ఉంటాయి. ఉదాహరణగా రైలు ప్రయాణములో కొద్దిసేపు స్నేహముతో తోటి ప్రయాణీకులతో కలసి భోజనాలు చేయటము.
ఉద్యోగములో అధికార్లు అనధికార్లతో కలసి మెలసి యుండటము. కులమతాలకు అతీతముగా ఒకరికి ఒకరు సహాయము చేసుకోవటము. యివి అన్నీ ఋణానుబంధము వలనే జరుగుతూ ఉంటాయి. అందుచేత నీదగ్గరకు ఎవరైన వచ్చిన వారితో ప్రేమగా మాట్లాడు. నీయింటికి ఏజంతువు వచ్చినా దానికి ఆహారము పెట్టి ఋణానుబంధము తీర్చుకో.
12.07.1995
నిన్నరాత్రి నిద్రకుముందు శ్రీసాయికి నమస్కరించి ఆధ్యాత్మిక సందేశము ప్రసాదించమని వేడుకొన్నాను. శ్రీసాయి నా చిన్ననాటి స్కూల్ మాస్టర్ గారి రూపములో దర్శనము యిచ్చి చెప్పిన మాటలు.
1) నా సత్ చరిత్ర నిత్యము పారాయణ చేస్తూ నాజీవిత కధలను తోటి సాయి బంధువులుకు చెబుతూ మీజీవితాలను సార్ధకము చేసుకోండి.
2) నీవిద్యాదాతకు, అన్నదాతకు కడుపునిండ భోజనము పెట్టిననాడు ఆభోజనము నాకే చెందుతుంది అని గ్రహించు. (నాకు విద్యా దానము అన్నదానము చేసినవారు శ్రీ ఉపాధ్యాయుల పెరేశ్వరస్వామి సోమయాజులు గారు (కాకినాడ) )
3) జీవితములో పనిపాటలు చేయకుండ, సన్యాసిలాగ వేషము వేసుకొని నీతులు చెప్పేవాడికన్న, తనపనిలో భగవంతుని చూసుకొంటు కష్ఠపడి పని చేసుకొనే కూలివాడు నాకు ప్రీతిపాత్రుడు.
4) నేను ధరించిన పాదుకలు కోసము వెతుకుతున్నారు నాభక్తులు.
వాళ్ళకు చెప్పు, వాళ్ళు ధరించే పాద రక్షలు నేనే అని.
(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
Friday, March 30, 2012
సా.యి.బా.ని.స డైరీ - 1995
సా.యి.బా.ని.స డైరీ - 1995 (17)
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ 1995 17 వ. భాగాన్ని చదువుకుందాము.
నిన్నరాత్రి శ్రీసాయికి నమస్కరించి నాలోని ధన వ్యామోహమును తొలగించుమని వేడుకొన్నాను. శ్రీ సాయి కలలో ఒక తోపుడు బండిమీద కూరగాయలు అమ్మే వ్యాపారస్థుని రూపములో దర్శనము యిచ్చి అన్న మాటలు "ఈ పెద్ద అపార్ట్ మెంట్స్ లో మీకు చెందినది నాలుగు గదులు మాత్రమే. యింత పెద్ద మేడను చూసి మీరు ఈభవనము అంతా నాది అని తలచటము అవివేకము. అదే విధముగా ఈప్రపంచములో ఉన్న ధనములో మీదగ్గర ఉన్న ధనము ఎన్నవ వంతు. బాగా ఆలోచించి ధన వ్యామోహము వదులుకోండి" ఈ మాటలకు తెలివి వచ్చినది.
23.06.1995
నిన్నటి రాత్రి శ్రీసాయికి నమస్కరించి నాలోని అహంకారాన్ని తొలగించుకొనే మార్గమును చూపించమని వేడుకొన్నాను. శ్రీసాయి నాకు ప్రసాదించిన కల వివరాలు. "నేను పట్టు వస్త్రాలు, విభూతి పట్టీలు పెట్టుకొని నాపినతండ్రి యింటికి వెళ్ళినాను.
ఆసమయములో ఆయన టీ.వీ. లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ నన్ను పలకరించలేదు.
గొప్ప సాయిభక్తుడిగా నాకు పేరు ఉంది అనే అహంకారము నాలో ఉంది. నాపిన తండ్రి నన్ను పలకరించలేదు అనే భావన నాలో నాపినతండ్రిపై దేషాన్ని కలిగించినది. ఆద్వేష భావముతో ఆయనతో దెబ్బలాటకు దిగినాను. ఈపరిస్థితిలో నిద్రనుండి మెలుకువ వచ్చినది. ఒకసారి ఆలోచించినాను. నాలో అహంకారము లేనినాడు నేనే ముందుగా నాపిన తండ్రిని పలకరించి యుండేవాడిని కదా. నా అహంకారము నాలో ద్వేషాన్ని రేకెత్తించి తండ్రితో సమానమైన పినతండ్రితో దెబ్బలాటకు ఆస్కారము కలిగించినది కదా. అహంకారము అన్ని అనర్ధాలకు మూలము అని గ్రహించినాను.
06.07.1995
నిన్నటిరోజు గురుపూర్ణిమ - నిన్నటి రాత్రి శ్రీసాయికి నమస్కరించి గురుపూర్ణిమ గురించి వివరించమని కోరినాను. శ్రీసాయి ఒక బౌధ్ధ భిక్షువు రూపములో (శ్రీలంక దేశము బౌధ్ధ భిక్షువు) దర్శనము యిచ్చి చెప్పిన మాటలు.
1) గురుపూర్ణిమనాడు నీవు నీగురువును పూజించు. నీమాట మీద నమ్మకము ఉన్నవారికి నీగురువుని వారికి పరిచయము చేసి వారికి కూడా గురుపూజ చేసుకొనే భాగ్యము కలిగించు. ఎవరో నీగురువును తూలనాడినారు అనే బాధను నీమనసునుండి తొలగించు.
2) యితర మతాలను నీవు దూషించవద్దు. యితరులు నీమతము గురించి చులకనగా మట్లాడుతుంటే నీవు ఆమాటలు వినవద్దు.
07.07.1995
నిన్న రాత్రి నిద్రకు ముందు శ్రీసాయికి నమస్కరించి మనసుకు కష్ఠము కలిగించేవారి నుండి దూరముగా యుండగలిగే మార్గము చూపు తండ్రి అని వేదుకొన్నాను. శ్రీసాయి కలలో చూపిన దృశ్యాల సారాశము. "నీవు యితరులనుండి ఏదైన ఆశించినపుడు నీవు ఆశించినది నీకు లభించనపుడు నీమనసుకు కష్ఠము కలుగుతుంది. అందుచేత నీవు యితరులనుండి ఏమీ ఆశించకు. నీస్వశక్తిమీద నీవు జీవించటము నేర్చుకో." గ్రామాలలోని చెఱువులు ఎండకు ఎండిపోయినపుడు ఆగ్రామములోని ప్రజలు, జంతువులు నీటికోసము నదులవైపుకు సాగిపోతారు.
అలాగే నీమనసు చికాకులు అనే ఎండవేడికి ఎండిపోయినపుడు సాయిసాగరము వైపు సాగిపో. సాయిసాగరములో ప్రశాంతముగా ఈతకొడుతు చికాకులను తొలగించుకో."
(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
Thursday, March 29, 2012
సాయి.బా.ని.స. డైరీ - 1995 (16)
29.03.2012 గురువారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1995 16వ. భాగాన్ని చదువుకుందాము.
సాయి.బా.ని.స. డైరీ - 1995 (16)
01.06.1995
నిన్నటి రాత్రి శ్రీసాయికి నమస్కరించి "గత జీవితములోని స్నేహితులతో ఏవిధముగా మసలుకోవాలి చెప్పు తండ్రి" అని వేడుకొన్నాను. రాత్రి కలలో శ్రీసాయి చూపిన దృశ్యాలు.
1) అది గోల్కొండ కోట. పాతబడిన భవనాలు. ఆభవనాల్లో నివసించిన నవాబుల చరిత్రను గైడు చెప్పసాగినాడు.
యాత్రికులు అందరు శ్రధ్ధగా వినసాగినారు. సాయంత్రము అయినది. ఆభవనాలలో దీపాలు పెట్టేవారు కూడా లేరు. యాత్రికులు బరువైన మనసుతో తమ యిండ్లకు వెళ్ళిపోయినారు.
2. అది పాత పాడుబడిన టేప్ రికార్డరు. అతి కష్ఠము మీద దాని టేప్ మీద కొత్త సినీమా పాటలు రికార్డు చేసినాను. వినాలని కుతూహలముతో ఆటేప్ రికార్డరును ఆన్ చేసినాను. టేప్ రికార్డరులోని మోటారు మెల్లిగా తిరగటము వలన కొత్త సినీమా పాట కూడా పాతకాలము పాటలాగ వినబడసాగినది. ఆపాట వినలేక ఆపాత టేప్ రెకార్డరును ఆఫ్ చేసినాను.
02.06.1995
నిన్నరాత్రి శ్రీసాయికి నమస్కరించి "సాయినాధ శిరిడీలోని నీసమాధి గురించి చెప్పమని వేడుకొన్నాను. శ్రీసాయి కలలో చూపిన దృశ్యము. అది శిరిడీ గ్రామము. ఆగ్రామములో ఒక స్త్రీ, మట్టిని ప్రోగుచేసి నమ్మకము అనే యిటికలను తయారు చేసి తన పిల్లలకు పంచసాగినది.
ఆవిధముగా యిటుకలను తయారు చేస్తూ వాటిని తన పిల్లలకు పంచుతూ ఆమట్టిలో సమాధి అయిపోయినది. యిపుడు ఆమె పిల్లలు అందరు శిరిడీకి వెళ్ళి ఆక్కడి మట్టితో నమ్మకము అనే యిటుకలను వారే తయారు చేసుకొని తమ జీవిత సౌధములను నిర్మించుకొంటున్నారు.
21.06.1995
నాలుగురోజుల క్రితము సాయంత్రము వేళలో నాలుగు పిల్లి పిల్లలు నాయింట చేరినవి.
అవి నన్ను చూసి సంతోషముతో నాకాళ్ళవద్ద గెంతులు వేయసాగినవి. ఆ సమయములో 18, 19, అధ్యాయము 162 వ పేజీలో శ్రీసాయి అన్నమాటలు. "ఏదైన సంబంధము యుండనిదే ఒకరు యింకొకరి దగ్గరకు పోరు. ఎవరు గాని ఎట్టి జంతువుగాని నీవద్దకు వచ్చిన నిర్దాక్షిణ్యముగా వానిని తరిమివేయకుము. వాటి ఆకలిని తీర్చిన మరియు వాని దాహమును తీర్చిన భగవంతుడు ప్రీతి చెందును." గుర్తుకు వచ్చినవి. వెంటనే వంట యింటిలోనికి వెళ్ళి ఒక గిన్నెలో పాలుతెచ్చి వాటికి పెట్టినాను. ఆనాలుగు పిల్లులు ఆపాలు త్రాగి వెళ్ళిపోయినవి. ఆనాటినుండి రోజు నేను ఆఫీసు నుండి తిరిగి వచ్చే సమయానికి ఆపిల్లులు నాయింట చేరి నాకాళ్ళ దగ్గర గెంతులు వేయసాగినవి.
నేను వాటికి పాలు పట్టడము ఒక అలవాటుగా మారినది. అందుచేత నిన్నరాత్రి నిద్రకు ముందు శ్రీసాయికి నమస్కరించి నాయింట చేరిన ఈనాలుగు పిల్లి పిల్లలకు నాకు గల సంబంధము తెలియచేయమని శ్రీసాయిని వేడుకొన్నాను. శ్రీసాయి రైల్వే మంత్రి శ్రీ జాఫర్ షరీఫ్ రూపములో దర్శనము యిచ్చి అన్నమాటలు. "గోపాలరావు నీవు 1918 సంవత్సరానికి ముందు జన్మించి యుంటే నాసేవ చేసుకొని యుండేవాడిని అని అనేక సార్లు నాపటము ముందు నిలబడి అన్నావు. 1974 సంవత్సరములో నీతండ్రి చనిపోయినారు. ఆయన 54 సంవత్సరాలకే చనిపోవటము వలన ఆయన సేవ చేసుకోలేదని అనేక సార్లు నీమనసులో బాధపడినావు. భౄణహత్య పాపము అని తెలిసి కూడ నీజీవితములో రెండుసార్లు నీభార్యకు గర్భస్రావము చేయించినావు. నిన్ను ఋణ విముక్తుని చేయటానికి నా ఆత్మ, నీతండ్రి ఆత్మ, గర్భస్రావములో చనిపోయిన నీయిద్దరి పిల్లల ఆత్మలు ఈ పిల్లిపిల్లల ఆత్మలలో ప్రవేశించి నీయింట కొన్నిరోజులు పాలు త్రాగుతాయి. నీవు ఋణవిముక్తుడివి కాగానే వాటి అంతట అవి నీయింటినుండి వెళ్ళిపోతాయి." కలలో ఈమాటలు విన్నతర్వాత నిద్రనుండి లేచి శ్రీసాయికి నమస్కరించినాను. మరి యింకా ఎన్నిరోజులు ఈపిల్లిపిల్లలు నాయింట పాలు త్రాగుతాయి వేచి చూడాలి.
(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
Tuesday, March 27, 2012
సాయి.బా.ని.స. డైరీ - 1995 (15)
26.03.2012 మంగళవారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1995 15 వ.భాగాన్ని చదువుకుందాము.
సాయి.బా.ని.స. డైరీ - 1995 (15)
27.05.1995
నిన్నరాత్రి నిద్రకు ముందు సాయికి నమస్కరించి జీవిత ప్రయాణములో తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పమని వేడుకొన్నాను. శ్రీ సాయి చూపిన దృశ్యాలు. నేను రోడ్డుమీద సైకిలు త్రొక్కుతు ముందుకు సాగిపోతున్నాను.
రోడ్డు మధ్యలో పెద్ద పెద్ద గోతులు వచ్చినవి. నేను సైకిలు దిగి సైకిలును చేతితో నడుపుకొంటు
ఆగోతులను దాటుకొంటు తిరిగి రోడ్డుమీదకు చేరగానే సంతోషముగా సైకిలు త్రొక్కసాగినాను. కొంత దూరము సైకిలు మీద ప్రయాణము చేసిన తర్వాత ఒక పడవలో కూర్చుని నదిలో ప్రయాణము చేయసాగినాను.
ప్రయాణము సాఫీగానే సాగిపోతున్నది. కాని పడవలోనికి నీరు చేరసాగినది. నేను భోజనము చేసే కంచముతో ఆనీరును తోడివేసి గాలివాలుకు తెరచాప వేసి ప్రయాణము ముందుకు సాగించినాను.
28.05.1995
నిన్నరాత్రి నిద్రకు ముందు సాయికి నమస్కరించి సాయినాధ కుటుంబ సభ్యుల మధ్య ఉంటున్నపుడు ప్రశాంతముగా జీవించగలిగేలాగ యుండే మార్గము చూపు తండ్రి అని వేడుకొన్నాను. శ్రీసాయి చూపిన దృశ్యాలు.
1. నేను నా బంధువుల మధ్య తిరుగుతున్నాను. కాని నాచుట్టు ఒక కాంతి చక్రము తిరుగుచున్నది.
ఆకాంతి చక్రమును గురువు ప్రసాదించినారు అని అక్కడి బంధువులు చెప్పుకోసాగినారు.
2. నావాళ్ళు నానుండి దూర దేశాలలో యున్నారు. వాళ్ళు రోజూ నాతో టెలిఫోన్ లో మాట్లాడుతున్నారు. అప్పుడప్పుడు విమానాలలో వచ్చి నన్ను చూడసాగినారు.
3. నేను యిల్లు కడుతున్నాను. ఆయింటికి సిమెంటు బదులు తియ్యటి తేనె పాకము (ప్రేమ పాకము) వాడుతున్నాను.
4. అన్నదమ్ములు యిళ్ళమధ్య గోడలకు బదులు మంచి అరటి చెట్లు పాతినాము.
వాటి ఫలాలు రెండు కుటుంబాలవారు సంతోషముగా తినుచున్నారు.
29.05.0995
నిన్నటిరాత్రి నిద్రకు ముందు సాయికి నమస్కరించి నావాళ్ళనుండి నేను పొందుతున్న మానసిక బాధనుండి విముక్తి ప్రసాదించమని కోరినాను. శ్రీసాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి అన్న మాటలు 1) జీవితములో ఈర్ష్య, ద్వేషాలు అనేవి కుటుంబ సభ్యుల మధ్య స్నేహితులమధ్య నీటిలోని నాచులాగ పెరుగుతు ఉంటుంది. మనిషి జీవించటానికి నీరు (కుటుంబ సభ్యులు - స్నేహితులు)
చాల అవసరము. అనీరు కావలసినపుడు ఆనీటితో వచ్చే నాచును కూడా భరించాలి. ఆనాచుమీద నడవకుండ నాచు ప్రక్కనుండి నడుస్తూ మనజీవిత గమ్యము చేరాలి.
(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు