సా.యి.బా.ని.స డైరీ - 1995 (17)
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ 1995 17 వ. భాగాన్ని చదువుకుందాము.
నిన్నరాత్రి శ్రీసాయికి నమస్కరించి నాలోని ధన వ్యామోహమును తొలగించుమని వేడుకొన్నాను. శ్రీ సాయి కలలో ఒక తోపుడు బండిమీద కూరగాయలు అమ్మే వ్యాపారస్థుని రూపములో దర్శనము యిచ్చి అన్న మాటలు "ఈ పెద్ద అపార్ట్ మెంట్స్ లో మీకు చెందినది నాలుగు గదులు మాత్రమే. యింత పెద్ద మేడను చూసి మీరు ఈభవనము అంతా నాది అని తలచటము అవివేకము. అదే విధముగా ఈప్రపంచములో ఉన్న ధనములో మీదగ్గర ఉన్న ధనము ఎన్నవ వంతు. బాగా ఆలోచించి ధన వ్యామోహము వదులుకోండి" ఈ మాటలకు తెలివి వచ్చినది.
23.06.1995
నిన్నటి రాత్రి శ్రీసాయికి నమస్కరించి నాలోని అహంకారాన్ని తొలగించుకొనే మార్గమును చూపించమని వేడుకొన్నాను. శ్రీసాయి నాకు ప్రసాదించిన కల వివరాలు. "నేను పట్టు వస్త్రాలు, విభూతి పట్టీలు పెట్టుకొని నాపినతండ్రి యింటికి వెళ్ళినాను.
ఆసమయములో ఆయన టీ.వీ. లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ నన్ను పలకరించలేదు.
గొప్ప సాయిభక్తుడిగా నాకు పేరు ఉంది అనే అహంకారము నాలో ఉంది. నాపిన తండ్రి నన్ను పలకరించలేదు అనే భావన నాలో నాపినతండ్రిపై దేషాన్ని కలిగించినది. ఆద్వేష భావముతో ఆయనతో దెబ్బలాటకు దిగినాను. ఈపరిస్థితిలో నిద్రనుండి మెలుకువ వచ్చినది. ఒకసారి ఆలోచించినాను. నాలో అహంకారము లేనినాడు నేనే ముందుగా నాపిన తండ్రిని పలకరించి యుండేవాడిని కదా. నా అహంకారము నాలో ద్వేషాన్ని రేకెత్తించి తండ్రితో సమానమైన పినతండ్రితో దెబ్బలాటకు ఆస్కారము కలిగించినది కదా. అహంకారము అన్ని అనర్ధాలకు మూలము అని గ్రహించినాను.
06.07.1995
నిన్నటిరోజు గురుపూర్ణిమ - నిన్నటి రాత్రి శ్రీసాయికి నమస్కరించి గురుపూర్ణిమ గురించి వివరించమని కోరినాను. శ్రీసాయి ఒక బౌధ్ధ భిక్షువు రూపములో (శ్రీలంక దేశము బౌధ్ధ భిక్షువు) దర్శనము యిచ్చి చెప్పిన మాటలు.
1) గురుపూర్ణిమనాడు నీవు నీగురువును పూజించు. నీమాట మీద నమ్మకము ఉన్నవారికి నీగురువుని వారికి పరిచయము చేసి వారికి కూడా గురుపూజ చేసుకొనే భాగ్యము కలిగించు. ఎవరో నీగురువును తూలనాడినారు అనే బాధను నీమనసునుండి తొలగించు.
2) యితర మతాలను నీవు దూషించవద్దు. యితరులు నీమతము గురించి చులకనగా మట్లాడుతుంటే నీవు ఆమాటలు వినవద్దు.
07.07.1995
నిన్న రాత్రి నిద్రకు ముందు శ్రీసాయికి నమస్కరించి మనసుకు కష్ఠము కలిగించేవారి నుండి దూరముగా యుండగలిగే మార్గము చూపు తండ్రి అని వేదుకొన్నాను. శ్రీసాయి కలలో చూపిన దృశ్యాల సారాశము. "నీవు యితరులనుండి ఏదైన ఆశించినపుడు నీవు ఆశించినది నీకు లభించనపుడు నీమనసుకు కష్ఠము కలుగుతుంది. అందుచేత నీవు యితరులనుండి ఏమీ ఆశించకు. నీస్వశక్తిమీద నీవు జీవించటము నేర్చుకో." గ్రామాలలోని చెఱువులు ఎండకు ఎండిపోయినపుడు ఆగ్రామములోని ప్రజలు, జంతువులు నీటికోసము నదులవైపుకు సాగిపోతారు.
అలాగే నీమనసు చికాకులు అనే ఎండవేడికి ఎండిపోయినపుడు సాయిసాగరము వైపు సాగిపో. సాయిసాగరములో ప్రశాంతముగా ఈతకొడుతు చికాకులను తొలగించుకో."
(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment