Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, June 9, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1997 (16) 1998 (01)

0 comments Posted by tyagaraju on 11:28 PM



                               


10.06.2012
ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు  


సాయి.బా.ని.స. డైరీ - 1997  (16)  & 1998  (01)

30.12.1997

శ్రీ సాయి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి కలలో అన్నమాటలు.

1) మనము మనతోటి మనిషి పట్ల ఉన్న మంచిభావాలను, గౌరవమును, నమస్కారము ద్వారాను, 
   

పాదనమస్కారము ద్వారాను తెలియపర్చుతాము. కొందరు తమ భావాలను పైకి వెలిబుచ్చలేరు.  అంతమాత్రాన వారు నమస్కారము చేయడము అన్నా, పాదనమస్కారము చేయడములకు వ్యతిరేకము అని భావించరాదు.  భక్తి, గౌరవము అనేది మనసులో ఉన్న చాలు.

2) కొందరు అహంకారముతో తోటివారిని అగౌరవము పర్చుతు జీవించుతారు. 

 అదివారి సంకుచిత స్వభావానికి నిదర్శనము.  అటువంటివారినుండి దూరముగా యుండటము ఉత్తమము. 

3) యితరుల ధర్మాలు విషయములో ఆసక్తి చూపించవద్దు.  నీస్వధర్మాన్ని అర్ధము చేసుకొని ఆధ్యాత్మిక రంగములో జీవితాన్ని ముందుకు నడిపించి, నీగమ్యాన్ని చేరుకో. 

సాయి.బా.ని.స. డైరె -  1998  (01)

03.01.1998


శ్రీసాయి నిన్నరాత్రి ఒక ఫకీరు రూపములో దర్శనముఇచ్చి అన్నమాటలు.

1) నాసత్ చరిత్రను వ్రాయడానికి నేను హేమాద్రిపంతుకు అనుమతిని ఇచ్చినాను.  కాని ఈనాడు అనేకమంది నాసత్చరిత్రకు వక్ర భాష్యాలు వ్రాస్తు నాకు బాధను కల్గించుతున్నారు. ఏది ఏమైన నాజీవిత ఘట్టాలను మాత్రము మార్చకుండ వ్రాయడము నాకు కొంతవరకు ఊరట కలిగించినది.

2) నాతత్వ ప్రచారములో నేను నీకు ఇచ్చిన మిఠాయిని నీవు తిను.  నీపక్కవాడికి కొంచము పంచిపెట్టు.  

3) ప్రశాంత జీవితము కోరుకొనేవారు ముందుగా ఆహారములో రుచులకు పోరాదు.  నిరాడంబర  జీవితానికి కావలసిన లక్షణాలు అలవర్చుకొని జీవితాన్ని కొనసాగించాలి.  

08.01.1998

శ్రీసాయి నిన్నరాత్రి కలలో నాచిన్ననాటి హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాఉనిగా దర్శనము ఇచ్చి అన్నమాటలు

1) కొందరు భగవంతుని అనుగ్రహమును సంపాదించి దాన్ని యితరులకు అమ్ముకొని ధనసంపాదన చేస్తారు.  మరికొందరు తాము సంపాదించిన భగవంతుని అనుగ్రహాన్ని తోటివారి మేలుకోసము ఉపయోగించుతారు.  అటువంటివారు అంటేనే నాకు చాలా ఇష్ఠం. 

2) కొందరు ప్రకృతిలోని అందచందలను గుర్తించలేక భగవంతుడు లేడు అని అంటారు.  మరికొందరు ప్రకృతిలోని అందచందాలను చూసి ఈప్రకృతి భగవంతుని రూపమే అంటారు.
3) నీవుభగవంతుని పూజ చేసుకొంటున్న సమయములో నీయింటికి నీమిత్రులు రావచ్చును.  నీకు ఇష్ఠము లేనివారు రావచ్చును.  అందరిలోను భగవంతుడు ఉన్నాడు అని నమ్మినపుడు నీవు పూజ ప్రసాదమును అందరికి పంచిపెట్టు. 

4) భగవంతుని సేవలో సంగీతము ద్వారా భగవంతుని కీర్తించు.  నీకు సంగీతమురాని పక్షాన జలతరింగిణి వాద్యముతో శబ్దతరంగాలను సృష్ఠించి ఆశబ్దతరంగాలలో భగవంతుని అనుభూతిని పొందు.





(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు






Friday, June 8, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1997 (15)

0 comments Posted by tyagaraju on 7:12 AM




08.06.2012 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు


సాయి.బా.ని.స. డైరీ - 1997  (15)

02.12.1997

శ్రీసాయి నిన్నరాత్రి ఒక అజ్ఞాత వ్యక్తిరూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.


1) నేటి యువతీ యువకులు తమతమ నిజ పరిస్థితులను మరచిపోయి ఊహాలోకములో విహరించుతు తమ జీవితాలను నాశనము చేసుకొంటున్నారు.  ఇది మంచి పధ్ధతి కాదు.


2) సాత్విక ఆహారమును తినడానికి మంచి మాటలను మాట్లాడటానికి భగవంతుడు మానవునికి నోరు ఇచ్చినాడు.  మరి ఆనోటితో తినకూడని పదార్ధాలు తింటు, చెడు విషయాలు మాట్లాడుతు పవిత్రమైన నోరును అపవిత్రము చేసుకొని జీవించటములో అర్ధములేదు. 

3) ఒకసారి నీమనసును లోని మురికిని ఆధ్యాత్మిక నదీ ప్రవాహములో శుభ్రము చేసిననాడు ప్రాపంచిక జీవితములో నీవు నగ్నముగా స్నానముచేసిన, లేదా నగ్నముగా స్నానము చేయుచున్నవారిని చూసిన నీలో ఏవిధమైన చెడు ఆలోచనలు రావు అనేది గ్రహించగలవు.    

4) ప్రకృతిని చూసి ఆనందించగలవు.  ఆప్రకృతిని ఛాయాచిత్రము రూపములో బంధించగలవు.  


వాటివలన నీకు కలిగే మేలు ఏమీలేదు.  నిజముగా నీవు ప్రకృతిని ప్రేమించినవాడివి అవుతే ఆప్రకృతినేర్పిన పాఠాలను నీమనసులో అధ్యయనము చేస్తు నీజీవితాన్ని ముందుకు నడిపిననాడు నీకు నిజమైన మేలు జరుగుతుంది.      

13.12.1997

నిన్నరాత్రి శ్రీసాయి నాచిన్ననాటి స్నేహితుని రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు. 

1) నీజీవితములో నీవు తప్పుడు పనులు చేస్తు ఉన్నావని నీకు తెలిసినపుడు దానికి జరగబోయే పరిణామాలకు కూడా సిధ్ధపడి యుండాలి. 

2) నీవెనుక నీగురించి అన్యాయముగా నిన్ను ఆడిపోసుకొనేవారినుండి నీవు ఏమీ భయపడనవసరము లేదు.  నీవు వారిజోలికి పోకపోతే వారే నిన్ను మర్చిపోతారు.  

3) పరుల మతవిషయాలలో కలుగచేసుకోవటముకన్న, పరస్త్రీవ్యామోహముకన్న, ధనవ్యామోహము చాలా భయంకరమైనది.  ఈధనవ్యామోహము వలనే కొందరు నిన్ను పొగుడుతారు.  మరికొందరు నిన్ను తిడతారు.  

అందుచేత నీవు ధనవ్యామోహము విడనాడు.  మరియూ ధనవ్యామోహనాపరులనుండి దూరముగా జీవించు.    

19.12.1997

శ్రీసాయి నిన్నరాత్రి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు. 
1) నీజీవితము ఒక క్రీడారంగము అయితే నిన్ను నేను ఉన్నత ప్రమాణాలు సృష్ఠించే ఒక గొప్ప ఆటగానిగా తయారు చేస్తాను. 

2) యితరమత సాంప్రదాయాలను పాటించేవారు నీ  దగ్గరకు వచ్చినపుడు వారిని గౌరవించి వారి పండగలకు వారిని అభినందించు.  అంతేగాని వారి మతపరమైన విషయాలను మాట్లాడవద్దు. 

3) ప్రాపంచిక రంగములో నీవు యితరుల సహాయము కోరిననాడు నీవు వారికి సదా అణగిమణిగియుండాలి.  అదే నీవు ఆధ్యాత్మిక రంగములో నీగురువు సహాయము కోరిననాడు నీగురువు సదా నీకు తనప్రేమను పంచుతు, నిన్ను కాపాడుతు ఉంటాడు.

4) ఆధ్యాత్మిక రంగ ప్రయాణము నీవు ఒక్కడివే చేయాలి.  నీగమ్యాన్ని చేరాలి.  








(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు

Thursday, June 7, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1997 (14)

0 comments Posted by tyagaraju on 6:38 AM




07.06.2012


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి.బా.ని.స. డైరీ -  1997  (14)

                          20.11.1997

నిన్నరాత్రి శ్రీసాయి ఒక సన్యాసి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) బలవంతులు, ధనవంతులు కలసి కుయుక్తులతో ప్రజలకు అన్యాయము చేయుచున్నారు.  న్యాయదేవత బలహీనముగా యున్న మెల్లిగా ఓపిక తెచ్చుకొని అన్యాయము చేసినవారిని బహిర్గతము చేసి ప్రజలకు న్యాయమును ప్రసాదించుతుంది.


2) ఈప్రపంచములోని దుర్మార్గులను శిక్షించటానికి, మరియు నీమనసులోని చెడును తొలగించటానికి నీకంటే బలవంతుని సహాయము కోరాలి.  నీకంటే బలవంతుడు ఆభగవంతుడు.  

అటువంటి భగవంతుని గురించి తెలుసుకోవాలి అంటే నీవు నాదగ్గరకురా, నీకు వివరాలు చెబుతాను.   
 

3) నాదగ్గరకు వచ్చేవారినుండి నేను ఆశించేది బధ్ధకములేకుండుట, అబధ్ధము ఆడకుండటము, చెడు వ్యసనాలకు దూరంగా యుండటము.  ఈలక్షణాలు నీలో యుంటే నాదగ్గరకురా.  నేను నిన్ను నాకంటికి రెప్పలాగ కాపాడుతాను.  

4) ఈనాడు జనాభా ఎక్కువయి కక్షలతో ఒకరిని యింకొకరు చంపుకొంటు, భవిష్యత్ లో జతువులుగా పుట్టాడానికి  సిధ్ధపడుతున్నారు. 
24.11.1997

శ్రీసాయి నిన్నరాత్రి ఒక అజ్ఞాతవ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) మానవులందరిలోని రక్తము ఒక్కటే అని అందరికి తెలుసు.  కాని బంధుత్వాలులో తల్లి, భార్య, కుమార్తె, చెల్లెలు అనే ఆలోచనలు వచ్చినపుడు వారితో వ్యవహారాలు బంధుత్వానికి సరిపడినవిధముగా చేస్తాము.  అలాగే భగవంతుడు ఒక్కడే అని మనందరికి తెలుసు.  కాని భగవానునికి రూపాలు, రంగులు అనేకములు.  



వాటిని దృష్ఠిలో పెట్టుకొని భగవంతుడిని పూజించాలి.  

2) నీకంటికి అజ్ఞానపు పొరలు ఉన్నంతకాలము నీవు అజ్ఞానములో గడపవలసినదే.  నీవు నాదగ్గరకు వచ్చినరోజున నేను ఆపొరలను తొలగించుతాను. 
 అపుడు నీవు నీకంటితో జ్ఞానము చూడగలవు. 

3) నీవు ఏదేశము వెళ్ళిన అక్కడి ప్రజలను వారి సాంప్రదాయాలను గౌరవించడము, ఆదేశములో కష్ఠపడి పని చేయటము అలవర్చుకొన్ననాడు ఆదేశము నీదే.  అక్కడివారు నీవాళ్ళే అని గుర్తుంచుకో.     

27.11.1997

శ్రీసాయి నిన్నరాత్రి ఒక సన్యాసి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) నీవుముందుగా వంటరిగా ఆధ్యాత్మిక భోజనము చేయి.  ఆతర్వాతనే ఇతరులకు ఆభోజమును వడ్డించు. 

2) నీవు జీవితములో సుఖశాంతులతోయుండాలి అంటే దానధర్మాలు 
చేయాలి.  

తోటివారు కష్ఠాలలో యున్నపుడు వారిని ఆదుకోవాలి.  అంతేగాని అపాత్రదానము చేసి వారిని సోమరిపోతులులాగ మార్చవద్దు. 

3) ప్రాపంచిక రంగములో నీవు సంపాదించిన ధనమును దానధర్మాలకు వినియోగించదలచిన, నీవు బీదలకు, అనారోగ్యముతో బాధపడుతున్నవారికి గుప్తదానము చేయి.  గుప్తదానము నీమనసుకు ప్రశాంతత యిస్తుంది.  మరియు గుప్తదానము స్వీకరించినవానికి భగవంతునిపై విశ్వాసముకలుగుతుంది.  భగవంతుడు సంతోషించి నీకుసుఖశాంతులు ప్రసాదించుతాడు.    



(ఇంకాఉంది)


సర్వం శ్రీసాయినాధార్పణమస్తు

Wednesday, June 6, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1997 (13)

0 comments Posted by tyagaraju on 6:56 AM



06.06.2012  బుధవారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి.బా.ని.స. డైరీ -  1997 (13)
 
07.11.1997
 
శ్రీసాయి నిన్న రాత్రి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.
 
1.  నీవు ఆధ్యాత్మిక ప్రగతికి జమిస్థాన్ పూర్ బడికి వెళ్ళనవసరములేద్. నా యింటపని చేస్తున్న "శ్రధ్ధ" అనే పిల్లవాడు నీకు తన పెన్నును బహూకరించినాడు.  

కనుక ఆపెన్నుతో  శ్రీసాయి తత్వాలను ఒక చోట ఏరికూర్చి పదిమంది సాయి భక్తులకు "సహనము" తో బోధించు.  ఈతత్వప్రచార బోధన ఫలితము నాకు వదలిపెట్టు.  నీకు సదామేలు జరుగుతుంది.
 
2.  వయసులో ఉండగా వృత్తిలోని రాజకీయాల గొడవలు, వృత్తినుండి విరమణ చేసిన తర్వాత ధన, దార, సంతానములపై మమకారముతో గడిపి వేస్తే యింక నిన్ను సృష్ఠించిన భగవంతుని గురించి ఆలోచించేది ఎప్పుడు, ప్రశాంత జీవితమును గడిపేది ఎప్పుడు ఆలోచించు.
 
13.11.1997
 
శ్రీసాయి నిన్నరాత్రి వృథ్థుని రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.
 
1) సాయి తత్వ ప్రచారము అనేపంటను పండించేటప్పుడు పంటను నాశనము చేసే దోమలబాధ ఎక్కువ అగుతుంది.  ఆదోమల బాధపోవాలి అంటే కొన్నాళ్ళపాటు పంటను పండించరాదు.
 
2) సాయి తత్వప్రచారము అనే ఆలోచనలతో కొందరు కష్ఠపడి పని చేస్తారు.  మరికొందరు భిక్షమెత్తుకొని జీవించుతారు.   వారి యిరువురిని నేను గమనించుతు ఉంటాను.  నాపేరిట భిక్ష కోరినవారికి నీవు ధనసహాయము చేయకపోయిన ఫరవాలేదు.  వారిని నిందించి వారితో గొడవలు పడవద్దు.
 
3) సాయి తత్వ ప్రచారములో నీవు పొగడ్తలకు పొంగిపోవద్దు.  ఎవరైన నిన్ను నిందించిన ఆనిందలు నేను భరించుతాను.  నీవు మాత్రము నీవు నమ్ముకొన్న మార్గములో ప్రయాణము కొనసాగించు.
 
17.11.1997
 
శ్రీసాయి నిన్నరాత్రి ఒకవృధ్ధుని రూపములో దర్శనము ఇచ్చి ప్రశాంత జీవితము కావాలి అంటే అన్నమాటలు.
 
1) భగవంతుడు ఉన్నాడు, లేదు, అనే వివాదములో ఎన్నడు దిగవద్దు.
 
2) జీవించటానికి ఆహారము అవసరము.  అంతేగాని రుచులతో గూడిన ఆహారము మాత్రముకాదు.
 
3) వైవాహిక జీవితములో పరస్త్రీ వ్యామోహము తలనొప్పిగా మారుతుంది అందుచేత అటువంటి ఆలోచనలకు దూరంగా జీవించు.
 
4) జీవితములో నీకు శారీరక శక్తి లోపించిననాడు, మిగిలియున్న శక్తిని శేష జీవితము ప్రశాంతముగా గడపడానికి వినియోగించటము ఉత్తమము.
 
5) జీవితములో వృధ్ధాప్యములో నీవారి పట్ల మమతలకు, మమకారాలకు దూరంగా జీవించు.  వీటివలన కలిగే సంతోషములో లభిచేది ఏమిలేదు. అలాగే విచారములో పోయేది ఏమిలేదు.  అందుచేత కనీసము వృధ్ధాప్యములోనైన భగవంతుని నామస్మరణతో జీవించు.
 
18.11.1997
 
నిన్నరాత్రి శ్రీసాయి ఒక హరిదాసు రూపములో దర్శనముఇచ్చి అన్నమాటలు.
 
1) సాయి బంధువులు తమ శరీరానికి అంటుకొన్నమురికిని నదిలో స్నానము చేసి పోగొట్టుకోగలరు.  మరి మనసులోని మురికిని పోగొట్టుకోవాలి అంటే "రామాయణ రసావాహిని" లో మునిగి తేలవససినదే.  అందుచేత సాయి భక్త్లులు   అందరు రామాయణ మహాకావ్యమును చదివి తీరవలసినదే.

 
2) నీవు బుఱ్ఱ కధ విననవసరము లేదు.  అలాగే హరికధ విననవసరములేదు .  నీవు చేయవలససినది హరినామస్మ్రరణ.  

ఆహరినామ స్మరణ బిగ్గరగా చేసిన లేదా మెల్లిగా చేసిన శ్రీహరి వచ్చి నీమనసులో ఆసనము వేసుకొని కూర్చుంటాడు.
 

(ఇంకా ఉంది)  
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
  

Tuesday, June 5, 2012

సాయి.బా.ని.స. డైరీ -1 997 (12)

0 comments Posted by tyagaraju on 7:59 AM






05.06.2012  మంగళవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు



సాయి.బా.ని.స. డైరీ -1 997 (12)

17.09.1997

శ్రీసాయి నిన్నరాత్రి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) నీజీవితములో నీశరీరము శాశ్వతముకాదు.  జీవిత మధ్యకాలములో వచ్చిన పదవి శాశ్వతము అని తలచటము నీమూర్ఖత్వము.

2) 1914 నుండి భారత దేశాన్ని పాలించిన రాజప్రతినిధులు, 1947 నుండి భారత దేశాన్ని పాలించిన రాష్ట్రపతులు తమ పదవులులో అధికారాన్ని చవిచూచి పదవీవిరమణ చేసిన తర్వాత కాలుకాలిన పిల్లిలాగ తిరుగుతున్నారు.  మరివారికి పదవి శాశ్వతముగా వరించినదా?  యింకా ఈజనులకు పదవిపై వ్యమోహము ఎందుకు?  

18.09.1997

శ్రీసాయి నిన్నరాత్రి షిరిడీలోని పూజారి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.  

 
1) నీవు ఇతరులపై ఆధారపడిననాడు, వారు నీకు ఏమిచ్చిన నీవు స్వీకరించక తప్పదు.  మరియు వారిని విమర్శించే హక్కు నీకు ఉండదు.  అటువంటి సమయములో నీవు మనసులో  బాధపడేకన్నా స్వతంత్రముగా నీకాళ్ళపై నీవు నిలబడి జీవించటానికి ప్రయత్నించు. 
 

2) నీవు ఆధ్యాత్మిక మార్గములో పయనించుతు ప్రక్క యింటిలోని గొడవల గురించి ఆలోచించటములో అర్ధములేదు. 

3) వేరు వేరు మతాలవారు కలసి వంటవండినదానిని అన్నమే అంటాము.  
   

అన్నము పరబ్రహ్మ స్వరూపము అని నీవు తలచినపుడు - "సబ్ కా మాలిక్ ఏక్ హే" కదా అని గుర్తించుకో. 

25.09.1997

శ్రీసాయిని నిన్నరాత్రి ఒక ఫకీరు రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) ఆనాడు సంఘములో వెలివేయబడిన భాగోజీషిండే నాఅశీర్వచనాలతో శిరిడీలో ధైర్యముగా బ్రతికినాడే. 

మరి ఈనాడు వచ్చే జబ్బులకు భయపడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించటము అవివేకము.  

2) నాభక్తుల కష్ఠసుఖాలు తెలుసుకోవడానికి వీలుగా నాపాదాలను నమ్ముకొన్నవారి కోసము నేను ఎన్నడు పాదరక్షలు ధరించలేదు.  
నేను పాదరక్షలు ధరించితే నాభక్తుల కష్ఠసుఖాలు నాకు తెలియవు కదా. 

3.  ఈప్రపంచములోని భార్య, భర్తల  జీవన విధానము, సమస్త ప్రాణికోటి జీవన విధానము వారి కష్ఠసుఖాలు అన్నీ నాకు తెలుసు.  వారి మంచిచేడులు చూసేది నేనే. 

4) జీవితములో జననము మరియు మరణములను సమదృష్ఠితో చూడగలిగినవాడే నిజమైన నాభక్తుడు.  

05.10.1997

నిన్నరాత్రి శ్రీసాయి కలలో ఓసన్యాసి రూపములో దర్శనము ఇచ్చి భగవంతుని గురించి తెలియచేసిన వివరాలు.

1) భగవంతుని గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా నీవు నిగర్వముతో  జీవించటము అలవర్చుకో.  ఆతరవాత నీతోటివారికి నీశక్త్యానుసారము సహాయముచేయి.  నీవు మరణించినపుడు నీవు సంపాదించిన ధనము నీతో రాదు అని గ్రహించు.  అటువంటి జీవితమును గడుపుతున్నపుడు మాత్రమే నీవు భగవంతుని గురించి తెలుసుకోగలవు. 

11.10.1997

నిన్నరాత్రి శ్రీసాయి ఒకసన్యాసి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) నేను ఈనాడు లేకపోయిన నాభక్తులకు వారి కలలలో దర్శనము ఇచ్చి నేను వారి మధ్య ఉన్నాననే భావన కలుగ చేస్తున్నాను.   

2) ఈనాడు సమాజములో స్త్రీని అగౌరవపర్చుతు వారిని హింసించుతు జీవించుతున్నారు.   ఈవిధమైన ప్రవర్తన సమాజానికి మంచిది కాదు.  ఈధరిత్రిని ఉద్ధరించటానికి స్త్రీశక్తి గాయత్రిమాత రూపములో వెలిసినది.  గాయత్రిమాతను పూజించి, మాత ఆశీర్వచనాలు పొందండి.  

(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు



    

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List