05.06.2012 మంగళవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి.బా.ని.స. డైరీ -1 997 (12)
17.09.1997
శ్రీసాయి నిన్నరాత్రి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.
1) నీజీవితములో నీశరీరము శాశ్వతముకాదు. జీవిత మధ్యకాలములో వచ్చిన పదవి శాశ్వతము అని తలచటము నీమూర్ఖత్వము.
2) 1914 నుండి భారత దేశాన్ని పాలించిన రాజప్రతినిధులు, 1947 నుండి భారత దేశాన్ని పాలించిన రాష్ట్రపతులు తమ పదవులులో అధికారాన్ని చవిచూచి పదవీవిరమణ చేసిన తర్వాత కాలుకాలిన పిల్లిలాగ తిరుగుతున్నారు. మరివారికి పదవి శాశ్వతముగా వరించినదా? యింకా ఈజనులకు పదవిపై వ్యమోహము ఎందుకు?
18.09.1997
శ్రీసాయి నిన్నరాత్రి షిరిడీలోని పూజారి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.
1) నీవు ఇతరులపై ఆధారపడిననాడు, వారు నీకు ఏమిచ్చిన నీవు స్వీకరించక తప్పదు. మరియు వారిని విమర్శించే హక్కు నీకు ఉండదు. అటువంటి సమయములో నీవు మనసులో బాధపడేకన్నా స్వతంత్రముగా నీకాళ్ళపై నీవు నిలబడి జీవించటానికి ప్రయత్నించు.
2) నీవు ఆధ్యాత్మిక మార్గములో పయనించుతు ప్రక్క యింటిలోని గొడవల గురించి ఆలోచించటములో అర్ధములేదు.
3) వేరు వేరు మతాలవారు కలసి వంటవండినదానిని అన్నమే అంటాము.
అన్నము పరబ్రహ్మ స్వరూపము అని నీవు తలచినపుడు - "సబ్ కా మాలిక్ ఏక్ హే" కదా అని గుర్తించుకో.
25.09.1997
శ్రీసాయిని నిన్నరాత్రి ఒక ఫకీరు రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.
1) ఆనాడు సంఘములో వెలివేయబడిన భాగోజీషిండే నాఅశీర్వచనాలతో శిరిడీలో ధైర్యముగా బ్రతికినాడే.
మరి ఈనాడు వచ్చే జబ్బులకు భయపడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించటము అవివేకము.
2) నాభక్తుల కష్ఠసుఖాలు తెలుసుకోవడానికి వీలుగా నాపాదాలను నమ్ముకొన్నవారి కోసము నేను ఎన్నడు పాదరక్షలు ధరించలేదు.
నేను పాదరక్షలు ధరించితే నాభక్తుల కష్ఠసుఖాలు నాకు తెలియవు కదా.
3. ఈప్రపంచములోని భార్య, భర్తల జీవన విధానము, సమస్త ప్రాణికోటి జీవన విధానము వారి కష్ఠసుఖాలు అన్నీ నాకు తెలుసు. వారి మంచిచేడులు చూసేది నేనే.
4) జీవితములో జననము మరియు మరణములను సమదృష్ఠితో చూడగలిగినవాడే నిజమైన నాభక్తుడు.
05.10.1997
నిన్నరాత్రి శ్రీసాయి కలలో ఓసన్యాసి రూపములో దర్శనము ఇచ్చి భగవంతుని గురించి తెలియచేసిన వివరాలు.
1) భగవంతుని గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా నీవు నిగర్వముతో జీవించటము అలవర్చుకో. ఆతరవాత నీతోటివారికి నీశక్త్యానుసారము సహాయముచేయి. నీవు మరణించినపుడు నీవు సంపాదించిన ధనము నీతో రాదు అని గ్రహించు. అటువంటి జీవితమును గడుపుతున్నపుడు మాత్రమే నీవు భగవంతుని గురించి తెలుసుకోగలవు.
11.10.1997
నిన్నరాత్రి శ్రీసాయి ఒకసన్యాసి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.
1) నేను ఈనాడు లేకపోయిన నాభక్తులకు వారి కలలలో దర్శనము ఇచ్చి నేను వారి మధ్య ఉన్నాననే భావన కలుగ చేస్తున్నాను.
2) ఈనాడు సమాజములో స్త్రీని అగౌరవపర్చుతు వారిని హింసించుతు జీవించుతున్నారు. ఈవిధమైన ప్రవర్తన సమాజానికి మంచిది కాదు. ఈధరిత్రిని ఉద్ధరించటానికి స్త్రీశక్తి గాయత్రిమాత రూపములో వెలిసినది. గాయత్రిమాతను పూజించి, మాత ఆశీర్వచనాలు పొందండి.
(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment