Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, February 12, 2011

బాబా తన సేవకుని తానే యెన్నుకొనుట

0 comments Posted by tyagaraju on 7:56 AM





12.02.2011 శనివారము

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి

బాబా తన సేవకుని తానే యెన్నుకొనుట

ఈ రోజు మనము ద్వారకామాయిలొ బాబాగారి చిత్రపటమునకు సంబంథించిన ఒక ఆసక్తికరమైన కథ, బాబాలీలను తెలుసుకుందాము. ఈ విషయమంతా కూడా "షిరిడీలో సిరులు"

శ్రీ యిమ్మిడిసెట్టి ప్రభాకరారవు గారిచే రచించిన పుస్తకము నుండి గ్రహింపబడినది.

1990 లో హైదరాబాద్ కు చెందినా ప్రఖ్యాత చిత్రకారుడు జ్యోతి రాజాగారు కొందరు మిత్రులతో కలిసి షిరిడి వెళ్లారు. అదే అయన షిరిడి మొదటి దర్సనం. వారు ద్వారకామాయి సమీపంలో నున్నఫూజ్యశ్రీ శివనేశన్ స్వామిని దర్శించారు. అప్పుడాయన కళ్ళు మూసుకుని థ్యానంలోకి వెళ్లి కొంచం సేపాగి జ్యోతి రాజాగారి వంక చూస్తూ "బాబా వారు తమ చిత్రం మిమ్ములను గీయమంటున్నారు. అయన సంకల్పం ఏమిటో మరి . మీకు ఇష్టమైతే గీసి వెళ్ళండి. " అన్నారు. స్వామికి తను చిత్రకారుడినని ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయారాయన. ఇంతలో టెంపుల్ ఆఫీసర్ గారు అటుగా వచ్చారు. శివనేశన్ స్వామి గారన్న విషయం తెలుసుకుని, "ఇదివరలో సంస్థాన్ వారు శ్రీ జయకర్ గారు చిత్రించిన చిత్రం రంగులు వెలవెల బోయినందువల్ల మరల చిత్రం గీయించాలని చిత్రకారులకు ఆహ్వానాలు పంపారు. బొంబాయి నుండి జైపూర్నుండి ఇద్దరు చిత్రకారులోచ్చారు. లక్ష రూపాయలు రెమ్యూనరేషన్అడిగారు. సంస్థాన్ వారు అంగీకరించారుకూడా. కానీ ఎం దు చేతనో వారిద్దరూ చిత్రం గీయకుండానే వెళ్లి పోయారు. కారణం తెలియదు" అన్నారు.

నాకే రెమ్యూనరేషనూ వద్దు. చిత్రం గీసే భగ్యం సాయి నాకెందుకిచ్చారో! సేవ చేయడమే నా అదృష్టం. మరల పది రోజులలో వస్తాను" అంటూ తిరిగి వచ్చేరు జ్యోతిరాజా.

జ్యొతిరాజాగారి చెల్లెలు 7,8 సంవత్సరాలనుండి కంటి రెటీనా జబ్బుతో బాథ పడుతూంది. ప్రఖ్యాత వైద్యులవద్ద చికిత్స చేయించారు. చివరిగా డా.సరోజినిదేవి కంటి ఆసుపత్రిలో చూపించారు. రెటీనా స్పెషలిస్టు .సత్పతిగారు, " వ్యాథికి మందు లేదు. అయినా వ్యాథి ముదరకుండా మాత్రం చూడవచ్చు. మీరు మద్రాసులోని శంకర్ నేత్రాలయంలో పరీక్ష చేయించండి." అని సలహా ఇచ్చారు. తాను షిరిడీ వెళ్ళేలోపలే చూపించాలనే ఆలోచనతో వెంటనే ఆయన తన సోదరిని తీసుకొని మద్రాస్ వెళ్ళారు. ఆక్కడ హొటలులో రూము తీసుకొని హాస్పటల్ కు వెళ్తూ "బాబా! నీ చిత్రం గీస్తానని మాట యిచ్చాను. నా మాట నిలవెట్టుకుని నీ సేవ చేయాలంటే నాకు మనహ్ స్థిమితం కావాలి. యేచేస్తావో నీ దయ" అని ప్రార్థించాడు. హాస్పటలులో మొదటి కవుంటరులో పేరు నమోదు చేయించి,రెండవ కవుంటరులో ఎమర్జెన్సీ కేసుగా కూడా నమోదు చేయించి వెళ్ళి హాలులో కూర్చున్నారు. యింతలో ఒక అపరిచిత వ్యక్తి తిన్నగా జ్యోతిరాజాగారి దగ్గరకొచ్చి, ఏమిటి ప్రాబ్లం అని అడిగి వివరాలు తెలుసుకొని, తిన్నగా డాక్టరు వద్దకు తీసుకువెళ్ళి అవసరమయిన సహాయ మంతా చేశాడు. మూడవ రోజున ఆసుపత్రి సూపరింటెండెంట్ మేరీ అబ్రహాం వద్ద అప్పాయిట్మెంట్ తీసుకుని ఆమె వద్దకు తీసుకెళ్ళాడు.

ఆమె రిపోర్టులన్నీ చూసి, "ప్రఖ్యాత వైద్యనిపుణులైన డా.శివారెడ్డిగారు, డా.సత్పతిగారుకూడా మీకు రెటీనా ప్రాబ్లం ఉందని డయాఫ్రం వేసి థృవపరిచారు. జబ్బుకు ప్రపంచంలో యెక్కడా నివారణ లేదు. కాని మా రిపోర్టుల ప్రకారం ప్రస్తుతం మీ కంటికి యేజబ్బు లేదు. మీకు మెడిసిన్ కూడా పనిలేదు. మీరు అనందంగా యింటికి వెళ్ళండి. ఇది చాలా అరుదైన అథ్భుత విషయం. యేదో మహాథ్భుత దైవశక్తి ఈమె వ్యాథిని నివారించింది. యెంత అదృష్టవంతురాలవమ్మా!" అన్నారు. ఆశ్చర్యం, ఆనందం పెల్లుబికి రాగా జ్యోతి రాజాగారు అంతవరకు గత 3 రోజులుగా వారికి సాయపడిన హాస్పటల్ స్టాఫ్ కరవయ్యగారికి నమస్కరించి కృతజ్ణతలు తెలిపారు. అతను చాలా

ఆశ్చర్యపోతూ, నేనెందుకు మీకిలా సహకరించానో నాకర్థం కావడం లేదు. అసలలా చెయ్యడానికి మా హాస్పటల్ నిబంథనలనుమతించవు. యే శక్తి నన్నావహించి యిలా చేయించిందో!" అన్నాడు.

వారం రోజుల తర్వాత జ్యోతిరాజాగారు షిరిడీ వెళ్ళి భక్తి పారవశ్యంతో అసలు చిత్రానికి దీటైన అథ్భుతమైన నకలు గీశారు. ఈనాడు మనం ద్వారకామాయిలో చూచే చిత్రమదే! సాయీ ప్రభువు యెవరిని సేవకు నెయోగిస్తారో యెవరిని రకంగా ఉథ్థరిస్తారో యెవరికెరుక?

రేపు మనము షిరిడీలో బాబాగారి విగ్రహము తయారీ వెనుక గల ఆసక్తిదాయకమైన కథ, లీలను తెలుసుకుందాము.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Friday, February 11, 2011

బాబాతో మొట్టమొదటి అనుభూతి

0 comments Posted by tyagaraju on 1:48 AM







11.02.2011 శుక్రవారము

బాబాతో మొట్టమొదటి అనుభూతి

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి

రోజు మనము మిస్ ఊర్వీలాడ్ గారి బాబా అనుభూతిని గురించి తెలుసుకుందాము. లీల ఆంగ్లములో నిన్ననే పోస్ట్ చేయబడినది.

సాయిరాం ఫ్రియాంకా జీ,

నా పేరు ఊర్వీ లాడ్. నేను కెనడా లో ఉంటాను. నేను రోజునే మీ బ్లాగ్ ను మొదటిసారి చూశాను. మీ బ్లాగుతో సహా నాకు బాబా కథలు, భక్తులానుభవాలు చదవడం యిష్టం. నా జీవితంలో జరిగిన ఒక కథని ఇప్పుడు మీతో పంచుకుంటాను.బాబా గారు నాజీవితంలో నాకు చాలా ఇచ్చారు, నా మంచికోరి ప్రతిక్షణం ఆయన నాజీవితాన్ని మారుస్తున్నారు. ప్రతి క్షణం నేను సాయి ఉనికిని అనుభవిస్తున్నాను.

నేను బాబాతో నా మొదటి అనుభూతిని మీతో పంచుకుంటున్నాను. అప్పుడు నావయసు 4 సంవత్సరాలు. నేను 1980-1981 ప్రాంతములో జరిగినది చెపుతున్నాను. మొట్టమొదటిసారిగా, నేను మా తల్లితండ్రులతో కలిసి షిరిడీ వెళ్ళాను. రోజు నామ నవమివలన షిరిడీ అంతా భక్తులతో నిండివుంది. నేను మా నాన్నగారి చెయ్యి పట్టుకున్నాను, నా సోదరుడు మా అమ్మ చెయ్యి పట్టుకున్నాడు. ఏమయిందో తెలియదు, నాకు తెలియకుండానే నేను మా నాన్నగారి చెయ్యి వదిలివేసి, మరొకరి చెయ్యి పట్టుకున్నాను. నా పేరెంట్స్ తెలుసుకునేటప్పటికి నేను వారితో లేను, వారు చాలా కంగారు పడ్డారు. వాళ్ళు ప్రతిచోటా వెదికారు, కాని ఫలితం లేకపోయింది. కాని 2-3 గంటల తరువాత వారు నన్ను సమాథి మందిరం దగ్గిర చూశారు. అక్క్డ డ నేను నా అంతట నేను కూర్చుని వున్నాను. కాని నాకు మరాఠి దుస్తులలో , తెల్లని చొక్కా, తెల్లని ఫాటు, తెల్లని టోపీ, తో ఉన్న మనిషి గురించి గుర్తు ఉంది.ఇంతసేపు అతను నాతోనే కూర్చుని నాతో, "భయపడకు, తొందరలోనే మీఅమ్మ, నాన్నగారు ఇక్కడకి వస్తారు" అని చెప్పాడు.

నా తల్లితండ్రులు, నేనసలు యేడవకుండా ఒక్కదాన్నే అక్కడ కూర్చుని వుండటం చూసి ఆశ్చర్యపోయారు.బాబా లీలని అర్థంచేసుకోవడానికి అప్పుడు నాది చాలా చిన్న వయసు.నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఆరోజు సమాథిమందిరంలో బాబాగారితో కూర్చున్నాను, నేను బాబాగారితో సమయాన్ని గడిపాను. ఆరోజునుంచి బాబాగారు నన్ను ప్రతిక్షణం నన్ను అంటిపెట్టుకునే ఉన్నారు.

ఇక్కడే మనం బాబా గారి లీలని అర్థం చేసుకోవాలి. ఉర్వీ గారు చెప్పినట్లు ఆవ్యక్తి బాబాగారే. యెందుకంటే మాములు వ్యక్తి అయితే తప్పిపోయిన పిల్లని గురించి సంస్థానం ఆఫీసులో అప్పచెప్పి ప్రకటన చేయించే వాడు. కాని ఇక్కడ ఆవ్యక్తి "చిన్నప్లిల్లయిన ఊర్వీతో "భయపడకు మీ అమ్మగారు, నాన్నగారు ఇక్కడికి వస్తారు అని చెప్పడం" బాబాగారు కాక మరి ఇంకెవరు?

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

Thursday, February 10, 2011

సాయిలీలలతో మరచిపోలేని మా షిరిడీ యాత్ర

0 comments Posted by tyagaraju on 2:52 AM









ఎన్నో సాయిలీలలతో మరచిపోలేని మా షిరిడీ యాత్ర

10.02.2011 గురువారము

నిన్న శ్రీమతి ప్రియాంకా రౌతేలా గారి "నా కలలో షిరిడీ, షిరిడీ, షిరిడీ, చదివారు. దానికి అనుబంథంగా ఈ రోజు "ఎన్నో సాయి లీలలతో మరిచిపోలేని మా షిరిడియాత్ర" చదవండి. ముందర నిన్నటిది చదివి తరువాత ఇది చదివితే కంటిన్యుయిటీ దెబ్బతినదు.
ముందర వెంటనే రెండవ లీలను పోస్ట్ చేయగలనా అని సందేహించాను. యెందుకంటే ఆంగ్లమునుండి తెలుగులోకి అనువాదం మీడియం సైజు పుస్తకంలో 14 పేజీలు వచ్చింది. మరలా దీనిని తెలుగులొ టైపు చెయ్యాలి. కాని బాబా దయవల్ల బుథవారము రాత్రికే పూర్తి చేయగలిగాను. రెండు లీలలు కూడా వెంట వెంటనే అందిద్దామన్న నా ప్రయత్నం బాబా దయవల్ల ఫలించింది.

ఆరోజు శ్రిమతి ప్రియాంకాగారు షిరిడీనుంచి ఫోన్ చేసి చెప్పారు. ఆరోజు నేను ఇంటర్నెట్లొ ఆన్ లైన్లో ప్రత్యక్ష ప్రసారం (లైవ్లో) చూడడం జరిగింది.

----------------------------------------------------------------------------------------------



బాబా గారి అనుగ్రహము వల్ల రోజు నేను మరచిపోలేని అధ్భుతమైన మా షిరిడీ యాత్ర గురించి వివరిస్తాను. క్రిందటి గురువారము నాడు మేము షిరిడీనుంచి వచ్చాము. అప్పటినుంచి మాయాత్రా విశేషములు ప్రచురిద్దామని ప్రయత్నిస్తున్నప్పటికీ బాబాగారి అనుమతి లేకుండా చేయలేకపోయాను.

ప్రతీసారీ చెబుతున్నట్లుగా కేవలం నేను టైపు చేసేదానిని మాత్రమే. దీనికి నిజమైన రచయిత సాయి మాత్రమే. ఆయన దీవెనలు లేకుండా నేను దీనిలో యే పదాన్ని తొలగించలేను. ఆయన దీవెనలతో ఈరోజు నేను దీనిని ప్రచురిస్తున్నాను.

లీలను చదివేవారికి నేను చెప్పేదేమంటే యింతకు ముందు నేను ప్రచురించిన "షిరిడీ షిరిడీ యిన్ మై డ్రీంస్" కి ఇది అనువంథము.

బాబాగారు మేము చేసిన చిన్న యాత్రలో తమ అపారమైన కరుణాకటాక్షాలను మామీద వర్షించారు. నేను లీలలన్నిటినీ సమగ్రంగా మీకు అందించగలనో లేదో నాకు తెలియదు. బాబా! ఒకవేళ ఏమయినా మరచిపోతే కనుక నన్ను మన్నించు.

నేను, మా కుటుంబము 06.11.2008 షిరిడీ వెళ్ళాము.(గురువారము) మొత్తం లీల అంతా యిక్కడ నుంచే ప్రారంభమయింది. గురువారమునాడు రాత్రి 11.50 కి మా రైలు. ఇంటినుంచి బయలుదేరేముందు నాకు చాలా ఆత్రుతగా ఉంది. బాబా ముందు దీపాలు వెలిగించాను. బాబాగారిని మాతో కూడా షిరిడీ వరకు వచ్చి, ఆయన సూచనల ప్రకారం నేను తయారు చేసిన శాలువా, చద్దార్ స్వీకరించమని కోరి ప్రార్థించాను. నేను బాబాగారికి మంచినీరు యిచ్చి స్టేషనుకు బయలుదేరాము. మేము యెక్కవలసిన రైలు అప్పటికే సిథ్థంగా వుంది. మేము లోపలికి వెళ్ళి మాసామానంతా లోపల పెట్టాము. రైలు కదలడానికి యింకా 20 నిమిషములు సమయం ఉంది. నా భర్త, తోటి ప్రయాణీకులు యింకా సద్దుకు కూర్చోవడానికి వీలుగానన్ను బయటకు రమ్మన్నారు. అందుచేత మేము రైలు దిగి బయటకు వచ్చాము. ప్లాట్ ఫారం మీద మినరల్ వాటరు, పళ్ళరసాలు అమ్మే షాపుని చూశాము. నాకు చాలా దాహంగా ఉండి, షాపు వద్దకు వెళ్ళాను. షాపు చిన్నదైనా అన్నీ చాలా చక్కగా సద్దబడి ఉన్నాయి. వాటర్ బాటిల్ తీసుకుని డబ్బు యివ్వబోతూ షాపులో ఉన్న అందమైన బాబా ఫోటో చూశాను. బాబా మొహంలో చిరునవ్వు కనపడింది. బాబాగారు మాతోకూడా షిరిడీ వస్తున్నట్లుగా నాకు సూచన అందింది. నాకు చాలా అనందము వేసి, బాబా మీద పూర్తి నమ్మకంతో ఉన్నాను.

మేము 7 తా. ఉదయం 5 గం.లకు ఢిల్లీ చేరాము. మా తరువాతి రైలు ఉదయం 10.30 కి.యింకా 5 గంటల సమయం ఉంది. మేము ఢిల్లీ స్టేషన్ లో మా తరువాతి రైలు కోసం కూర్చున్నాము. అప్పుడు ఒక ముసలి ఫకీరు, పసుపు పచ్చ చోలా తెల్లని థోవతి థరించి కఱ్ఱ సహాయంతో నడుస్తూ వచ్చాడు. అతనిని నేను చాలా సేపటినుంచి, గమనిస్తూ వున్నాను. అతను యెవ్వరినీ డబ్బు ఆడగలేదు. యెవరితోనూ మాట్లాడలేదు కాని, అతను మాదగ్గరకు వచ్చి డబ్బు ఆడిగాడు. నా భర్త 10/- రూ.యిచ్చారు. ఫకీరు సంతోషంతో నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. నా దృష్టి యింకా అతని మీదే ఉంది, కాని, హటాత్తుగా క్షణకాలంలో అతను మాయమయిపోయాడు.

అప్పుడే ఇంకా తెలతెలవారుతున్న ఉదయం మూలాన, యెక్కువమంది జనం లేరు. అటువంటప్పుడు ఫకీరు ఎలా మాయమయిపోయాడు? నాకు అర్థమైంది. ఆయన బాబాగారే! నేను వున్నాను అని నిరూపించడానికి వచ్చారు.

సంఘటన తరువాత మేము ఆర్మీవారు వేచియుండే గదిలోకి వెళ్ళి, మాతరువాతి రైలుకు చాలా సమయం ఉండటంతో అక్కడే గడిపాము. మా రైలుకి 1.30 గంటలు ఆలశ్యం ఉందని తెలిసింది. ఇది వినేటప్పటికి నాకు చాలా నిరాశ కలిగింది. కాని, యేదీ నాచేతిలో లేదు. చివరికి మా రైలు ఉదయం 11.45 కి బయలుదేరింది. మా ప్రయాణం ప్లాన్ ప్రకారం, మేము పూనా వెడతాము. ఆక్కడ నా భర్త స్నేహితుడు, భార్య కూడా మాతోపాటు షిరిడీ వస్తారు. ప్లాన్ ప్రకారం మేము రిజర్వేషన్స్ చేసుకున్నాము. మరునాడు ప్రొద్దున్న నవంబరు 8 . మారైలు 10 గంటలకి మన్మాడ్ చేరుకుంది. మన్మాడ్ స్టేషన్ చేరుకునేటప్పటికి నేనింకా నిద్రలో ఉన్నాను. నా భర్త నన్నులేపి మన్మాడ్ వచ్చింది చూడు అని చెప్పారు. నేను చాలా సంతోషించాను, యెందుకంటే సచ్చరిత్రలో మన్మాడ్ గురించిన కథలు చాలా చదివాను. మన్మాడ్ స్టేషన్ నుంచి రైలు బయలుదేరింది. 5 నిమిషాల తరువాత మరలా ఆగిపోయింది. సిగ్నల్ ప్రోబ్లం వల్ల అయి ఉండవచ్చు. నేను బయటకు చూస్తున్నాను. హటాత్తుగా నేను ఒక పీర్ బాబా యొక్క సమాథిని చూశాను. దాని మీద ఆరంజ్ రంగు శాలువా ఉంది.

నాకు చాలా థ్రిల్లింగా అనిపించింది, యెందుకంటే నేను కూడా బాబాగారికి ఆరంజ్ రంగు శాలువానే సమర్పిస్తున్నాను. నేను ఫోటొ తీద్దామనుకునేలోపులో రైలు కదిలింది. కాని, బాబా దయవల్ల నేను రెండు ఫోటోలు తీయగలిగాను. ఫోటొ యిక్కడ జత చేశాను.

ఫోటొలని నేను మరలా మరలా చూస్తుండగా నా మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. అంతకుముందు దాకా నాకు, నేను సమర్పించే శాలువాని, చద్దార్ (బాబా సమాథి మీద వేసే వస్త్రం) షిరిడీలో ఆయన తీసుకుంటారా లేదా అనే సందేహం ఉండేది. ఇది చూసిన తరువాత బాబాగారు నేనిచ్చే శాలువా, చద్దార్ తీసుకుంటారన్నదానికి సంకేతం అనిపించింది. ఇలా ఆలోచనలతో ఉండగా రైలు అటెండంట్ వచ్చి మాకు భోజనం కావాలా అని ఆడిగాడు. నా భర్త అతనిని రైలు పూనా ఎప్పుడు వెడుతుంది అని అడిగాదు. " రోజు సాయంత్రం 5 గంటలకు వెళ్ళాలి" కాని, నాలుగు గంటలు ఆలశ్యంగా నడుస్తోంది" అని చెప్పాడు. నేను మథ్యలొ కల్పించుకుని "సాయంత్రానికి ముందు షిరిడీ వెళ్ళడానికి మార్గమేమన్నా ఉందా" అని అడిగాను. "ఓహ్! మీరు షిరిడీ వెళ్ళాలా? అయితే పూనా వెడుతున్నారెందుకు? క్షణంలోనైనా కోపర్గావ్ రావచ్చు. మీరు కోపర్గావ్ లో దిగండి. అక్కడినుంచి షిరిడీ 20 కి.మీ. " అని చెప్పాడు.

అంతే మేము, అక్కడక్కడా పడివున్న మా సామానంతా సద్దేశి కోపర్గావ్ లో దిగడానికి సిథ్థమయ్యాము. 5 నిమిషాలలో మా రైలు కోపర్గావ్ చేరింది. స్టేషన్లో దిగగానే మాకు పెద్ద బోర్డు కనిపించింది. "షిరిడీ వెళ్ళేవారు యిక్కడ దిగవలెను" అని రాసుంది దాని మీద. నాకు నోట మాట రాలేదు. ఫోటొ జత చేస్తున్నాను. స్టేషన్లో ఉన్న బాబా ఫోటో కూడా జత చేస్తున్నాను. మేము షిరిడీ కి టాక్సీ మాట్లాడుకున్నాము. అన్ని చోట్లా బాబాని చూడటంతో నాకు చాలా సంతోషము వేసింది. సాయి టీ స్టాల్, సాయి హోటల్, సాయి బుక్ స్టాల్, యిలా ప్రతిచోటా నా సాయి. బి.ఎస్.ఎన్.ఎల్. మీద కూడా బాబా, ఫోటొ కూడా జత చెస్తున్నాను.

12 గంటలకి మేమనుకున్న షిరిడీ చేరుకున్నాము. టాక్సి దిగి మేము పుణ్యభూమి షిరిడీలో మా పాదాలు పెట్టగానే మథ్యాహ్న హారతి విన్నాము. మా హోటల్ సమాథి మందిరానికి దగ్గరగా ఉంది. హోటల్ లో గదితీసుకుని ప్రవేశించాము. నేను మొహము కూడా కడుక్కోకుండా, బాబాగారికి శాలువా, చద్దార్ ఏవిథంగా సమర్పించాలో కనుక్కోవడానికి బయటకు వెడుతున్ననని నా భర్తకు చెప్పి బయలుదేరాను.

నేను శాలువా తీసుకుని సమాథి మందిరం వైపు నడవడం మొదలుపెట్టాను. నాకు షిరిడీ రావడం యిదే మొదటిసారి కాబట్టి యెక్కడకు వెళ్ళాలో నాకు తెలియదు. కొంత మందిని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు యెక్కడ వుందో కనుక్కుని లోపలకు వెళ్ళాను. నేనేంచేయాలో నాకు తెలియదు కాని, గుడ్డిగా వెళ్ళిపోయాను.

ఆఫీసులో యెవరినైనా కలవడానికి యెమన్నా సహాయం చేయగలడేమోనని ఒక సెక్యూరిటి గార్ద్ ని అడిగాను. 15 నిమిషాల తరువాత అతను నన్ను పిలిచి ఆఫీసులోకి తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక ఉద్యోగిని కలుసుకుని, విషయమంతా చెప్పి బాబాగారికి శాలువా యిద్దామనుకుంటున్నట్లు చెప్పాను.

"వైటింగ్ లిస్ట్ చాలా ఉంది కాబట్టి అది సాథ్యం కాదు, కాని యివన్నీ చూసే వ్యక్తి మీద ఆథార పడి వుంటుంది" అని చెప్పాడు. కాని, మిమ్మల్ని హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంటు ని కలవడానికి తీసుకువెడతానని" చెప్పాడు. నాతో కూడా ఒకతనిని తోడిచ్చి పంపాడు. నేను లోపలికి వెళ్ళేంతవరకు, యితను నన్ను యెక్కడికి తీసుకువెడుతున్నాడో తెలియదు. ఆశ్చర్యం నుంచి తేరుకునేటప్పటికి నేను బాబాగారి సమాథిముందు ఉన్నాను. నా కళ్ళంబట నీళ్ళుకారుతున్నాయి. నేను బాబాగారి సమాథి ముందు నుంచుని వున్నానంటే నమ్మలేకపోతున్నాను.

బాబాకి సమర్పించడానికి నావద్ద డబ్బులు గాని, పువ్వులు గాని లేవు. ప్రయాణానికి 2 రోజులక్రితం వేసుకున్న దుస్తులతోనే ఉన్నాను.

బాబాగారు నన్ను యింత తొందరగా తన ముందు, అదీ వి.వి..పి. లు వుండే చోట నిలబెడతారని ఊహించలేదు. నా చేతిలో ఉన్న శాలువాతో 20 నిమిషములు బాబా ముందు నిలబడి ఉన్నాను. సంతోషంతో నేను మరీ మరీ ఏడవడం మొదలుపెట్టాను. రిక్త హస్తాలతో వచ్చినందుకు బాబాగారిని క్షమించమని ఆడిగాను. కాని, నా తనువు, మనస్సు, టన్నులకొద్దీ భక్తిని, ప్రేమని అర్పిస్తోందని విన్నవించుకున్నాను. 20 నిమిషాల తరువాత నాతో వచ్చినతను నా వెనకే నాదర్శనం పూర్తి అయేంతవరకూ వేచిచూస్తున్నాడని గ్రహించాను. అతను నన్ను ఆఫీసులోకి తీసుకువెళ్ళాడు. అక్కడ ఒకపెద్ద వయసున్న ఒకాయనకి పరిచయం చేశాడు.

ఆయనతో "సర్, నేను స్వయంగా, శాలువాను తయారు చేసి, దానిమీద 108 సాయినామాలు రాశాను. దీనిని బాబాగారికి సమర్పించాలనుకుంటున్నాను" అని చెప్పాను. ఆయన నుంచుని, నా శాలువా చూశారు. నాకు లోపల భయంగా వుంది ఆయన ఒప్పుకోరేమోనని.

"చాలా అందంగా తయారు చేశావమ్మా! తప్పకుండా బాబాగారికి వేస్తాము" అనేటప్పటికి నాకు ఆశ్చర్యం వేసింది. కాని, చాలా వైటింగ్ లిస్ట్ ఉన్నందున బహుశా ఒక నెల తరువాత వేస్తారేమో అనుకున్నాను. "సర్!, ఇది బాబాగారికి యెప్పుడు వేస్తారో చెబుతారా?" అని అడిగాను.

ఆయన నవ్వి, " రోజు సాయంత్రం" అన్నారు. నా గుండె ఆగినట్లయింది అది వినేటప్పటికి. నా సంతోషానికి అవథులు లేవు. మరలా కన్నీరు ఉబికి రావడం ప్రారంభమయింది. నేను ఆఫీసు బయటకు వచ్చి మరలా బాబాగారి ముందుకు వచ్చాను. బాబాగారు నాకు, నా కుటుంబం మీద యింతటి కరుణామృతాన్ని కురిపిస్త్తున్ననందులకు కృతజ్ణతలు తెలుపుకున్నాను.

నేను బయటకు వచ్చి హోటల్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళాను. చూసేవారంతా యేమిటి ఈవిడ యిల్లా పరిగెడుతూ వెడుతోంది అనుకున్నారు. కాని, నేను దేనినీ లక్ష్య పెట్టలేదు. యెందుకంటే నేను సాయి ప్రపంచంలో విహరిస్తున్నాను. నా కన్నులు బాబాని మాత్రమే చూస్తున్నాయి మరి వేటినీ కాదు. నేను హోటలుకు వెళ్ళి బాబాగారికి శాలువా రోజు సాయంత్రమే వేస్తున్నారని చెప్పాను. నా భర్త కూడా ఆశ్చర్యపోయి జోక్ చెయ్యద్దన్నారు. ఇది నమ్మడానికి ఆయనకి కొంత సమయం పట్టింది. బాబాగారికి శేజ్ ఆరతికి వేస్తున్నారు అని చెప్పాను.

2.30 కి మేము సమాథి మందిరంలోనికి వెళ్ళాము. నేను బాబాగారిని శాలువాలో యెప్పుడు చూద్దామా అనే ఆత్రుతలో నిలవలేకుండా ఉన్నాను.

ఇంకా రెండువందలమంది భక్తులు పంపిన కోరికలు ఉన్న లిస్ట్ బాబాగారికి నివేదించడానికి సమాథి మందిరంలోకి వెళ్ళాము. నేను సమర్పించిన శాలువాలో బాబా గారిని చూసి చాలా థ్రిల్ అయ్యాను. నా శరీరమంతా రోమాలు నిక్కబొడుచుకున్నాయి.నా దృష్టి అంతా వెలుగుతోనిండిన నా సద్గురుసాయి నాథుని మీదే కేంద్రీకృతమయింది. బాబాగారి వదనం చిరునవ్వులు చిందిస్తూ నావైపు చూస్తున్నట్లుగా అనుభూతి చెందాను. బాబాగారు ఆరతికి మొట్టమొదట ఉన్న 10 మందిలో మమ్మలిని నిలబెట్టారు. నేను నా దైవమైన బాబాగారిని సంతోషంలో ఆనంద భాష్పాలతో, ప్రేమ, భక్తి లతో కనులార వీక్షించగలిగాను. మేము ఆరతిని పూర్తిగా బాబాగారికి చాలా దగ్గిరగా నుంచుని చూశాము. అయిన తరువాత మేము వస్తుండగా పూజారిగారు, బాబాగారి సమాథిమీంచి ఒక పెద్ద దండను తీసి ఇచ్చారు. నేనిచ్చిన ప్రేయర్స్ కూడా బాబాగారి సమాథిమీద పెట్టారు.

బాబాగారు తమ బిడ్డల యొక్క ప్రేయర్స్ ను అంగీకరించినందుకు చాలా సంతోషించాను.

ఇంతమంది ఉండగా పూజారిగారు, దండను నాకే ఎందుకిచ్చారు అని ఆలోచించాను. ప్రశ్న నా మదిలో తేలుతూఉంది. అప్పుడు నాకనిపించింది, అవును, బాబాగారు నన్ను ఆశీర్వదించారు.

రాత్రి నేను 10 గంటలకు సచ్చరిత్ర చదవడానికి ద్వారకామాయికి వెళ్ళాను. హటాత్తుగా 1.00 గంటకి ఒక పిల్లి వచ్చి నా ఒడిలో ఉన్న సచ్చరిత్రమీద కూర్చుంది. అప్పుడు నేను 189 పేజీ చదువుతున్నాను. పిల్లి దాదాపు ఒక గంట సేపటివరకు కూర్చుని, కిందకి దిగి, బాబా ఫోటో ముందు కూర్చుంది. పిల్లి యెవరివద్దకూ వెళ్ళకుండా బాబా ఫోటొ వంకే చూస్తూ ఉండటం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది.

రాత్రి అక్కడ దాదాపు 15 మంది ద్వారకా మాయిలో కూర్చుని ఉన్నారు. వారిలో చాలామంది పిల్లిని రమ్మని పిలిచినా అది యెవరివద్దకూ వెళ్ళలేదు. మళ్ళీ, మళ్ళీ, నా కళ్ళు పిల్లినే చూస్తున్నాయి. కాని నేను పుస్తకాన్ని పూర్తి చేయవలసిఉంది. అందుచేత చదువు మీదే దృష్టి పెట్టాను.

45 నిమిషములలో నేను చరిత్రలో 215 పేజీ చదువుతున్నప్పుడు, పిల్లి మళ్ళీ వచ్చి, నా ఒడిలో ఉన్న సచ్చరిత్ర మీద కూర్చుంది. అది రాత్రంతా నా ఒడిలో అల్లా కూర్చునేఉంది. ఇక ప్రొద్దున్న 4 గంటలకు ఉదయం ఆరతికి ముందు అది లేచి మరలా బాబా ఫోటో దగ్గరకు వెళ్ళింది. అప్పుడు అక్కడున్న చాలా మంది చెప్పారు " అది బాబాగారి పిల్లి, అది యెవరిఒళ్ళోనూ కూర్చోదు" అని. బాబాగారు నన్ను ఇంకా ఆశీర్వదిస్తున్నందుకు చాలా సంతోషించాను.

నేను యిప్పుడు తిరిగి హోటలికి వెళ్ళి ఫలహారం చేసి, మరలా సమాథి మందిరానికి సచ్చరిత్ర పుస్తకాలు కొనడానికి వెళ్ళాము. మేము పుస్తకాలు కొన్న తరువాత సమాథులు చూడటానికి వెళ్ళాము. నేను మొదటి సమాథి వద్దకు వెళ్ళి ప్రార్థన చేసి తిరిగి వస్తూండగా, నా బూట్ల దగ్గర 800/- రూపాయలు పడి ఉండటం చూశాను. అక్కడ చాలా మంది ఉన్నారు. 800/- ఇక్కడ ఎలా పడి ఉన్నాయి? అంతమందిలో ఎవరూ చూడలేదా?

బాబాగారు నాకు, తమ దీవెనలను ఎన్నో విథాలుగా అందిస్తున్నారు. నేను మాటలలో వర్ణించలేను. మా షిరిడీ యాత్ర అంతా కూడా చమత్కారాలతో, బాబా లీలలతో నిండిపోయింది.

నా పరమపిత పరమేశ్వర్ సాయినాథ్ మహరాజ్ ని వర్ణించడానికి నేను మాటలని వెదుక్కోవలసివస్తోంది. బాబాగారు నిజంగా తమ అపరిమితమైన దీవెనలను మా షిరిడీ యాత్రలో మాకందించారు. మాలాంటివారు రోజుకి 100 తప్పులు చేసినాకూడా బాబాగారు తమ పరిథిని దాటి ఆశీస్సులు, అందచేస్తూ ఉంటారు. బాబాగారి మీద నా ప్రేమను నేను వ్యక్తం చేయలేను. కాని అది ఆయనకే తెలుసు. షిరిడీ యాత్ర నా మదిలో చెరగని ముద్ర వేసింది. నా కనిపిస్తోంది, ఇది చాలు మథుర క్షణాలు నా జీవితంలో కలకాలం ఉండిపోతాయి.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List