11.02.2011 శుక్రవారము
బాబాతో మొట్టమొదటి అనుభూతి
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
ఈ రోజు మనము మిస్ ఊర్వీలాడ్ గారి బాబా అనుభూతిని గురించి తెలుసుకుందాము. ఈ లీల ఆంగ్లములో నిన్ననే పోస్ట్ చేయబడినది.
సాయిరాం ఫ్రియాంకా జీ,
నా పేరు ఊర్వీ లాడ్. నేను కెనడా లో ఉంటాను. నేను ఈ రోజునే మీ బ్లాగ్ ను మొదటిసారి చూశాను. మీ బ్లాగుతో సహా నాకు బాబా కథలు, భక్తులానుభవాలు చదవడం యిష్టం. నా జీవితంలో జరిగిన ఒక కథని ఇప్పుడు మీతో పంచుకుంటాను.బాబా గారు నాజీవితంలో నాకు చాలా ఇచ్చారు, నా మంచికోరి ప్రతిక్షణం ఆయన నాజీవితాన్ని మారుస్తున్నారు. ప్రతి క్షణం నేను సాయి ఉనికిని అనుభవిస్తున్నాను.
నేను బాబాతో నా మొదటి అనుభూతిని మీతో పంచుకుంటున్నాను. అప్పుడు నావయసు 4 సంవత్సరాలు. నేను 1980-1981 ప్రాంతములో జరిగినది చెపుతున్నాను. మొట్టమొదటిసారిగా, నేను మా తల్లితండ్రులతో కలిసి షిరిడీ వెళ్ళాను. ఆ రోజు నామ నవమివలన షిరిడీ అంతా భక్తులతో నిండివుంది. నేను మా నాన్నగారి చెయ్యి పట్టుకున్నాను, నా సోదరుడు మా అమ్మ చెయ్యి పట్టుకున్నాడు. ఏమయిందో తెలియదు, నాకు తెలియకుండానే నేను మా నాన్నగారి చెయ్యి వదిలివేసి, మరొకరి చెయ్యి పట్టుకున్నాను. నా పేరెంట్స్ తెలుసుకునేటప్పటికి నేను వారితో లేను, వారు చాలా కంగారు పడ్డారు. వాళ్ళు ప్రతిచోటా వెదికారు, కాని ఫలితం లేకపోయింది. కాని 2-3 గంటల తరువాత వారు నన్ను సమాథి మందిరం దగ్గిర చూశారు. అక్క్డ డ నేను నా అంతట నేను కూర్చుని వున్నాను. కాని నాకు మరాఠి దుస్తులలో , తెల్లని చొక్కా, తెల్లని ఫాటు, తెల్లని టోపీ, తో ఉన్న మనిషి గురించి గుర్తు ఉంది.ఇంతసేపు అతను నాతోనే కూర్చుని నాతో, "భయపడకు, తొందరలోనే మీఅమ్మ, నాన్నగారు ఇక్కడకి వస్తారు" అని చెప్పాడు.
నా తల్లితండ్రులు, నేనసలు యేడవకుండా ఒక్కదాన్నే అక్కడ కూర్చుని వుండటం చూసి ఆశ్చర్యపోయారు.బాబా లీలని అర్థంచేసుకోవడానికి అప్పుడు నాది చాలా చిన్న వయసు.నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఆరోజు సమాథిమందిరంలో బాబాగారితో కూర్చున్నాను, నేను బాబాగారితో సమయాన్ని గడిపాను. ఆరోజునుంచి బాబాగారు నన్ను ప్రతిక్షణం నన్ను అంటిపెట్టుకునే ఉన్నారు.
ఇక్కడే మనం బాబా గారి లీలని అర్థం చేసుకోవాలి. ఉర్వీ గారు చెప్పినట్లు ఆవ్యక్తి బాబాగారే. యెందుకంటే మాములు వ్యక్తి అయితే తప్పిపోయిన పిల్లని గురించి సంస్థానం ఆఫీసులో అప్పచెప్పి ప్రకటన చేయించే వాడు. కాని ఇక్కడ ఆవ్యక్తి "చిన్నప్లిల్లయిన ఊర్వీతో "భయపడకు మీ అమ్మగారు, నాన్నగారు ఇక్కడికి వస్తారు అని చెప్పడం" బాబాగారు కాక మరి ఇంకెవరు?
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment