12.02.2011 శనివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
బాబా తన సేవకుని తానే యెన్నుకొనుట
ఈ రోజు మనము ద్వారకామాయిలొ బాబాగారి చిత్రపటమునకు సంబంథించిన ఒక ఆసక్తికరమైన కథ, బాబాలీలను తెలుసుకుందాము. ఈ విషయమంతా కూడా "షిరిడీలో సిరులు"
శ్రీ యిమ్మిడిసెట్టి ప్రభాకరారవు గారిచే రచించిన పుస్తకము నుండి గ్రహింపబడినది.
1990 లో హైదరాబాద్ కు చెందినా ప్రఖ్యాత చిత్రకారుడు జ్యోతి రాజాగారు కొందరు మిత్రులతో కలిసి షిరిడి వెళ్లారు. అదే అయన షిరిడి మొదటి దర్సనం. వారు ద్వారకామాయి సమీపంలో నున్నఫూజ్యశ్రీ శివనేశన్ స్వామిని దర్శించారు. అప్పుడాయన కళ్ళు మూసుకుని థ్యానంలోకి వెళ్లి కొంచం సేపాగి జ్యోతి రాజాగారి వంక చూస్తూ "బాబా వారు తమ చిత్రం మిమ్ములను గీయమంటున్నారు. అయన సంకల్పం ఏమిటో మరి . మీకు ఇష్టమైతే గీసి వెళ్ళండి. " అన్నారు. ఈ స్వామికి తను చిత్రకారుడినని ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయారాయన. ఇంతలో టెంపుల్ ఆఫీసర్ గారు అటుగా వచ్చారు. శివనేశన్ స్వామి గారన్న విషయం తెలుసుకుని, "ఇదివరలో సంస్థాన్ వారు శ్రీ జయకర్ గారు చిత్రించిన చిత్రం రంగులు వెలవెల బోయినందువల్ల మరల చిత్రం గీయించాలని చిత్రకారులకు ఆహ్వానాలు పంపారు. బొంబాయి నుండి జైపూర్నుండి ఇద్దరు చిత్రకారులోచ్చారు. లక్ష రూపాయలు రెమ్యూనరేషన్అడిగారు. సంస్థాన్ వారు అంగీకరించారుకూడా. కానీ ఎం దు చేతనో వారిద్దరూ చిత్రం గీయకుండానే వెళ్లి పోయారు. కారణం తెలియదు" అన్నారు.
“నాకే రెమ్యూనరేషనూ వద్దు. ఆ చిత్రం గీసే భగ్యం సాయి నాకెందుకిచ్చారో! ఈ సేవ చేయడమే నా అదృష్టం. మరల పది రోజులలో వస్తాను" అంటూ తిరిగి వచ్చేరు జ్యోతిరాజా.
జ్యొతిరాజాగారి చెల్లెలు 7,8 సంవత్సరాలనుండి కంటి రెటీనా జబ్బుతో బాథ పడుతూంది. ప్రఖ్యాత వైద్యులవద్ద చికిత్స చేయించారు. చివరిగా డా.సరోజినిదేవి కంటి ఆసుపత్రిలో చూపించారు. రెటీనా స్పెషలిస్టు డ.సత్పతిగారు, "ఈ వ్యాథికి మందు లేదు. అయినా వ్యాథి ముదరకుండా మాత్రం చూడవచ్చు. మీరు మద్రాసులోని శంకర్ నేత్రాలయంలో పరీక్ష చేయించండి." అని సలహా ఇచ్చారు. తాను షిరిడీ వెళ్ళేలోపలే చూపించాలనే ఆలోచనతో వెంటనే ఆయన తన సోదరిని తీసుకొని మద్రాస్ వెళ్ళారు. ఆక్కడ హొటలులో రూము తీసుకొని హాస్పటల్ కు వెళ్తూ "బాబా! నీ చిత్రం గీస్తానని మాట యిచ్చాను. నా మాట నిలవెట్టుకుని నీ సేవ చేయాలంటే నాకు మనహ్ స్థిమితం కావాలి. యేచేస్తావో నీ దయ" అని ప్రార్థించాడు. హాస్పటలులో మొదటి కవుంటరులో పేరు నమోదు చేయించి,రెండవ కవుంటరులో ఎమర్జెన్సీ కేసుగా కూడా నమోదు చేయించి వెళ్ళి హాలులో కూర్చున్నారు. యింతలో ఒక అపరిచిత వ్యక్తి తిన్నగా జ్యోతిరాజాగారి దగ్గరకొచ్చి, ఏమిటి ప్రాబ్లం అని అడిగి వివరాలు తెలుసుకొని, తిన్నగా డాక్టరు వద్దకు తీసుకువెళ్ళి అవసరమయిన సహాయ మంతా చేశాడు. మూడవ రోజున ఆసుపత్రి సూపరింటెండెంట్ మేరీ అబ్రహాం వద్ద అప్పాయిట్మెంట్ తీసుకుని ఆమె వద్దకు తీసుకెళ్ళాడు.
ఆమె రిపోర్టులన్నీ చూసి, "ప్రఖ్యాత వైద్యనిపుణులైన డా.శివారెడ్డిగారు, డా.సత్పతిగారుకూడా మీకు రెటీనా ప్రాబ్లం ఉందని డయాఫ్రం వేసి థృవపరిచారు. ఆ జబ్బుకు ప్రపంచంలో యెక్కడా నివారణ లేదు. కాని మా రిపోర్టుల ప్రకారం ప్రస్తుతం మీ కంటికి యేజబ్బు లేదు. మీకు మెడిసిన్ కూడా పనిలేదు. మీరు అనందంగా యింటికి వెళ్ళండి. ఇది చాలా అరుదైన అథ్భుత విషయం. యేదో మహాథ్భుత దైవశక్తి ఈమె వ్యాథిని నివారించింది. యెంత అదృష్టవంతురాలవమ్మా!" అన్నారు. ఆశ్చర్యం, ఆనందం పెల్లుబికి రాగా జ్యోతి రాజాగారు అంతవరకు గత 3 రోజులుగా వారికి సాయపడిన హాస్పటల్ స్టాఫ్ కరవయ్యగారికి నమస్కరించి కృతజ్ణతలు తెలిపారు. అతను చాలా
ఆశ్చర్యపోతూ, నేనెందుకు మీకిలా సహకరించానో నాకర్థం కావడం లేదు. అసలలా చెయ్యడానికి మా హాస్పటల్ నిబంథనలనుమతించవు. యే శక్తి నన్నావహించి యిలా చేయించిందో!" అన్నాడు.
వారం రోజుల తర్వాత జ్యోతిరాజాగారు షిరిడీ వెళ్ళి భక్తి పారవశ్యంతో అసలు చిత్రానికి దీటైన అథ్భుతమైన నకలు గీశారు. ఈనాడు మనం ద్వారకామాయిలో చూచే చిత్రమదే! సాయీ ప్రభువు యెవరిని ఏ సేవకు నెయోగిస్తారో యెవరిని ఏ రకంగా ఉథ్థరిస్తారో యెవరికెరుక?
రేపు మనము షిరిడీలో బాబాగారి విగ్రహము తయారీ వెనుక గల ఆసక్తిదాయకమైన కథ, లీలను తెలుసుకుందాము.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment