13.02.2011 ఆదివారము
బాబా విగ్రహము - కథామృతము
బాబా గారి విగ్రహము తయారి వెనుక కథ లీల ఈ రోజు మనము తెలుసుకుందాము. ఈ విషయాన్ని శ్రీ యిమ్మిడి ప్రభాకర రావు గారు రచించిన "షిరిడీలో సిరులు" అనే పుస్తకము నుండి గ్రహింపబడినది.
ఒకసారి ఇటలి నుంచి ఒక చక్కటి పాలరాయి బొంబాయి ఓడరేవుకొచ్చింది. అది యెలా వహ్చిందో యెందుకొచ్చిందో యెవరికీ తెలీదు. దానిని తీసుకువెళ్ళడానికి యెవరూ రాకపోయేసరికి, రేవు అథికారులు దానిని వేలం వేశారు. వేలంలో స్వంతం చేసుకున్నవ్యక్తి, కొన్నాళ్ళ తరవాత మరి యే ప్రేరణతోనో దానిని షిరిడీ సంస్థానానికి సమర్పించాడు. ఆ రాతి నాణ్యతను గుర్తించిన సంస్థానంవారు దానితో బాబా శిల్పం చెక్కిచాలని నిర్ణయించి, బొంబాయికి చెందిన బాలాజి వసంత్ తాలిం అనే ప్రఖ్యాత శిల్పికి ఆ బాథ్యతను అప్పగించారు.
అనేక కోణాలలో తీసిన సాయి ఫోటోలే లేవు. బాబాకు తీసిన ఫొటోలు కూడా చాలా కొద్ది. అవి కూడా వేరు వేరు వయస్సులకు చెందినవి. అందువలన ఎంత శ్రమించినా నమూనా మూర్తి సంతృప్తిగా రాలేదు. చివరి ప్రయత్నంగా అతడు సాయినే ప్రార్థించాడు. నాటి రాత్రి బాబా అతనికి కలలో కంపించి, "నన్ను మళ్ళీ, మళ్ళీ, చూడాలంటే సాథ్యం కాదు. జాగ్రత్తగా చూడు" అని తన ముఖాన్ని వివిథ కోణాలలో చూపించారు. అతడు సాయి చుట్టూ నెమ్మదిగా తిరుగుతూ (కలలోనే) ఆయన రూపాన్ని అన్ని వైపుల నుండి పరికించాడు. ఆ స్వప్న సాక్షాత్కార బలంతో తెల్లవారగానే ప్లస్టర్ ఆఫ్ పారిస్తో చక్కని నమూనా మూర్తిని తయారు చేసి, దానినిబట్టి ఐదు అడుగుల ఐదు అంగుళాల యెత్తు పాలరాతి విగ్రహం అపురూపంగా మలచాడు. అంటే సాయి తనంతటతానుగా తన ప్రతిరూపాన్ని తయారు చేయించుకున్నారు. అది జీవకళ తొణికిసలాడుతూ వుండే సజీవ ప్రతిమ. భక్తులకు అది సాయి ప్రతిరూపం కాదు. సాయియే! ఈనాడు అంబరాన్ని చుంబించే భవంతులతో, లెక్కకు మిక్కిలి వాణిజ్య సముదాయాలతో వజ్రాల ద్వీపంలా వెల్గొందుతున్న షిరిడీలో, రాజ భవనంవంటి సమాథి మందిరంలో సిమ్హా సనంపై కూర్చున్న సామ్రాట్టులా శ్రీ సాయినాథుని మూర్తి శోభిస్తూ వుంటుంది.
శ్రీ తాలిం గారు బాబా విగ్రహము చెక్కుతున్న ఫోటోలు, వీడియో
ఈ క్రింద ఇచ్చిన లింక్స్ ఓపెన్ చేసి చూడండి.
http://www.scribd.com/doc/36929990/Photos-Details-Making-of-Sai-Baba-s-Original-Idol-at-Shirdi
http://shirdisaibaba.magnify.net/video/Talim-interview-Shirdi-SaiBaba
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంథువులారా ప్రతీరోజూ ఒక బాబా లీల లేక బాబా తత్వము అందిస్తూ వచ్చాను. ప్రస్తుతం 4 లేక 5 రోజులు బాబా లీలలని అందించడానికి సాథ్యముకాదు. 4 రోజులలొ బెంగళూరు వెడుతున్నాము. అక్కడ సుమారు రెండు నెలలు ఉంటాము. బెంగళూరు వెళ్ళినతరువాత అక్కడనించి లాప్టాప్ నుంచి లీలలను పోస్ట్ చేస్తాను.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment