18.02.2011 శుక్రవారము
సాయి మనవెంటే ఉంటారు
సాయి బంధువులారా ఈ రోజు మనము శ్రీ సాయి అంకిత భక్తులలో ఒకరైన శ్రీ వేమూరి వెంకటేశ్వరరావు గారి ని బాబాగారు యెట్లు అనుగ్రహించారో తెలుసుకుందాము.
బాబాయేమన సర్వస్యము అని త్రికరణసుథ్థిగా ఆయనను ఆశ్రయించినప్పూడే, మనకు ఆయనతోను, ఆయనకి మనతోనూ విడదీయరాని అనుబంథం పెరుగుతుంది. అప్పుడే మనము ఆయనకి అంకిత భక్తులుగా ఉంటాము.
శ్రీ వేమూరి వెంకతేశ్వర్లు గారి జన్మ స్థలము గుంటూరు జిల్లా రేపల్లెలోని ఒక గ్రామం. ఆంథ్రప్రదేష్. బాబాను 1929 సంవత్సరములో (24 సంవత్సరముల వయస్సులో ఆశ్రయించిరి).
శ్రీ వేమూరి వెంకటేశ్వర్లు గారు గొప్ప సాయి భక్తులు. 1935వ సంవత్సరమున నవంబరు 20వ తేదీ తెల్లవారుఝామున వీరు తెనాలి నుండి రేపల్లె వెళ్ళుటకు యింటినుండి గుఱ్ఱపు బండిలో స్టేషనుకు బయలుదేరిరి. అప్పటికి విద్యుత్ దీపములు లేవు. వీరు యెక్కిన గుఱ్ఱపుబండి వేగముగా వెళ్ళుచున్నది.
తెల్లవారుఝామున నాలుగు గంటల సమయములో ఆ చీకటిలో వీరి బండికి వెనుక కొంతదూరమునుండి "ఏయ్ బండీ ! ఆపు, ఆపు, బండీ ! ఆపు, ఆపు" అని కేకలు వీరికి వెనబడినవి. యెవరో బండి ఆపుమని కేకలు వేయుచున్నారు, బండి , అపుమని బండివానితో వెంకటేశ్వర్లుగారు చెప్పగా, మనని కాదండి, రైలు టైము అవుతున్నది అని అనుచు బండి ఆపక బండివాడు బండిని పోనిచ్చాడు. ఆ దారులో మూడు కాలువలకు కలిపి వంతెనలు ఉన్నవి. ఆ వంతెనలలో మొదటి వంతెన బండి యెక్కినది. నాలుగడుగులుకూడా యెక్కలేదు. యింతలో యెవరో ఆ బండి కుడి ప్రక్క చక్రమును గట్టిగా నెట్టినారు. ఆ తోపుకు బండి పడిపోవున్నంతగా అనిపించి బండివాడు గుఱ్ఱమును పట్టి నిలిపి బండిని ఆపినాడు. ఆ చక్రమును నెట్టిన వ్యక్తి బండివానిపై కేకలు వేయుచూ "ఆపమని కేకలు వేయుచున్నను బండి ఆపలేదేమి? నీకు చెవులు లేవా? వినబడుటలేదా?నూలువాసిలో ప్రమాదము తప్పిపోయినది. ఈ బండి చక్రము ప్రక్కన యున్న "శాయి మేకు" ఊడిపోయి చక్రము యిరుసు చివరకు జారివచ్చి క్రిదపడిపోవుటకు సిథ్థముగా యున్నది. ఒక్క క్షణమైనచో ఈ బండి కాలువలో పడియుండెడిది. దానితో మీరు, మీ గుఱ్ఱము కూడ ఆ కాలువలో యుండెడివారు. యెంత అజాగ్రత్త" అని ఆ బండివానిపై అరచుచూ చీవాట్లు పెట్టినాడు. యిదంతయు బండిలో యుండి వినుచున్న వెంకటేశ్వర్లుగారు బండినుండి బయటకు దూకి చూడగా ఆ బండి చక్రమునకు రక్షగా ఉండెడి శాయిమేకు లేక ఆ చక్రము ఊడుటకు సిథ్థముగా యున్నట్లు మునిసిపల్ కిరోసిన్ వీథి లైట్ల వెలుగురులో చూచి, తమను సమయమునకు వచ్చి కాపాడినవాని వంక చూచినాడు. ఆ వ్యక్తి నెరసిన, మాసిన గడ్డముతో ముడుతలు పడిన ముఖము, భుజముపై అతుకులబొంత, మోకాలు జారని చింపిరి పంచెతో యుండి, "బాబూ! భయములేదు. యిక నేను వెళ్ళిరానా? ప్రమాదము తప్పిపోయినదిలే" అనుచు అచటనుడి వెళ్ళిపోయెను.
ఈ హడావుడిలో, తత్తరపాటులో తనను ఆవిథముగా రక్షించిన ఆవ్యక్తికి కృతజ్ణతలు చెప్పుటకానీ, ఆ వ్యక్తిని గురించిన వివరములు తెలుసుకొనుటగాని వెంకటేశ్వర్లుగారు చేయలేదు. ఆ చీకటిలో ఆవ్యక్తి వంతెన దిగి వెళ్ళిపోయాడు. వెంకటేశ్వర్లుగారు బండి యెక్కక కాలినడకన స్టేషనుకు బయలుదేరిరి. అట్లు వెళ్ళుచుండ సాయిబాబా కాక నన్ను ఈ ఆపదనుండి కాపాడు వారెవరు అని తలంపురాగానే ఆ ఆవేశములో "బాబా" అని కేక పెట్టారు. "అంత చీకటిలో ఆ బండి చక్రమునకు శాయిమేకు లేదని గమనించువారెవరు? వెనక దూరములో యుండి కేక వేయుచున్న వ్యక్తి పరుగెత్తుచున్న బండిని యెట్లు చేరాడు? సమయమునకు చక్రము పడకుండా లోపలకు నెట్టి యెట్లు కాపాడగలిగెను? అది శ్రీ సాయికే సాథ్యము కాని యితరులకు అట్లు రక్షించుటకు సాథ్యమవదు. నా వెంటనే ఉండి, నా కొరకు కేకలు పెట్టుచు పరిగెత్తివచ్చి నాకు ప్రాణదానమిడిన సాయి ప్రభువును గుర్తించలేకపోతెనే, కృతజ్ణత చెప్పలేకపోతెనే " అని వెంకటేశ్వర్లుగారు చింతించారు.
వెంకటేశ్వర్లు గారు యేకాంతముగా థ్యానము చేయుచూ అనుభూతులు పొందుచూ అనందమును పొందెడివారు. శ్రీ సాయిబాబా ఆకారముపై దృష్టినినిల్పి యితర విషయములను మనస్సునకు రానిచ్చెడివారు కాదు.
తన అంకిత భక్తులను సర్వశ్య శరణాగతి పొందిన భక్తులను బాబా యిట్లే ఆదుకొనుట మనకు ఈ లీల ద్వారా తెలుస్తోంది.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.
0 comments:
Post a Comment